భక్తులకు అలెర్ట్ కేదార్‌నాథ్ ఆలయం మూసివేత
యావత్ భారత దేశంలో అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్ ఆలయం తలుపులు మూత పడ్డాయి. ఇవాళ ఉదయం ఆఖరి పూజ నిర్వహించి ఆలయ తలుపు మూసేశారు అర్చకులు. ఆలయంలోని పంచముఖీ దేవత విగ్రహాన్ని ఆర్మీ భద్రతతో ఓంకారేశ్వరాలయానికి తరలించారు.
యావత్ భారత దేశంలో అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్ ఆలయం తలుపులు మూత పడ్డాయి. ఇవాళ ఉదయం ఆఖరి పూజ నిర్వహించి ఆలయ తలుపు మూసేశారు అర్చకులు. ఆలయంలోని పంచముఖీ దేవత విగ్రహాన్ని ఆర్మీ భద్రతతో ఓంకారేశ్వరాలయానికి తరలించారు. శీతాకాలం ప్రారంభం కావడంతో ఆలయ తలుపులను మూసివేశారు. మళ్లీ ఈ ఆలయ తలుపులు ఆరు నెలల తరువాతే తెరచుకోనున్నాయి. ఈ ఆరు మాసాలు ఆలయం పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. అప్పటి వరకూ భక్తులు ఉఖిమఠ్ లోని ఓంకారేశ్వర్ ఆలయంలో భోలే బాబా ఆరాధన, దర్శనం చేసుకోవచ్చు. దేశంలోని ప్రసిద్ధిచెందిన ఛార్‌ధామ్ ఆలయాలు.. శీతాకాలం ప్రారంభం కావడంతో మూతపడుతున్నాయి.
కేదార్‌నాథ్ ఆలయాన్ని మూయడం కంటే ముందే ఛార్‌ధామ్ ఆలయాల్లో ఒకటైన గంగోత్రి ధామ్ ఆలయ తలుపులను మూసివేశారు. దీని తరువాత కేదార్‌నాథ్‌లో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించి గుడి తలుపులు మూసేశారు. వీటితోపాటు యమునోత్రి ఆలయ తలుపులను కూడా ఈ ఆదివారం మూసివేయనున్నట్టు అధికారులు ప్రకటించారు. ఇదే కాకుండా ఆఖరి ఆలయమైన బద్రీనాథ్ ఆలయం కూడా త్వరలోనే మూతపడనుంది. నవంబర్ 17వ తేదీన రాత్రి 9 గంటలకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బద్రీనాథ్ ఆలయాన్ని మూసివేయనున్నట్లు ఆలయ అధికారులు చెప్తున్నారు. గుడి తలుపులు మూసి ఉన్న ఈ ఆరు నెలలూ ఈ ప్రాంతాల్లో తీవ్రమైన మంచు ఉంటుంది. ఈ సమయంలో భక్తులకు ఇక్కడికి అనుమతి ఉండదు. ఈ ప్రాంతాల్లో మనుషులు బతకడం ఆసాధ్యం. ఈ కారణంగానే 6 నెలల పాటు ఆలయాలు మూసివేస్తారు. వేసవి కాలం ప్రారంభం అయ్యే సమయానికి అంటే సుమారు ఆరు నెలల తరువాత మళ్లీ ఆలయాలను తెరుస్తారు. అప్పటి వరకూ భక్తులు దైవ దర్శనం కోపి వేచి ఉండాల్సిందే.