ALLA RAMAKRISHNA REDDY: షర్మిలపై ఆళ్ల కోవర్టు ఆపరేషన్.. వెళ్లి.. వెనక్కి వచ్చింది అందుకేనా?
వైసీపీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే.. అలా వెళ్లి, ఇలా ఎందుకు రిటర్న్ అయినట్లు..? అసలు కాంగ్రెస్‌లో ఏం జరిగింది..? నిజంగానే షర్మిలతో విభేదాలు వచ్చాయా..? లేదంటే షర్మిల బలం ఏంటో తెలుసుకోవడానికే కోవర్టుగా వెళ్లారా..?

ALLA RAMAKRISHNA REDDY: వెళ్లి.. మళ్లీ వచ్చినా.. జగన్‌ను హత్తుకున్నా.. మళ్లీ వైసీపీ భజన మొదలుపెట్టినా.. ఆళ్ల వ్యవహారంలో చాలా అనుమానాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయ్. నియోజకవర్గానికి నిధులు రావట్లేవు.. పార్టీ అవకాశం ఇవ్వడం లేదు అంటూ భారీ డైలాగ్‌లు కొట్టి మరీ.. వైసీపీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే.. అలా వెళ్లి, ఇలా ఎందుకు రిటర్న్ అయినట్లు..? అసలు కాంగ్రెస్‌లో ఏం జరిగింది..?
YS SHARMILA: అధికారంలోకి వచ్చి ఎన్ని ఉద్యోగాలిచ్చారు.. జగన్‌కు షర్మిల ప్రశ్న
నిజంగానే షర్మిలతో విభేదాలు వచ్చాయా..? లేదంటే షర్మిల బలం ఏంటో తెలుసుకోవడానికే కోవర్టుగా వెళ్లారా..? అన్నీ తెలుసుకొని మళ్లీ తిరిగి వచ్చారా..? అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. మిగతా ఎమ్మెల్యేలతో కంపేర్ చేస్తే.. ఆళ్లకు అంతో ఇంతో క్లీన్ ఇమేజ్ ఉంది. అలాంటిది ఆయన వైసీపీకి హ్యాండ్ ఇచ్చి మరీ.. హస్తం అందుకోవడం మీద మొదటి నుంచి అనుమానాలు వినిపించాయ్. నిజానికి వైఎస్ ఫ్యామిలీకి, ముఖ్యంగా జగన్‌కు ఆళ్ల రామకృష్ణారెడ్డి విశ్వాసంతో ఉంటారు. ఐతే వైసీపీకి బైబై చెప్పిన తర్వాత.. షర్మిలతో వెళ్లిన ఆళ్ల.. తాను కాంగ్రెస్ అభ్యర్థిగా మంగళగిరిలో పోటీ చేస్తానని ప్రకటించారు. ఆ తర్వాత షర్మిల ఇంట జరిగిన వివాహ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. అయితే అసలు ఆళ్ల ఆమెతో వెళ్లిందే షర్మిలపై నిఘా వేయడానికేనని, ఆమెను వైసీపీ నేతలు ఎవరెవరు కలుస్తున్నారు.. ఆమెకు ఎవరెవరు నిధుల సాయం చేస్తున్నారు.. షర్మిల ఎవరితో మాట్లాడుతున్నారన్న దానిపై నిఘా వేసేందుకే ఆళ్లను జగన్ పంపించారంటూ సోషల్ మీడియాలో రకరకాల ప్రచారం ఊపందుకుంది.
జగన్, ఆళ్ల అనుబంధంపై అవగాహన ఉన్న షర్మిల.. ఆయనను నమ్మలేదన్న ప్రచారం కూడా జరుగుతోంది. అందుకే ఆళ్లను దూరం పెట్టారని.. దీంతో చేసేదేమీ లేక ఆయన తిరిగి జగన్ గూటికి చేరుకున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. ప్రస్తుతానికి ఇది ఊహ మాత్రమే. మరి నిజంగా ఏం జరిగి ఉంటుంది..? నిజంగా నిజం ఏంటి..? ఆళ్ల రిటర్న్ వెనక అసలు కారణాలు ఏంటి..? అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారిందిప్పుడు.