Top story: ఫైర్అ నుకున్నాం… ఫ్లవర్ అయ్యాడు…

అతను నడుస్తుంటే బాడీ లాంగ్వేజే వేరుగా ఉంటుంది. మాటలు చేష్టలు,... అన్ని యాంగిల్స్ లోను ఆత్మవిశ్వాసానికి బదులు అతివిశ్వాసం బయటపడుతుంది. 5 ఏళ్లలో గట్టిగా మూడు సినిమాలు హిట్ అయ్యేటప్పటికి నన్ను మించినోడు ఇక్కడ లేడు అనుకున్నాడు. తన ఫ్యాన్స్ కి ఏకంగా అల్లు ఆర్మీ అని పేరు పెట్టుకున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 16, 2024 | 12:05 PMLast Updated on: Dec 16, 2024 | 12:05 PM

Allu Arjun Became Flower Over Police Issue

అతను నడుస్తుంటే బాడీ లాంగ్వేజే వేరుగా ఉంటుంది. మాటలు చేష్టలు,… అన్ని యాంగిల్స్ లోను ఆత్మవిశ్వాసానికి బదులు అతివిశ్వాసం బయటపడుతుంది. 5 ఏళ్లలో గట్టిగా మూడు సినిమాలు హిట్ అయ్యేటప్పటికి నన్ను మించినోడు ఇక్కడ లేడు అనుకున్నాడు. తన ఫ్యాన్స్ కి ఏకంగా అల్లు ఆర్మీ అని పేరు పెట్టుకున్నాడు. పుష్ప సినిమాలో హీరో లాగే తగ్గేదేలే అని బయట కూడా ఉండొచ్చు అనుకున్నాడు. సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ప్రతివాడు వంగి వంగి సలాములు కొడతాడు కనుక ప్రపంచమంతా అలాగే ఉంటుంది అనుకున్నాడు. కానీ బయట చూస్తే పిక్చర్ వేరుగా ఉంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో మహిళ మరణానికి కారణం నువ్వు కూడా అంటూ ఏ లెవెన్ గా అరెస్టు చేసి తీసుకెళ్లిపోయారు పోలీసులు. ఒక్కసారిగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ షాక్ అయిపోయింది. మెగా ఫ్యామిలీ నుంచి ఒక పాపులర్ హీరోని, జాతీయ అవార్డు అందుకున్న నటుడిని, నిర్మొహమాటంగా పట్టుకెళ్ళి స్టేషన్ నుంచి కోర్టుకి, మళ్లీ కోర్టు నుంచి జైలుకి తీసుకెళ్లి కూర్చో పెట్టారు. ఇండస్ట్రీలో నేను తోపుని, డాన్స్ లో నన్ను మించినోడే లేడు, నేషనల్ అవార్డు వస్తుందని నాకు ముందే తెలుసు, నా ఫంక్షన్ కి ఎవడు రావక్కర్లేదు నాకు నేనే చీఫ్ గెస్ట్…. ఇలాంటి బడాయి కబుర్లతో చెల్లరేగిపోయిన అల్లు అర్జున్… ప్రజాస్వామ్యం ఎలా ఉంటుందో చూశాడు. రాజ్యాంగ వ్యవస్థ లు… పోలీసులు తలుచుకుంటే ఎవ్వడినైనా మడతపెట్టి ఎక్కడ కూర్చోబెడతాయో అర్థమైంది బన్నీ బాబుకి.

నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చబ్బా…. వాళ్లే నా ఆర్మీ… వాళ్లే అల్లు ఆర్మీ అని ప్రగల్బాలు పలికిన అల్లు అర్జున్ నీ అరెస్టు చేసి లోపలే వేస్తే…. అల్లు ఆర్మీలో ఒక్కడు కూడా బయటికి రాలేదు. ఆత్మహత్యలు జరగలేదు. కిరసనాయిలు డబ్బాలు పట్టుకొని ఎవడు పరుగులు పెట్టలేదు. ధర్నాలు … ఉద్యమాలు జరగలేదు. చివరికి అల్లు అర్జున్ కి తన ఆర్మీ పవర్ ఏంటో అర్థం అయింది. నువ్వేమైనా సరిహద్దుల్లో కాపలాకాసే సైనికుడివా నీకు గౌరవం ఇవ్వడానికి, ఆఫ్ట్రాల్ సినిమా ఆక్టర్ వి. సినిమాలు తీసి డబ్బులు సంపాదించే వాడివి. రాజ్యాంగం ముందు సెలబ్రిటీ అయినా ఒకటే… పొలిటికల్ లీడర్ అయినా ఒకటే అందరూ సామాన్యులే. ఒక మహిళ చావుకి నువ్వు కారణమయ్యప్ప నిన్ను లోపల వేశాను అని చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి మొహం మీద కొట్టినట్లు చెప్తుంటే… మన ఐకాన్ స్టార్ వెనుకున్నోళ్లంతా ముఖంలో నెత్తురు చుక్క లేకుండా చూస్తుండి పోయారు. ఇప్పుడు అందరికీ అర్థమైంది అల్లు అర్జున్ ఫైర్ కాదు ఫ్లవర్లేనని. అల్లు అర్జున్ఏ కాదు. ప్రజాస్వామ్యంలో తనను తాను ఫైర్ అనుకునే వాడు ఎవడైనా ఫ్లవరే.

అసలు పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వచ్చినప్పుడు… అయ్యగారి బిల్డప్పులు చూడాలి. బెడ్ రూమ్ లోకి డైరెక్ట్ గా వచ్చేస్తారా…. బయటకు పోండి. డ్రెస్ చేంజ్ తీసుకొచ్చే వరకు ఆగలేరా…? అంటూ పోలీసులతో వాదన పెట్టుకున్నాడు ఫ్లవర్ స్టార్. ఆ తర్వాత పోలీసులు ఎదురుగా నిలబడి నవ్వుతూ కాఫీ తాగుతూ, మరోపక్క భార్యతో పరిహాసాలాడుతూ… వెళ్తూ వెళ్తూ ఆమెకు ఒక ముద్దు ఇచ్చి మరి… ఐకాన్ స్టార్ చేసిన అతి వేషాలు అన్ని ఇన్ని కావు. అక్కడితో ఆపలేదు అయ్యగారు. వాళ్ల నాన్న అల్లు అరవింద్ పోలీస్ వాహనంలో ఎక్కితే…. నువ్వెందుకు? నువ్వు దిగు… ఈ ఇష్యూలో ఏ క్రెడిట్ అయినా నాకే దక్కాలి.. అంటూ ఏకంగా ప్రభుత్వాల్ని వ్యవస్థల్ని ఛాలెంజ్ చేసే విధంగా బిల్డప్ ఇచ్చాడు అల్లు అర్జున్. ఆ తర్వాత అరగంటకు ….అరగంటకి పరిస్థితులో మార్పు వస్తుంటే మన పుష్పా లో జోష్ తగ్గిపోయింది. రెండు కోట్లు పోతే పోతాయి…. హైకోర్టులో బెయిల్ వచ్చేస్తుంది అన్న ధీమాతో బోర్ర విరుచుకుని…. స్టైల్ గా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో, ఆ తర్వాత గాంధీ ఆసుపత్రిలో బిల్డప్ ఇచ్చాడు స్టైలిష్ స్టార్. హైకోర్టులో బెయిల్ రావడం ఆలస్యం అవుతుంది అనేటప్పటికి నిదానంగా ఫేస్ మారిపోతూ వచ్చింది.

మరోవైపు నాంపల్లి కోర్టులో జడ్జ్ 14 రోజులు రిమాండ్ విధించడంతో బన్నీ షాక్ అయిపోయాడు. కోర్టు నుంచి నిమిషాల్లో చంచల్ గుడా జైలుకి తరలించారు పోలీసులు. సరిగ్గా జైలుకు చేరుకోవడానికి కొన్ని నిమిషాలు ముందు సాయంత్రం 5:30 కి హైకోర్టు బన్నీకి బెయిల్ ఇచ్చింది. అప్పటివరకు డీలా పడిపోయిన ఐకాన్ స్టార్ హమ్మయ్య బతికిపోయిన అనుకున్నాడు. కానీ ఊహించని విధంగా అదే సమయంలో ఢిల్లీలో సీఎం ఉన్న రేవంత్ ఇండియా టుడే కాంక్లేవ్ లో బన్నీ బ్యాచ్ కి అదిరిపోయే స్ట్రోక్ ఇచ్చారు. వాడేమైనా సరిహద్దుల్లో పనిచేస్తున్న సైనికుడా, సినిమా తీసి డబ్బులు సంపాదించేవాడు… ఓపెన్ టాప్ కారులో అందరికీ చేతులు యాగి చేయడం వల్లే సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగి మహిళ చనిపోయింది. ఆమె కొడుకు చావు బతుకుల మధ్య ఉన్నాడు…. దీనికి బాధ్యులైన ఎవరినైనా లోపల వేస్తాం అంటూ రేవంత్ రివర్స్ అటాక్ చేసేటప్పటికి పిక్చర్ మారిపోయింది. హై కోర్ట్ ఆర్డర్ చేతికి వచ్చేటప్పటికి రాత్రి 10:30 అయింది. దీంతో జైలు అధికారులు నిబంధనలకు వ్యతిరేకంగా ఆ సమయంలో అల్లు అర్జున్ ని రిలీజ్ చేయలేమంటూ నిక్కచ్చిగా చెప్పేశారు. నిరాశతో… నిస్పృహ తో బన్నీ తండ్రి అల్లు అరవింద్… ప్రైవేట్ క్యాబ్ మాట్లాడుకుని చంచలగూడ దగ్గరనుంచి కన్నీళ్ళతో ఇంటికి వెళ్లిపోయాడు.

టాలీవుడ్ లో మాస్టర్ బ్రెయిన్ గా పేరుపడిన అరవింద్ కొడుకు జైలుకి వెళ్లకుండా కాపాడలేకపోయాడు. అల్లు అర్జున్ కి 7697 ఖైదీ నెంబర్ ఇచ్చి రిమాండ్ ఖైదీగా మంజీరా బేరక్కు పంపించారు. ఏది జరగకూడదని అనుకున్నా డో, ఏది జరగకుండా అన్ని రకాలు ప్రయత్నాలు చేశారో అది జరిగిపోయింది. స్టైలిష్ స్టార్ ఇద్దరు ఖైదీలతో కలిసి జైల్లో రాత్రంతా గడపాల్సి వచ్చింది. గంటల్లో కోట్లు ఖర్చుపెట్టి హైకోర్టు ఆర్డర్ తెచ్చిన ఫలితం లేకపోయింది. పుష్ప ఒకరోజు చంచల్ కూడా జైల్లో ఉన్నాడు అనే ముద్ర పడిపోయింది. పుష్ప టు లో డబ్బులు ఇచ్చి పోలీస్ స్టేషన్ కొనేసినట్లు రియల్ లైఫ్ లో పోలీస్ స్టేషన్ ని, కోర్టుల్ని, జైల్ ని కొనలేకపోయాడు అల్లు అర్జున్. రాత్రంతా కరుడు కట్టిన ఖైదీలు మధ్య రిమాండ్ ఖైదీగా కాలం గడపాల్స్ వచ్చింది. సెవెన్ సిక్స్ నైన్ సెవెన్ నెంబర్ తో జీవితాంతం కేసులో నిందితుడిగా ఉండాల్సి వచ్చింది. చివరికి తెల్లవారుగానే జైలు వెనక డోర్ ద్వారా ఇంటికి చేరుకున్నాడు బన్నీ. జీవితంలో ఎక్కడికైతే రాకూడదు అనుకుంటామో… అక్కడ ఒక భయంకరమైన రాత్రి గడిపాడు బన్నీ. ఫ్లవర్ అనుకుంటున్నారా ? నేను ఫైర్ ని అని చెప్పిన అంత తేలిక కాదని ఇప్పుడు అర్థమైంది. జైలు నుంచి వచ్చాక మీడియాతో చాలా అనుకువగా మాట్లాడాడు. మీ అరెస్టు వెనక ఎవరైనా ఉన్నారని మీరు అనుకుంటున్నారా అని ప్రశ్నిస్తే చేతులెత్తి నమస్కరించాడు. నోటి నుంచి ఒక్క మాట రాలా. ఇదంతా ఎందుకు జరిగిందో, ఎవరి వెనుక ఉండి నడిపించారో అన్ని అల్లు అర్జున్ కి తెలుసు. కానీ మాట్లాడ లేడు. ఎందుకంటే ఫైర్ సినిమాలో మాత్రమే. బయట బన్నీ ఫ్లవరే. ఈ విషయాన్ని ఓవరాల్ ఎపిసోడ్లో పోలీసులు నిరూపించారు. హీరోలు సినిమాలో మాత్రమే ఫైర్లు. బయటకు వచ్చి తేడాపాడా చేస్తే ఫ్లవర్ గానే మిగిలిపోతారు.