క్షమించు కళ్యాణ్ బాబాయ్… మా కోసం నిలబడ్డావ్, పవన్ కు బన్నీ ఆర్మీ రిక్వస్ట్
పుష్ప 2 సినిమా రిలీజ్ కి ముందు రిలీజ్ తర్వాత మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ దూరంగా ఉన్నాడు అనే విషయం చాలామందికి ఒక క్లారిటీ ఉంది. దాదాపుగా మూడు నాలుగేళ్ల నుంచి మెగా ఫ్యామిలీతో దూరం పాటిస్తున్న అల్లు అర్జున్ ఈ సినిమా విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగానే మెగా ఫ్యామిలీని దూరం పెట్టేసాడు.
పుష్ప 2 సినిమా రిలీజ్ కి ముందు రిలీజ్ తర్వాత మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ దూరంగా ఉన్నాడు అనే విషయం చాలామందికి ఒక క్లారిటీ ఉంది. దాదాపుగా మూడు నాలుగేళ్ల నుంచి మెగా ఫ్యామిలీతో దూరం పాటిస్తున్న అల్లు అర్జున్ ఈ సినిమా విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగానే మెగా ఫ్యామిలీని దూరం పెట్టేసాడు. సినిమా విజయం సాధించిన రికార్డులు బద్దలు కొట్టినా అది మెగా ఫ్యామిలీ క్రెడిట్ లోకి వెళుతుంది అని భావించిన అల్లు అర్జున్ అసలు మెగా ఫ్యామిలీని ఏ ప్రమోషన్ కార్యక్రమానికి పిలిచే ప్రయత్నం కూడా చేయలేదు.
ఇక దీనిపై మెగా అభిమానులు సీరియస్ గా ఉండి సినిమాను అసలు చూసే ప్రయత్నం కూడా చేయలేదు. సోషల్ మీడియాలో సినిమాను పెద్ద ఎత్తున ట్రోల్ కూడా చేశారు. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత మాత్రం మెగా హీరోలు అందరూ ఏకతాటి పైకి రావడం చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఇప్పటి వరకు బన్నీ విషయంలో చూసి చూడనట్టు వ్యవహరించిన మెగా హీరోలు అందరూ ఇప్పుడు బయల్దేరి హైదరాబాద్ వెళ్ళారు. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాను రద్దు చేసుకుని మరి అల్లు అర్జున్ కోసం హైదరాబాదు వెళ్లారు.
ఆ తర్వాత పవన్ కళ్యాణ్ విజయవాడలో అధికారిక కార్యక్రమాన్ని ముగించుకుని వెంటనే ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాగబాబు కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. అలాగే సినిమా నిర్మాతలు పలువురు స్టార్ హీరోలు సోషల్ మీడియా వేదికగా అలాగే ప్రత్యక్షంగా అల్లు అర్జున్ కు తమ మద్దతు ప్రకటించారు. ఈ ఘటనతో మెగా హీరోలు అందరూ అల్లు అర్జున్ కు అండగా నిలబడ్డారు. మళ్ళీ అందరూ కలిసి పోయారు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు.
ఈ విషయంలో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు ఏమాత్రం ఆందోళనలో పడకుండా మెగా ఫ్యామిలీ మొత్తం అండగా నిలబడటంతో అందరూ ఖుషీ అవుతున్నారు. అరెస్ట్ అయితే అయ్యాడు గాని అదే సంతోషం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ అభిమానులు కూడా భవిష్యత్తులో అందరం కలిసే ఉందామంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లడం చూసి మెగా అభిమానులతో పాటుగా అల్లు అభిమానులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అధికారిక కార్యక్రమాల్లో ఉండి కూడా మా కోసం నిలబడ్డావు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. క్షమించు పవనన్నా నిన్ను అనవసరంగా మాటలు అనేసాం అంటూ ఎమోషనల్ అయిపోతున్నారు.