Banny vasu : ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదని.. పవన్ పై అల్లు అర్జున్ కి కోపం
పవన్ కల్యాణ్ - బన్నీ మధ్య విభేదాలకు కారణమంటూ... ఇప్పుడో కొత్త ఇన్సిడెంట్ బయటపడింది. తాను రికమండ్ చేసిన వ్యక్తికి... పవన్ కల్యాణ్ టిక్కెట్ ఇవ్వలేదన్న కోపంతోనే అల్లు అర్జున్ నంద్యాలలో వైసీపీ అభ్యర్థికి ప్రచారం చేశాడన్న టాక్ వస్తోంది.

Allu Arjun is angry with Pawan for not giving him a ticket
పవన్ కల్యాణ్ – బన్నీ మధ్య విభేదాలకు కారణమంటూ… ఇప్పుడో కొత్త ఇన్సిడెంట్ బయటపడింది. తాను రికమండ్ చేసిన వ్యక్తికి… పవన్ కల్యాణ్ టిక్కెట్ ఇవ్వలేదన్న కోపంతోనే అల్లు అర్జున్ నంద్యాలలో వైసీపీ అభ్యర్థికి ప్రచారం చేశాడన్న టాక్ వస్తోంది. పిఠాపురంలో నిలబడ్డ పవన్ కి Xలో జస్ట్ ట్వీట్ చేసి… నంద్యాలలో శిల్పా రవి ఇంటికెళ్ళి సపోర్ట్ చేయడం మెగా-అల్లు కుటుంబాల్లో పెద్ద చిచ్చు రేపింది. ఈ సంఘటన తర్వాత నాగబాబు ట్వీట్ చేయడం… ఎన్నికల్లో గెలిచిన తర్వాత చిరంజీవి ఇంట్లో సంబరాలకు అల్లు ఫ్యామిలీ డుమ్మా కొట్టడం… బన్నీ ప్లస్ ఆయన వైఫ్ ని సోషల్ మీడియాలో సాయి ధరమ్ తేజ్ అన్ ఫాలో చేయడం. ఇవన్నీ వరుసగా జరిగిన పరిణామాలు. కానీ అసలు పవన్ – అల్లు అర్జున్ మధ్య ఓ ఎమ్మెల్యే సీటు విషయంలో మనస్పర్థలు వచ్చినట్టు లేటెస్ట్ గా బయటపడింది.
అల్లు ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడైన నిర్మాత బన్నీ వాసు వల్లే ఈ గొడవంతా వచ్చినట్టు చెబుతున్నారు. బన్నీ వాసు మెగా ఫ్యామిలీకి వీరాభిమాని. గీతా ఆర్ట్స్ నిర్వహణలో కీలక వ్యక్తి. బన్నీవాసు పెట్టుకున్న GA2 పిక్చర్స్ బ్యానర్ ద్వారా అల్లు అరవింద్ నిర్మాతగా పరిచయం చేశారు. జనసేన పార్టీలో యాక్టీవ్ రోల్ పోషించిన వాసుని.. పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్ గా నియమించారు పవన్ కల్యాణ్. అటు బన్నీ వాసు కూడా … పవన్ అనుకున్న రేంజ్ లో కష్టపడ్డారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పాలకొల్లు, పిఠాపురం లేదంటే… ఉభయ గోదావరి జిల్లాల్లో ఏదో ఒక నియోజకవర్గంలో నిలబడాలని బన్నీ వాసు అనుకున్నాడు. కానీ కూటమితో పొత్తు వల్ల వాసు ప్లాన్ వర్కవుట్ కాలేదు.
ఈ సంగతి అల్లు అరవింద్ దృష్టికి తీసుకెళ్ళాడు వాసు. తాను పవన్ కల్యాణ్ తో మాట్లాడతానని హామీ ఇచ్చారట అరవింద్. పవన్ తో మాట్లాడితే… పొత్తులు, సామాజిక సమీకరణాల వల్ల టిక్కెట్ ఇవ్వడం కష్టమని తేల్చి చెప్పాడట. నేను స్వయంగా రికమండ్ చేస్తే… బన్నీవాసుకు పవన్ ఎందుకు టిక్కెట్ ఇవ్వలేదని అల్లు అర్జున్ కోపం వచ్చిందట. అందుకే పవన్ మీద కోపంతోనే ప్రత్యర్థి పార్టీ వైసీపీ నేత అయిన శిల్పా రవి తరపున ప్రచారం చేశాడని టాక్ నడుస్తోంది. అయితే అల్లు అరవింద్ ప్రపోజ్ చేసింది బన్నీ వాసును కాదనీ… అనవసరంగా ఈ వివాదంలో అతడిని లాగుతున్నారని మరికొందరు అంటున్నారు. ఈ కాంట్రోవర్సీపై నిర్మాత బన్నీవాసు స్పందిస్తే గానీ అసలు సంగతి బయటపడదు.