అమరావతికి పుష్ప, నువ్వే దిక్కు కళ్యాణ్ బాబాయ్, రియలైజ్ అయిపోయాడు
మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ కు మధ్య ఆధిపత్య పోరు దాదాపు నాలుగేళ్ల నుంచి నడుస్తూనే ఉంది. ఈ పోరు ఎప్పుడు ఏ మలుపులు తిరుగుతుందో అని చాలామంది ఎదురు చూశారు. కానీ అనూహ్యంగా అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో అందరూ షాక్ అయ్యారు.
మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ కు మధ్య ఆధిపత్య పోరు దాదాపు నాలుగేళ్ల నుంచి నడుస్తూనే ఉంది. ఈ పోరు ఎప్పుడు ఏ మలుపులు తిరుగుతుందో అని చాలామంది ఎదురు చూశారు. కానీ అనూహ్యంగా అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో అందరూ షాక్ అయ్యారు. దీనితో మెగా ఫ్యామిలీ మళ్ళీ దగ్గర అయింది. అసలు సమస్యలేవీ లేవు అని చాలామంది భావిస్తూనే ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం అల్లు అర్జున్ ను కలవడానికి ఇష్టపడకపోవడం అలాగే హైదరాబాద్ వచ్చిన సరే అల్లు అర్జున్ కనీసం ఫోన్ కూడా చేయకపోవడం సంచలనం అయింది.
ఇక అల్లు అర్జున్ కూడా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లకపోవడం అనేక అనుమానాలకు ఇప్పుడు సెంటర్ అవుతోంది. అయితే త్వరలోనే అల్లు అర్జున్ అమరావతి వెళ్లే ఛాన్స్ కనబడుతోంది. భవిష్యత్తులో సంధ్య థియేటర్ ఘటన విషయంలో తీవ్ర పరిణామాలు ఉండే అవకాశం ఉంది అనే విషయం స్పష్టత వచ్చింది. దీనితో అల్లు అర్జున్… తనకు పవన్ కళ్యాణ్ మద్దతు తప్పనిసరి అనే భావనలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అందుకే అమరావతి వెళ్లి పవన్ కళ్యాణ్ ను కలవాలని భావిస్తున్నారట.
పుష్ప సినిమా ధరలు పెంచే విషయంలో కూడా పవన్ కళ్యాణ్ ఏమి పట్టుదల వ్యవహరించలేదు. కాబట్టి వెళ్లి స్వయంగా ధన్యవాదాలు చెప్పి వివాదాన్ని ముగించాలని అల్లు అర్జున్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీకి కాకుండా వైసిపి అభ్యర్థికి అల్లు అర్జున్ ప్రచారం చేయడానికి వెళ్ళడం మెగా ఫాన్స్ అలాగే జనసేన కార్యకర్తలతో పాటుగా పవన్ కళ్యాణ్ కూడా జీర్ణించుకోలేదు. దీనితోనే అసలు మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు కలవలేదు అనే ప్రచారం కూడా జరిగింది.
వీటికి ముగింపు పలకడానికి అల్లు అర్జున్ రెడీ అయ్యాడు. అందుకే త్వరలోనే అమరావతి వెళ్లి పవన్ కళ్యాణ్ ను కలిసి అవసరమైతే లంచ్ కూడా చేయాలని భావిస్తున్నారట. ఇక సంధ్య థియేటర్ ఘటన విషయంలో అల్లు అర్జున్ ను మరోసారి అరెస్టు చేయవచ్చు అనే ప్రచారం కూడా జరుగుతోంది. హైదరాబాద్ పోలీసులు ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి ఆరోగ్య పరిస్థితి కూడా ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. దీనితో ఏం జరగబోతుంది అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంట్రెస్టింగా మారింది. ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉంది. దీనితో సినిమా పరిశ్రమమొత్తం కూడా భయపడుతోంది. ఆ చిన్నారి ఆరోగ్యానికి ఏమీ కాకూడదని అల్లు అర్జున్ ఫ్యాన్స్ పూజలు కూడా చేస్తున్నారు. అటు మెగాస్టార్ చిరంజీవి కూడా ఆసుపత్రికి వెళ్లి ఆ చిన్నారిని పరామర్శించే అవకాశం ఉంది అని ప్రచారం జరుగుతుంది.