పుష్ప తగ్గాడా? తగ్గించారా? మెగా స్టార్ ఇంటికి అల్లు అర్జున్
నాకు ఫ్యాన్స్ కాదు ఆర్మీ ఉందన్నాడు... సొంతగా పాన్ ఇండియా స్టార్ అవుతా నేను ఎక్కడ తగ్గేది లేదని కాలర్ ఎగరేసాడు. టాలీవుడ్ లో నేనే రియల్ మెగాస్టార్ అంటూ దమ్ము చూపించే ప్రయత్నం చేశాడు. మీరు తెలుగులో మాత్రమే స్టార్లు ఏమో నేను బాలీవుడ్ లెవెల్ లో స్టార్ పాన్... ఇండియా లెవెల్ లో నాకు తిరుగు లేదంటూ తొడ కొట్టే రేంజ్ కి వెళ్ళాడు.
నాకు ఫ్యాన్స్ కాదు ఆర్మీ ఉందన్నాడు… సొంతగా పాన్ ఇండియా స్టార్ అవుతా నేను ఎక్కడ తగ్గేది లేదని కాలర్ ఎగరేసాడు. టాలీవుడ్ లో నేనే రియల్ మెగాస్టార్ అంటూ దమ్ము చూపించే ప్రయత్నం చేశాడు. మీరు తెలుగులో మాత్రమే స్టార్లు ఏమో నేను బాలీవుడ్ లెవెల్ లో స్టార్ పాన్… ఇండియా లెవెల్ లో నాకు తిరుగు లేదంటూ తొడ కొట్టే రేంజ్ కి వెళ్ళాడు. తీరా చూస్తే అరెస్టుతో సీన్ సితార్ అయింది. పుష్ప సినిమాతో టాలీవుడ్ కు ధైర్యం చెప్పిన భాయ్ కు టాలీవుడ్ లో చిన్న పెద్ద స్టార్ లందరూ ధైర్యం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. చివరకు మెగా ఫ్యామిలీనే దిక్కయింది.
రెండు రోజుల క్రితం అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత దాదాపు 12 గంటల పాటు అల్లు అర్జున్ చంచల్గూడా జైల్లో గడపాల్సి వచ్చింది. ఒక స్టార్ హీరో జైల్లో గడపడంతో సినిమా పరిశ్రమ మొత్తం జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ నివాసానికి క్యూ కట్టింది. సినీ రాజకీయ ప్రముఖులందరూ అల్లు అర్జున్ ను పరామర్శించేసి తమ ఆవేదన వ్యక్తం చేశారు.
బన్నీకి అండగా ఉంటామంటూ ఎవరికి వారు చేతిలో చేయి చేసి మరి ధైర్యం చెప్పి వెళ్లారు. ఇక్కడే ఒక విషయం జనాలకు మైండ్ బ్లాక్ చేసింది. అందరూ వచ్చారు గాని మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి ఏ ఒక్క హీరో కూడా అల్లు అర్జున్ కు ధైర్యం చెప్పే ప్రయత్నం గానీ కనీసం పరామర్శించే ప్రయత్నం గాని చేయలేదు. చిరంజీవి, నాగబాబు అరెస్ట్ అయిన రోజు అల్లు అర్జున్ నివాసానికి వెళ్లారు. కానీ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మాత్రం వెళ్లి పరామర్శించే ప్రయత్నం చేయలేదు. దీనితో అసలు అల్లు అర్జున్ నీడ కూడా మెగా ఫ్యామిలీకి నచ్చడం లేదు అనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినపడుతున్నాయి.
అయితే అనూహ్యంగా అల్లు అర్జున్ ఇప్పుడు చిరంజీవి ఇంటికి వెళ్ళాలి అనుకోవడం సంచలనగా మారింది. పుష్ప సినిమా ప్రమోషన్స్ లో ఎక్కడా మెగా ఫ్యామిలీని దగ్గర కూడా రానీయని అల్లు అర్జున్ ఇప్పుడు ఏకంగా చిరంజీవి ఇంటికి వెళ్లడం సినీ రాజకీయ వర్గాల్లో సంచలనమైంది. మెగా ఫ్యామిలీతో విభేదాల కారణంగానే అల్లు అర్జున్ కు ఈ పరిస్థితి వచ్చింది అనే అభిప్రాయం కూడా చాలా మందిలో వ్యక్తం అవుతుంది.
దీనితో మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య కొంతమంది మధ్యవర్తులు రాజీ కుదిరించారు అనే వార్తలు వినపడుతున్నాయి. అందుకే పుష్ప సినిమా రిలీజ్ టైం లో ఎక్కడ వెనకడుగు వేయని అల్లు అర్జున్ ఇప్పుడు ఒక అడుగు వెనక్కు తగ్గి మెగాస్టార్ ఇంటికి వెళ్లాలనుకుంటున్నాడు అంటూ సినీ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతుంది. అటు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాదులోనే ఉన్నారు. అల్లు అర్జున్ ను ఆయన పరామర్శించే అవకాశం ఉందని ప్రచారం ముందు జరిగింది.
అయితే చిరంజీవిని కలిసేందుకు పవన్ కళ్యాణ్ ఆయన నివాసానికి వెళ్ళనున్నారు. అదే సమయంలో అల్లు అర్జున్ కూడా వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే కొంతమంది పెద్దల ఒత్తిడి కారణంగానే అల్లు అర్జున్ వెనకడుగు వేసినట్టు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ తో పాటుగా టాలీవుడ్ సర్కిల్స్ లో కూడా టాక్ వినబడుతోంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వెనక్కు తగ్గితే తప్పులేదని లేకపోతే మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, ఇప్పటికే పుష్ప సినిమాకు యాంటీ ఫ్యాన్స్ చుక్కలు చూపించిన విషయాన్ని గుర్తు పెట్టుకొని అల్లు అర్జున్ మెసలితే మంచిది అనే సలహాలు ఇచ్చినట్లుగా సమాచారం.
అసలు మెగా ఫ్యామిలీ మొత్తం ఐక్యంగా ఉంటే అరెస్టు అయ్యే పరిస్థితి వచ్చేది కాదు అనే అభిప్రాయం కూడా కొంతమంది అల్లుఅర్జున్ వద్ద వ్యక్తం చేశారట. అటు అల్లు అరవింద్ కూడా అల్లు అర్జున్ ను కూల్ చేయడానికి నానా ప్రయత్నాలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి.. స్వయంగా స్నేహ రెడ్డి తో అల్లు అరవింద్ నిన్న ఉదయం నుంచి చర్చలు జరుపుతున్నారట. మరి మెగా అల్లు ఫ్యామిలీల మధ్య వివాదం ఇక్కడితో ముగుస్తుందా లేదా అనేది చూడాలి. కలిసి ఉంటే కలదు సుఖం అనేది భాయ్ అర్థం చేసుకుంటాడో లేదో.