పవన్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు.. బన్నీకి ఆయుధం దొరికిందా ?
ఒక్క సంఘటన.. బన్నీని ఇప్పుడు విలన్‌గా మార్చేసింది. ఏపీ ఎన్నికల్లో తన ఫ్రెండ్, నంద్యాల వైసీపీ అభ్యర్థి తరపున బన్నీ ప్రచారం చేశాడు. జనసేనకు దూరంగా ఉన్న అల్లు అర్జున్.. వైసీపీ అభ్యర్థికి ప్రచారం చేయడం.. మెగా ఫ్యాన్స్ తట్టుకోలేకపోయారు.
ఒక్క సంఘటన.. బన్నీని ఇప్పుడు విలన్‌గా మార్చేసింది. ఏపీ ఎన్నికల్లో తన ఫ్రెండ్, నంద్యాల వైసీపీ అభ్యర్థి తరపున బన్నీ ప్రచారం చేశాడు. జనసేనకు దూరంగా ఉన్న అల్లు అర్జున్.. వైసీపీ అభ్యర్థికి ప్రచారం చేయడం.. మెగా ఫ్యాన్స్ తట్టుకోలేకపోయారు. మెగా బ్రదర్ నాగబాబు అయితే.. డైరెక్ట్‌గానే విమర్శలు చేశారు. ఇక ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవం తర్వాత.. మెగా ఫ్యాన్స్ మరింత రెచ్చిపోవడం స్టార్ట్ చేశారు. బన్నీని సోషల్ మీడియాలో ఓ ఆట ఆడుకుంటున్నారు. ఓ రేంజ్‌లో ట్రోలింగ్ చేస్తున్నారు. చివరికి ఇంద్ర సినిమాలో శివాజీ కేరక్టర్ కనిపించినా.. బన్నీ బన్నీ అని అరిచారంటే.. ఏ లెవల్‌లో ఆడుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు.
ఐతే ఇంత జరిగినా.. బన్నీ మాత్రం వెనక్కి తగ్గినట్లు కనిపించడం లేదు. నచ్చిన వాళ్ల కోసం నచ్చింది చేస్తాం.. నచ్చిన చోటుకు వెళ్తాం అని.. మరింత రచ్చ రేపాడు బన్నీ. దీంతో మెగా ఫ్యాన్స్ మరింత రెచ్చిపోవడం స్టార్ట్ చేశారు. దీంతో బన్నీ మరింత విసిగిపోయాడు. ఇలాంటి సమయంలో.. ఆయనకు జానీ మాస్టర్ రూపంలో ఆయుధం దొరికిందా అంటే.. అవును అనే చర్చ జరుగుతోంది. జానీ మాస్టర్‌ను అడ్డుపెట్టుకొని.. పవన్ కల్యాణ్ మీద రివేంజ్ తీర్చుకుంటాడా అంటే.. అదే జరిగేలా కనిపిస్తోంది. జానీ మాస్టర్ మీద రేప్ కేసు నమోదయింది. తనను లైంగికంగా వేధింపులకు గురిచేశాడని.. జానీ మాస్టర్ అసిస్టెంట్ కేసు ఫైల్ చేసింది. ఐతే ఈ వ్యవహారాన్ని పవన్ కల్యాణ్‌పై రివేంజ్ తీర్చుకునేందుకు పవన్ ఉపయోగించుకోబోతున్నట్లు కనిపిస్తోంది. బాధిత యువతికి అల్లు అర్జున్ కాల్ చేసి మరీ.. మద్దతు తెలిపాడు. తన సినిమాల్లో, గీతా ఆర్ట్స్ మూవీస్‌లో ఛాన్స్ ఇస్తాననన్నాడు. ఇది మరింత రచ్చకు దారి తీస్తోంది. ఇక అటు పవన్ కళ్యాణ్‌కు యాంటీగా ఉన్నవారు.. జానీ మాస్టర్‌కి వ్యతిరేకంగా పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే పూనమ్ కౌర్, సింగర్ చిన్మయితోపాటు పలువురు వైసిపి శ్రేణులు కూడా జానీ మాస్టర్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. ఇప్పుడు బన్నీ ఏకంగా ఫోన్ చేసి పలకరించడం.. మద్దతు పలకడం వెనక పవన్ కల్యాణ్ మీద రివేంజే అనే చర్చ జరుగుతోంది.