అల్లు అర్జున్ అరెస్ట్, మోహన్ బాబు బిందాస్ ఇదేం న్యాయం?

మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మొన్నటి వరకు మంచు మోహన్ బాబు ఫ్యామిలీ వార్... నేడు సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 తొక్కిసలాట, ఒకరి మృతి కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ ఇప్పుడిదే వైరల్ న్యూస్. రెండు వార్తలు ,వాటి నేపధ్యాలు వేర్వేరు అయినప్పటికి మోహన్ బాబుకు ఒక న్యాయం , అల్లు అర్జున్ కు ఒక న్యాయమా అనేది ఇప్పుడు తప్పనిసరిగా అడగాల్సిన ప్రశ్న.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 13, 2024 | 07:47 PMLast Updated on: Dec 13, 2024 | 7:47 PM

Allu Arjuns Arrest Mohan Babu Is Furious Is This Justice

మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మొన్నటి వరకు మంచు మోహన్ బాబు ఫ్యామిలీ వార్… నేడు సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 తొక్కిసలాట, ఒకరి మృతి కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ ఇప్పుడిదే వైరల్ న్యూస్. రెండు వార్తలు ,వాటి నేపధ్యాలు వేర్వేరు అయినప్పటికి మోహన్ బాబుకు ఒక న్యాయం , అల్లు అర్జున్ కు ఒక న్యాయమా అనేది ఇప్పుడు తప్పనిసరిగా అడగాల్సిన ప్రశ్న. లేటెస్ట్ ట్రెండింగ్ కనుక అల్లు అర్జున్‌ ను ఎందుకు అరెస్ట్ చేసారు అనేది క్లియర్ కట్ గా తెలుసుకుందాం. డిసెంబర్ 5వ తేదిన సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇందుకోసం డిసెంబర్ 4వ తేదిన రాత్రి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య ధియేటర్ లో ప్రీమియర్ షో చూసేందుకు ..అల్లు అర్జున్ ఫ్యామిలీతో సహా వచ్చాడు. ఈ సంధర్భంగా వెల్లువలా వచ్చిన ఫ్యాన్స్ ను అదుపుచేయడం పోలీసుల వల్ల కాలేదు. లాఠీఛార్జ్ చేయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ దురదృష్టకర పరిణామంలో అల్లు అర్జున్‌ను విపరీతంగా ప్రేమించే దిల్‌ షుక్ నగర్ కు చెందిన ఓ కుటుంబం చిక్కుకుంది. రేవతి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందితే… ఆమె 9 ఏళ్ల కొడుకు శ్రీ తేజ్ పరిస్థితి నేటికి విషమంగానే ఉంది. దీన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు… అల్లు అర్జున్ తో పాటు సంధ్య ధియేటర్ యాజమాన్యంపై 105 నాన్ బెయిలబుల్, 118(1) రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. రేవతి మరణం, శ్రీతేజ్ విషమ పరిస్ధితిపై పుష్పటీం రెస్పాండ్ అయింది. డైరెక్టర్ సుకుమార్ నుంచి అల్లుఅర్జున్ వరకు అంతా క్షమాపణ చెప్పారు. అల్లు అర్జున్ మృతురాలి కుటుంబానికి 25లక్షలు పరిహారం ప్రకటించడం మాత్రమే కాకుండా అండగా ఉంటానని చెప్పారు. ఇది క్లుప్తంగా అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక రియల్ స్టోరీ..

ఇప్పుడు మంచు మోహన్ బాబు విషయానికి వద్దాం. మంచు ఫ్యామిలీలో ఆస్తి తగాదాల కారణంగా మనోజ్ వర్సెస్ మోహన్ బాబు ఎపిసోడ్ సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపించింది. పోలీసులు ప్రేక్షక పాత్రలో… ఇరు వర్గాల బౌన్సర్లు యుద్ధ వీరుల పాత్రల్లో ఒదిగిపోయిన ఈ పవర్ వార్, ప్రాపర్టీస్ వార్ అన్నదమ్ములను నడిరోడ్డుకు ఈడ్చీంది. తండ్రి కొడుకుల ప్లాస్టిక్ కోటెడ్ అన్యోన్యతను బయటకు చూపింది. ఇదంతా చెప్పాలంటే రాస్తే రామాయణమంత చెప్పుకుంటే చాంతాండంత ఉందిలే కానీ… అసలు గొడవకు కారణం ఏమిటి అని అడిగిన ఓ ఛానల్ రిపోర్టర్ చేతి నుంచి లోగో లాక్కుని దాడి చేయడమే కాకుండా తన మనుషులతో కూడా కొట్టించాడు క్రమశిక్షణకు బ్రాండ్ అంబాసిడర్‌గా చెప్పుకునే మోహన్ బాబు. ఈ దుర్ఘటనలో గాయపడిన జర్నలిస్ట్ రంజిత్‌ కు ఆపరేషన్ చేసారు వైద్యులు. దీంతో అవుటాఫ్ డేంజ్ ర్ గా ఉన్నాడు బాధితుడు. జర్నలిస్టులపై దాడికి నిరసనగా తెలుగు మీడియా రోడ్డెక్కితే గానీ హైదరాబాద్ పోలీసులు మోహన్ బాబుపై కేసు నమోదు చేయలేదు. ఎట్టకేలకు మంచు మనోజ్ ,మంచు విష్ణును బైండోవర్ చేసి మోహన్ బాబుపై అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ చేసారు. ఈ నేపధ్యంలోనే అనారోగ్యం పేరుతో హాస్పిటల్ లో చేరి డ్రామాను మరింతగా రక్తి కట్టించిన శ్రీ శ్రీ శ్రీ మోహన్ బాబు గారు… రెండు ఆడియోలు రిలీజ్ చేసారు. ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టి చేతులు దులుపుకున్నారు. క్షమాపణ చెప్పి చెప్పినట్లుగా ఉన్న మోహన్ బాబు గారి మాటలను ఓసారి పరిశీలిస్తే… డైలాగ్ కింగ్ ఏమంటారంటే… నా ఇంటి గేట్లు పగలకొట్టి మరీ చొరబడ్డారు. వచ్చిన వాళ్లు మీడియా వాళ్లో కాదో తెలియదు. నేను అప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉన్నాను. ముందుగా నమస్కారం పెట్టినా..ఏం జరిగింది అని ఆ జర్నలిస్ట్ మైక్ ను నా ముఖం ముందు పెట్టాడు. అది నా కంటికి తగిలింది. కాస్త గట్టిగా తగిలి ఉంటే నా కన్ను పోయి నా జీవితం గుడ్డిగా మారేది. దీంతో అసహనం వల్ల నేను దాడి చేసాను. అసలు ఆ చీకట్లో ఏం జరిగిందో తెలియదు అనేది బుకాయింపు. అటాక్ చేయడం తప్పే కానీ… నా ఇంట్లోకి ఎవడు రమ్మన్నాడు, మీకు ఆ రైట్ ఎవరిచ్చాడు అనేది మోహన్ బాబుగారి బెదిరింపు కోట్ పూసిన మన్నింపు అభ్యర్ధన. ఇంతటితో ఆగలేదు కలెక్షన్ కింగ్ గారు.. నేడు మీకు టీవీలు ఉండవచ్చు రేపు నేను కూడా ఒక టీవి పెట్టవచ్చు అంటూ వార్నింగ్ ఇచ్చి…ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్ట్ కు వెళ్లారు. ఒక నిమిషం మోహన్ బాబు మాటల్లో నిజమెంత, ఆయనలో నిజాయితీ ఎంత అనేది ఒకసారి చూస్తే… చీకట్లో ఆ జర్నలిస్ట్ మీద అటాక్ చేసానని చెప్పారు మోహన్ బాబు. ఇది తప్పు ఎందుకంటే కెమెరాల సాక్షిగా అక్కడ లైట్లు ఉన్నాయి. ముందు నమస్కారం పెట్టింది నిజమే కానీ ఎంత పగ ఉంటే ఆ స్ధాయిలో జర్నలిస్ట్ నుంచి లోగో లాక్కుని కొట్టాడనేది ఆ విజువల్ చూస్తే ఇట్టే అర్ధం అవుతుంది. ఇక బాధిత జర్నలిస్ట్ ప్రశ్నిస్తూ .. తన ఛానల్ లోగో ఉన్న మైక్ పెట్టినది నిజమే కానీ దురుసుగా కానీ విసురుగా కానీ పెట్టలేదు. అది మోహన్ బాబు కంటికి గానీ, ముఖానికీ గానీ తగిలే ఛాన్స్ ఎంత మాత్రం లేదని ఆ విజువల్‌ చూస్తే అర్ధం అయిపోతుంది. అయినా సరే సొంతడబ్బాలో ఆరితేరిన డైలాగ్ కింగ్ మోహన్ బాబు అతుకుల బొంకులు ఇవి.

ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటకు, రేవతి అనే మహిళ మృతికి, శ్రీతేజ అనే పిల్లవాడి విషమ పరిస్ధితికి కారణం అల్లు అర్జున్ కూడా ఒక కారణమే అంటూ చిక్కడపల్లి పోలీసులు.. అల్లు అర్జెన్ ను అరెస్ట్ చేసారు. నిజం చెప్పాలంటే రియల్లీ హ్యాట్స్ ఫ్ . ఈ వ్యవస్ధీకృత నేరంలో అల్లు అర్జున్ పాత్ర ఏమిటన్నది రేపు న్యాయస్ధానాలు తీర్పు చెబుతాయి కానీ… అంత దారుణంగా అటాక్ చేసిన మోహన్ బాబు పై కేసు మాత్రమే నమోదు చేసిన పహాడీ షరీఫ్ పోలీసులు… ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు. జర్నలిస్ట్ రంజిత్ పై మోహన్ బాబు ఎంత క్రూరంగా దాడి చేసాడో విజువల్ లో క్లియర్ గా కన్పిస్తున్నా…. ఇంకా ఎందుకు మోహన్ బాబును అరెస్ట్ చేయలేదు. చిక్కడపల్లి పోలీసులకు ఉన్న తెగువ పహాడీ షరీఫ్ పోలీసులలో ఎందుకు ఇంత నిర్లిప్తత అనేదే అర్ధం కావటం లేదు. అల్లు అర్జున్‌ కు ఒక న్యాయం , మోహన్ బాబుకు ఒక న్యాయమా… రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్. చట్టం,న్యాయం ముందు అందరూ సమానమే అయినప్పుడు అల్లు అర్జున్ కు ఒక న్యాయం…మోహన్ బాబుకు మరొక న్యాయమా? హైదరాబాద్ పోలీసులు ఏమని బదులిస్తారో లెట్స్ వెయిట్ అండ్ సీ…