ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా ఒక సెన్సేషన్. ఆయన నోటి నుంచి వచ్చే మాటలకు మీడియా చేసిన హడావుడి కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. రాజమండ్రిలో జరిగిన సినిమా ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ నోటి నుంచి వచ్చిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు ఎలక్ట్రానిక్ మీడియాను కూడా షేక్ చేస్తున్నాయి. ఇంట్రెస్టింగ్ స్పీచ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ సినిమా పరిశ్రమ పెద్దల గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు అక్కడ షేర్ చేసుకున్నారు. సినిమా పరిశ్రమ అంతా ఒకటే అనే విషయాన్ని చెప్పడానికి పవన్ చాలా కష్టపడ్డారు. ఈ సందర్భంగా సినిమా వాళ్ళ గురించి వాళ్ళ పేర్లు చెబుతూ... వాళ్లు చేసిన కష్టాన్ని మనం మర్చిపోకూడదని.. ప్రతి ఒక్కరిని కూడా గుండెల్లో పెట్టుకోవాలంటూ కామెంట్ చేశారు. ఇక తాను ఈ స్థాయిలో ఉండటానికి మెగాస్టార్ చిరంజీవి కారణమని.. ఎక్కడో మొగల్తూరు నుంచి వచ్చి తమ అందరికీ ఒక నీడ కల్పించారంటూ చిరంజీవిని ఆకాశానికి ఎత్తేశారు పవన్ కళ్యాణ్. చిరంజీవి లేకపోతే మెగా ఫ్యామిలీ లేదంటూ ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. అయితే ఇప్పుడు ఈ కామెంట్స్ నుంచి ఈకలు పీకే బ్యాచ్ పీకుతూనే ఉంది. పవన్ స్పీచ్లో లేని అర్థాలు వెతికే ప్రయత్నం చేస్తుంది. అసలు మెగా ఫ్యామిలీలో అల్లు కుటుంబ కష్టాలు లేవా అంటూ కొంతమంది క్వశ్చన్ చేయడం మొదలుపెట్టారు. అల్లువారింటికి చిరంజీవి అల్లుడుగా వెళ్ళిన తర్వాతనే ఆయన దశ దిశ మారిందని.. అల్లు రామలింగయ్య చిరంజీవిని గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారని.. ఆ తర్వాతనే చిరంజీవి స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేశారని.. అక్కడి నుంచి ఆయనకు స్టార్ ఇమేజ్ వచ్చింది అంటూ కొంతమంది సినిమా పండితులు కామెంట్ చేయడం మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ మూలాలు మర్చిపోవద్దు అని చెప్పి ఆయన అల్లు రామలింగయ్యను మర్చిపోయారు అంటూ తిట్టడం మొదలుపెట్టారు. అసలు వాస్తవానికి పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ అల్లు అర్జున్ గురించి అనేది చాలామంది డౌట్. మా కష్టం వల్లనే మీరు ఈ స్థాయిలో ఉన్నారని అల్లు అర్జున్ కు అలాగే అతని సపోర్ట్ చేసే వాళ్లకు చెప్పే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్. అల్లు అర్జున్ సొంతగా ఎదిగే ప్రయత్నం చేయడానికి మెగా ఫ్యామిలీ జీర్ణించుకోలేకపోయింది. అందుకే పవన్ కళ్యాణ్ కూడా కాస్త కౌంటర్ ఇచ్చినట్లు ఆ స్థాయిలో మాట్లాడారు.[embed]https://www.youtube.com/watch?v=urQS2_17vuU[/embed]