Top story: ఇరాన్ ఇరగదీస్తారా.? ట్రంప్ రివేంజ్ మోడ్
ఉక్రెయిన్ యుద్ధం ముగిసిపోవాల్సిందే అన్నారు.. పశ్చిమాసియా ప్రశాంతంగా ఉండాలనీ కాంక్షించారు.. తన పాలనలో యుద్ధం అన్న మాటకు చోటుకూడా లేదన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ప్రచారం ఇలానే సాగింది. ఇది చూసిన అమెరికన్లు 'మీరు మారిపోయారు సార్' అంటూ సెల్యూట్ కొట్టారు.
ఉక్రెయిన్ యుద్ధం ముగిసిపోవాల్సిందే అన్నారు.. పశ్చిమాసియా ప్రశాంతంగా ఉండాలనీ కాంక్షించారు.. తన పాలనలో యుద్ధం అన్న మాటకు చోటుకూడా లేదన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ప్రచారం ఇలానే సాగింది. ఇది చూసిన అమెరికన్లు ‘మీరు మారిపోయారు సార్’ అంటూ సెల్యూట్ కొట్టారు. చివరికి ట్రంప్‌కే పట్టంకట్టారు. కానీ, అదే ట్రంప్ ఇరాన్ విషయంలో ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరాన్‌తో యుద్ధం జరిగే ఛాన్స్ ఉందా అన్న ప్రశ్నకు.. ఏదైనా జరిగే అవకాశం ఉంది అంటూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు ట్రంప్. ట్రంప్ ఇచ్చిన ఈ ఆన్సరే మరో యుద్ధ భయాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తోంది. ఐతే అన్ని యుద్ధాలూ ఆపేయాలన్న డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్ విషయంలో మాత్రం ఎందుకింత పట్టు దలగా ఉన్నారు? అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగా ఇరాన్‌పై దాడి చేస్తారా? ఈ ప్రశ్నకు సమాధానం 2020లో ట్రంప్ రూలింగ్‌లో ఉన్న సమయంలో జరిగిన హాలీవుడ్ రేంజ్ సీక్రెట్ ఆపరేషన్‌లోనే ఉంది.
ఖాసిమ్ సులేమాని.. ఇరాన్ టాప్ మిలిటరీ కమాండర్. 2020లో అగ్రరాజ్య అమెరికా సులేమానీని ఎలిమినేట్ చేసింది. అదికూడా పక్కా ప్లాన్ ప్రకారం బాగ్దాద్‌లో తన అత్యాధునిక ఎం క్యూ-9 రీపర్ డ్రోన్‌తో గుర్తుపట్టలేని విధంగా చంపేసింది. ఇక్కడే అమెరికా-ఇరాన్ మధ్య అప్పటికే దెబ్బతిన్న సంబంధాలు మరింతగా బలహీనమయ్యాయి. ఆ సమయంలోనే అప్పటి అమెరికా అధ్యక్షుడైన ట్రంప్‌పై రివేంజ్ ప్లాన్ చేసింది ఇరాన్. ఎప్పటికైనా ట్రంప్ అంతం తమ చేతుల్లోనే అని శపథంకూడా చేసింది. అయితే, ఈ హెచ్చరికలను ట్రంప్ పట్టించుకోలేదు. కానీ, 2023 ఫిబ్రవరిలో ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. ట్రంప్‌ను చంపడం కోసం ఏకంగా ఓ క్షిపణినే సిద్ధం చేశామని ప్రపంచానికి చెప్పింది. కేవలం ట్రంప్‌నే కాదు సులేమాని హత్యకు ఆదేశాలిచ్చిన నాటి విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, మిలిటరీ కమాండర్లు కూడా ప్రాణాలతో ఉండకూడదని పేర్కొంది. అయితే, ఇరాన్ మిలటరీ కమాండర్ ఖాసిం సులేమానిని డొనాల్డ్ ట్రంప్ సర్కార్ ఎందుకు టార్గెట్ చేసింది? పనికట్టుకుని బాగ్దాద్‌లోనే సీక్రెట్ ఆపరేషన్ ద్వారా చంపాల్సిన అవసరం ఎందుకొచ్చింది?
2020 ట్రంప్ సర్కార్ ఖాసిమ్ సులేమానిని అంతం చేయడానికి చాలా పెద్ద రీజనే ఉంది. సులేమాని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌లోని అత్యంత శక్తిమంతమైన కుద్స్ ఫోర్స్‌కు జనరల్‌గా వ్యవహరించారు. సులేమానీ నేతృత్వం వహించిన కుద్స్ ఫోర్స్ ఇరాన్ చుట్టుపక్కల దేశాల్లో షియాలకు అనుకూలంగా కార్యకలాపాలను సాగిస్తుంటుంది. ముఖ్యంగా లెబనాన్‌లో హిజ్బుల్లా పక్షాలకు బలమైన అండ. దీని అండతోనే హిజ్బుల్లా లెబనాన్‌లో పాలన చేసింది. ఇక ఇరాక్‌లో కూడా కుద్స్, షియాలకు అనుకూలంగా ఈ దళం పనిచేస్తుంది. ఈ కార్యకలాపాలు.. వ్యూహాలు.. దాడులు.. ప్రతిదాడులు మొత్తం సులేమానీ కనుసన్నల్లోనే జరిగేవి. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల సమయంలో సులేమానీ నేరుగా అమెరికాపై బెదిరింపులకు దిగారు. “మిస్టర్ ట్రంప్.. యుద్ధం నువ్వు మొదలెడితే.. మేం ముగిస్తాం అని హెచ్చరించారు.
ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ చుట్టుపక్కల దేశాల్లో పరోక్షంగా షియాలకు అనుకూల ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటుంది. ఈ క్రమంలోనే ఘర్షణలు, దాడులు, వేర్పాటువాదులను ప్రోత్సహిస్తుంది. లెబనాన్‌లో హిజ్బుల్లా ప్రభుత్వం, యెమెన్‌లో హౌతీ రెబల్స్, ఇటీవల సిరియాలో కూలిపోయిన అసద్ ప్రభుత్వం, ఇరాక్‌లో షియా గ్రూపులకు ఖాసిం సులేమానీ మార్గ నిర్ధేశం చేసేవారు. ఈ ప్రయత్నాల్లో ఖాసిం సులేమాని పలుమార్లు ప్రాణగండాలను కూడా తప్పించుకున్నారు. 2019 డిసెంబర్ 28న ఇరాక్‌లో అమెరికాకు చెందిన ఓ కాంట్రాక్టర్ హత్యకు గురైయ్యాడు. అప్పుడు అమెరికా బలగాలు కొన్ని లక్ష్యాలపై దాడులు చేశాయి. ఆ తర్వాతి రోజు నుంచి బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై షియా బృందాలు భీకర దాడులకు తెగబడ్డాయి. వీటన్నంటిని కుద్స్ ఫోర్స్ వెనుకుండి నడిపిస్తోందని అమెరికాకు అర్దమైంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేసినా ఇరాక్‌లో కూడా అమెరికా వ్యతిరేక వాతావరణాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని భావించి సులేమానీను టార్గెట్ చేసింది.
లెబనాన్ నుంచి కానీ, సిరియా నుంచి కానీ వస్తున్నట్లు భావిస్తున్న ఒక విమానంలో సులేమానీ ఉన్నట్లు సమాచారం అందింది. అక్కడకు పాపులర్ మొబలైజేషన్ ఫోర్స్ నేత ముహందీస్ కూడా రానున్నట్లు తెలిసింది. అప్పటికే కసిమీద ఉన్న అమెరికా దళాలు మిషన్ కోసం ప్రణాళికలు రూపొందించాయి. ముహందీస్ కూడా క్వాన్వాయ్‌తో ఎయిర్‌పోర్ట్‌కు చేరుకు న్నారు. సులేమానీ విమానం దిగి ముహందీస్ను కలవగానే అప్పటికే మాటేసి ఉన్న ఎంక్యూ-9 రీపర్ డ్రోన్ రాకెట్లతో దాడి చేసింది. ఆ దాడిలో ఖాసిం సులేమాని చేతి వేలికి ధరించిన ఎర్రటి ఉంగరం ద్వారానే అతడి మృతదేహాన్ని గుర్తుపట్టగలిగారు. ఆ సమయంలో ఇరాన్ మొత్తం అట్టుడికిపోయింది. సులేమాని అంత్యక్రియల తర్వాత అతని కుమార్తె సైతం డొనాల్డ్ ట్రంప్‌కు వార్నింగ్ ఇచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ సులేమానీ హత్యకు ప్రతీకారం కోసం ఇరాన్ ఎదురు చూస్తూనే ఉంది. అంతెందుకు అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌పై జరిగిన హత్యా యత్నం వెనుకా ఇరాన్ హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తమయ్యా యి.
అయితే, ఎన్నికల ఫలితాల తర్వాత ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ట్రంప్‌ను చంపే ఆలోచన తమకు లేదని ఇరాన్ స్పష్టం చేసింది. కానీ, ట్రంప్ మాత్రం ఇరాన్ గతంలో చేసిన హెచ్చరికలను ఇంకా మర్చిపోయినట్టు లేరు. అందుకే, మిగతా యుద్ధాల్లో ఎలా ఉన్నా ఇరాన్ విషయంలో మాత్రం ఏదైనా జరగొచ్చంటూ షాకింగ్ ప్రకటన చేశారు. కాబట్టి ట్రంప్ పవర్ లో ఉన్నంతకాలం ఇరాన్ భద్రతకు సవాళ్లు తప్పవన్నమాటే.