భారత్ అడ్డాలో అమెరికన్ స్టెల్త్ ఫైటర్స్, ట్రంప్ టార్గెట్ చేయబోతోంది ఎవరిని?

'బి-2 స్పిరిట్‌ స్టెల్త్‌ ఫైటర్స్.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యుద్ధ విమానాలు. ఒక్కో విమానం ధర మన కరెన్సీలో చెప్పాలంటే అక్షరాలా 4వేల 779కోట్లు. అంతేకాదు, ఇవి ప్రపంచంలోనే అత్యంత సీక్రెట్‌గా ప్రయాణించే విమానాలు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 7, 2025 | 04:50 PMLast Updated on: Apr 07, 2025 | 4:50 PM

American Stealth Fighters In India Who Is Trump Going To Target

‘బి-2 స్పిరిట్‌ స్టెల్త్‌ ఫైటర్స్.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యుద్ధ విమానాలు. ఒక్కో విమానం ధర మన కరెన్సీలో చెప్పాలంటే అక్షరాలా 4వేల 779కోట్లు. అంతేకాదు, ఇవి ప్రపంచంలోనే అత్యంత సీక్రెట్‌గా ప్రయాణించే విమానాలు. వీటిని ఇన్ఫ్రారెడ్‌, ఎలక్ట్రోమాగ్నటిక్‌, రాడర్‌ సిగ్నల్స్‌ ఏవీ గుర్తించలేవు. ఏకధాటిగా 6వేల మైళ్లు ప్రయాణించగలిగే ఈ యుద్ధవిమానాలు అణుబాంబులను సైతం ప్రయోగించగలవు. అంతేకాదు 11వేల కిలోమీటర్ల ఎత్తులో ఉంటూ కూడా లక్ష్యాన్ని సరిగ్గా చేధించగల శక్తి సామర్ధ్యం వీటి సొంతం. ఒకోసారి ఏడు అణ్వస్త్రాలను తీసుకుపోగల అత్యంత ఆధునిక బాంబర్ ఇది. రష్యాతో కోల్డ్‌వార్‌ నాటి న్యూక్లియర్‌ ఆయుధాలను కూడా ఇవి క్యారీ చేస్తాయి. ఇంతటి పవర్‌ఫుల్ స్టెల్త్ ఫైటర్స్ సైలెంట్‌గా ఇండో-పసిఫిక్‌‌లో ఎంట్రీ ఇచ్చాయి. ఎంట్రీ ఒక్కటే కాదు.. ఎనిమీపై యాక్షన్‌కు కూడా రెడీగా ఉన్నాయి. కావాల్సిందల్లా అగ్రరాజ్యాధినేత ఆదేశాలు ఒక్కటే. ట్రంప్ సిగ్నల్ ఇస్తే యాక్షన్‌లోకి దిగిపోతాయి. కానీ, అగ్రరాజ్యం టార్గెట్ ఎవరు అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న. ఆ డీటెయిల్స్ ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం..

డియాగో గార్సియా.. ఇండో-పసిఫిక్ రీజియన్‌లో అమెరికా, బ్రిటన్ జాయింట్ మిలిటరీ బేస్. వ్యూహాత్మకంగా అమెరికాకు కీలకమైన సైనిక స్థావరం. అమెరికా శత్రు దేశాలు ఇరాన్, చైనాలను టార్గెట్ చేయడానికి అనువైన బేస్. ఇక్కడ యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లను మోహరిస్తే ఎనిమీపై ఎనీటైం యాక్షన్ లోకి దిగిపోవచ్చు. ఈ క్రమంలోనే డియాగో గార్సియాలో అమెరికా మోస్ట్ పవర్‌ఫుల్ బాంబర్లు బీ-2లను సైలెంట్‌గా మోహరించింది. అమెరికా ఈ యాక్షనే ఇండో-పసిఫిక్‌ రీజియన్‌లో ప్రకంపనలు రేపుతోంది. అమెరికా దగ్గర 20 బీ-2 బాంబర్లు ఉంటే.. వాటిలో ఆరింటిని డియాగో గార్సియా రన్‌వేపై మోహరించారు. శాటిలైట్ ఫొటోల ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఐతే రాడార్‌ సిగ్నల్స్‌ కూడా అందకుండా.. షెల్టర్‌లో మరిన్ని బాంబర్లు ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు.. ఇండో-ఫసిఫిక్‌ రీజియన్‌లోనూ యుద్ధ విమానాల గస్తీని అమెరికా పెంచాలని అమెరికా భావిస్తోంది. ఇప్పటి వరకూ ఒక విమాన వాహక నౌకతోనే గస్తీ నిర్వహిస్తుండగా.. ఆ సంఖ్యను మూడుకి పెంచే ప్లాన్‌లో ఉంది. హిందూ మహా సముద్రం రీజియన్‌లో రెండు, దక్షిణ చైనా సముద్రానికి దగ్గరగా వెస్ట్రన్ పసిఫిక్‌ దగ్గర ఒక విమాన వాహక నౌకతో గస్తీ నిర్వహించాలనుకుంటోంది. అంతేకాదు ఈ మోహరింపు మునుముందు మరింత పెరగనుం దని అమెరికా డిఫెన్స్ ఆఫీస్ పెంటగాన్‌ కన్ఫమ్ చేసింది. ఈ చర్యలను భారీ వ్యూహాత్మక ఎత్తుగడగా రక్షణ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరోవైపు.. ఆయా ప్రాంతాల్లో అమెరికా రక్షణాత్మక వైఖరిని మెరుగుపరచడానికే ప్రస్తుత మోహరింపులు అని పెంటగాన్‌ ప్రకటించుకుంది. అదే సమయంలో.. భాగస్వామ్య దేశాల భద్రతకు అమెరికా కట్టుబడి ఉందని, ఈ క్రమంలోనే దాడులు, అంతర్యుద్ధాలు, రాజకీయ సంక్షోభాలు.. ఉద్రిక్తతల్ని కట్టడి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెబుతోంది. ఇప్పటివరకూ అమెరికా ఏ దేశం, ఏ సంస్థల పేర్లు ప్రకటించకలేదు.. కానీ, మిడిల్‌ ఈస్ట్‌, దక్షిణాసియా పరిస్థితుల నేపథ్యంలోనే అమెరికా ఈ చర్యలకు దిగినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా ఇరాన్‌, యెమెన్‌లతో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలోనే బీ-2 స్టెల్త్ ఫైటర్లను రంగంలోకి దించుతోందని భావిస్తున్నారు. ఇటీవలే అమెరికా అధ్యక్షుడు హౌతీలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా నౌకలపై దాడులు ఆపకపోతే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని యెమెన్‌, దానికి మద్ధతు దేశం ఇరాన్‌ను హెచ్చరించారు. కానీ, కేవలం యెమెన్‌పై దాడులు చేయడానికే మోహరించారంటే నమ్మడం కష్టం. ఎందుకంటే హౌతీలపై దాడి చేసేందుకు బీ-2 వంటి స్టెల్త్ ఫైటర్లు అవసరం లేదు. మరి అమెరికా ఏ లక్ష్యంతో వీటిని డియాగో గార్సియా బేస్‌లో మోహరించింది?

ఇటీవల అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇటీవల అణు నిరాయుధీకరణ ఒప్పందంపై చర్చిద్దాం రమ్మంటూ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి ట్రంప్ లేఖ రాశారు. కానీ, టెహ్రాన్ మాత్రం అమెరికాతో చర్చలకు ఛాన్సే లేదని తేల్చేసింది. దీంతో ఇరాన్‌పై ట్రంప్ బెదిరింపులకు దిగారు. ఒకవేళ అణు ఒప్పందం కుదుర్చుకునేందుకు టెహ్రాన్‌ నిరాకరిస్తే.. బాంబు దాడులు తప్పవనీ.. ఆ దేశం మునుపెన్నడూ ఎరుగని రీతిలో ఇవి జరుగుతాయన్నారు ట్రంప్. అదేవిధంగా మరో విడత తీవ్ర ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కానీ ట్రంప్ బెదిరింపులను ఇరాన్ లెక్క చేయకపోగా.. తమపై దాడి చేస్తే అమెరికా చేసిన అతిపెద్ద తప్పు అదే అవుతుందని తిరిగి వార్నింగ్ ఇచ్చింది. ఆ తర్వాతే డియాగో గార్సియా మిలిటరీ స్థావరానికి బీ-2 స్టెల్త్ బాంబర్లు చేరుకున్నాయి. సో.. త్వరలో అమెరికా, ఇరాన్ మధ్య ఏదైనా జరిగొచ్చన్నమాట. డియాగో గార్సియాలో స్టెల్త్ ఫైటర్లను మోహరించడం ద్వారా ఇరాన్‌తో పాటు దాని మిత్రపక్షాలైన చైనా, రష్యాలకు కూడా ట్రంప్‌ హెచ్చరికల సంకేతాలు పంపిస్తున్నారనే చర్చ జరుగుతోంది. దక్షిణ చైనా సముద్రానికి దగ్గరగా వెస్ట్రన్ పసిఫిక్‌ వద్ద యూఎస్‌ఎస్‌ నిమిట్జ్‌ క్యారీయర్‌ను, మిడిల్‌ ఈస్ట్‌లో USSకార్ల్‌ విన్‌సన్ వాహక నౌకను మోహరించడం వెనుక కూడా వ్యూహం ఇదే కావచ్చు. ఓవరాల్‌గా శత్రువుల విషయంలో ట్రంప్ ఏదో పెద్ద ప్లాన్‌లోనే ఉన్నారు.