Amit Shah: టీకాంగ్‌కు చెక్ పెట్టేందుకు రంగంలోకి అమిత్ షా.. ఆ ఇద్దరు నేతలకు చుక్కలు కనిపించడం ఖాయమా ?

బీజేపీలో చాణుక్యుడిగా పేరుగాంచిన అమిత్ షానే తెలంగాణలో పార్టీ బలోపేతం వ్యవహారాలపై దృష్టిసారించారంటే.. రాష్ట్రంపై బీజేపీ ఏ స్థాయిలో ఫోకస్ పెట్టిందో అర్థం చేసుకోవచ్చు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 8, 2023 | 08:57 AMLast Updated on: Jun 08, 2023 | 8:57 AM

Amit Shah Focused On Telangana Check For Congress And Brs

Amit Shah: మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ మంత్రి జూపల్లి మీద బీజేపీ పెట్టుకున్న ఆశలు అన్నీ ఇన్నీ కావు. ఆ ఇద్దరు పార్టీలో చేరితే అన్నీ మంచి శకునములే అనుకుంటే.. ఆ ఇద్దరు నేతలు కమలం పార్టీకి హ్యాండ్ ఇచ్చారు. త్వరలో ఈ ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో స్ట్రాంగ్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్న కాషాయం పార్టీకి ఇది కషాయం మింగినట్లు అవుతోంది.

వీరి చేరిక ద్వారా కాంగ్రెస్ బలంగా మారుతుందనే సంకేతాలు జనాల్లోకి వెళ్లడానికి ముందే.. తాము రంగంలోకి దిగి జనాల దృష్టిని ఆకర్షించేందుకు బీజేపీ వ్యూహరచన చేసింది. బీజేపీలో చాణుక్యుడిగా పేరుగాంచిన అమిత్ షానే తెలంగాణలో పార్టీ బలోపేతం వ్యవహారాలపై దృష్టిసారించారంటే.. రాష్ట్రంపై బీజేపీ ఏ స్థాయిలో ఫోకస్ పెట్టిందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిణామాలు, ప్రజాభిప్రాయంపై ఇప్పటికే రాష్ట్రంలోని పలువురు కీలక నేతలతో అమిత్ షా మంతనాలు కొనసాగిస్తున్నారు.

పార్టీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్‌తో పాటు మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించి వారితో షా ప్రత్యేకంగా సమాలోచనలు జరిపారు. పార్టీని తెలంగాణలో బలోపేతం చేయడం, అధికార బీఆర్ఎస్, ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ కు చెక్ పెట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపైనే వారితో అమిత్ షా ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఎలాగైనా తెలంగాణలో పట్టుసాధించాలని భావిస్తున్న అమిత్ షా.. వాయువేగంతో పది రోజుల వ్యవధిలో తెలంగాణ లో రెండు భారీ బహిరంగ సభల ఏర్పాటుకు ఆదేశించారు. వరుసగా ఖమ్మం , ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనూ లో తమ సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది.

మిగతా జిల్లాల్లో కన్నా ఈ రెండు జిల్లాల్లో బీజేపీ కొంత వెనకబడి ఉంది. అందుకే ఈ రెండు ఉమ్మడి జిల్లాలపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెంచినట్లు తెలుస్తోంది. బీజేపీని కాదని పొంగులేటి కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతుండడంతో.. ఆ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగసభను విజయవంతం చేసి పొంగులేటికి గట్టి కౌంటర్ ఇవ్వడంతోపాటు.. కర్ణాటక ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత డల్ అయిన కేడర్‌లో ఆత్మవిశ్వాసం నింపాలని అమిత్ షా భావిస్తున్నట్లు తెలుస్తోంది. పాలమూరులో పర్యటన ద్వారా జూపల్లి కృష్ణారావుకు కౌంటర్ ఇవ్వాలని భావిస్తోంది. వీరితో పాటు రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి గట్టి సవాల్ విసిరినట్లవు తుందని అమిత్ షా భావిస్తున్నట్లు తెలుస్తోంది.