పవన్ కు అమిత్ షా టార్గెట్.. కేటిఆర్ కు మూడినట్టే…?

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గట్టిగానే ఫోకస్ పెట్టింది. ఎలాగైనా సరే భారత రాష్ట్ర సమితిని పాతాళానికి తొక్కాలని కేంద్ర హోం మంత్రి బిజెపి అధినేత అమిత్ షా టార్గెట్ పెట్టుకుని వర్క్ చేస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 23, 2025 | 02:37 PMLast Updated on: Jan 23, 2025 | 2:37 PM

Amithsha Focus On Telugu States Politics

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గట్టిగానే ఫోకస్ పెట్టింది. ఎలాగైనా సరే భారత రాష్ట్ర సమితిని పాతాళానికి తొక్కాలని కేంద్ర హోం మంత్రి బిజెపి అధినేత అమిత్ షా టార్గెట్ పెట్టుకుని వర్క్ చేస్తున్నారు. 2028లో జరగబోయే తెలంగాణ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించాలని అమిత్ షా ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నుంచే ఈ టార్గెట్ కోసం కష్టపడాలని అమిత్ షా వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. పరిపాలనా వ్యవహారాల్లో పెద్దగా జోక్యం చేసుకో అమిత్ షా రాజకీయపరమైన అంశాల్లో మాత్రం గట్టిగానే ఫోకస్ పెడుతూ ఉంటారు.

ఇప్పుడు దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ బలంగా పాగా వేయాలని టార్గెట్ పెట్టుకున్న అమిత్ షా ఇటీవల ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఇదే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఎలాగైనా సరే పార్టీని బలోపేతం చేయాలని.. అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్న ఆయన చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ తో ఇదే అంశంపై చర్చించారు. భారత రాష్ట్ర సమితి కచ్చితంగా నాయకత్వం లేమితో… ఇబ్బంది పడుతుందని ఈ పరిస్థితులను మనకు అనుకూలంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని.. అమిత్ షా అభిప్రాయపడినట్లు వార్తలు వస్తున్నాయి.

రేవంత్ రెడ్డితో బిజెపికి ఇబ్బందులు లేకపోయినా భవిష్యత్తులో భారత రాష్ట్ర సమితితో ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయని.. కేటీఆర్ నాయకత్వంపై ఆ పార్టీ నాయకులకు నమ్మకం లేదని.. కేసీఆర్ ఎప్పుడు బయటకు వస్తారో క్లారిటీ లేదని అమిత్ షా కొన్ని కీలక అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద చర్చించినట్లు తెలుస్తోంది. భారత రాష్ట్ర సమితి నుంచి కొంత మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చే అవకాశం ఉందని.. వారిని వీలైనంత త్వరగా తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవాలని.. అలాగే మరి కొంతమందిని బిజెపిలోకి తీసుకొస్తామని చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఇక త్వరలోనే పవన్ కళ్యాణ్ కు తెలంగాణ బాధ్యతలను అమిత్ షా అప్పగించే అవకాశం ఉంది. మార్చి తర్వాత నుంచి పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటనకు వెళ్లే సూచనలు కనబడుతున్నాయి. హిందూ ధర్మాన్ని తెలంగాణలో బలోపేతం చేసే దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది. కొన్ని జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ బలంగా ఉండగా ఆ జిల్లాల్లో ఉన్న టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీలోకి తీసుకొచ్చె అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. రంగారెడ్డి, హైదరాబాద్ అలాగే మహబూబ్నగర్ జిల్లాల్లో ఉన్న కొంతమంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలను బిజెపిలోకి తీసుకొచ్చే విధంగా పావులు కదపనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ మహబూబ్నగర్ జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఇప్పటికీ ఉంది. అందుకే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలను కొంతమందిని పార్టీలోకి తీసుకురావాలని చంద్రబాబు వద్ద అమిత్ షా అభిప్రాయ పడినట్లు సమాచారం.

ఇక పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణలో జనసేన పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని.. ఆంధ్రప్రదేశ్ ఫార్ములానే 2028లో తెలంగాణలో అమలు చేయాలని ఆయన వద్ద అభిప్రాయపడ్డారట. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎలాగైనా సరే ఎన్డీఏ కూటమి విజయం సాధించే దిశగా వ్యూహాలను సిద్ధం చేయాలని చంద్రబాబును పవన్ కళ్యాణ్ ను అమిత్ షా కోరినట్లు సమాచారం. ఇక త్వరలోనే తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎంపిక కూడా బిజెపి అధిష్టానం పూర్తి చేయనుంది. ఆ తర్వాత నుంచి బిజెపి అగ్రనేతలు కూడా తెలంగాణ పై గట్టిగానే ఫోకస్ పెట్టే సంకేతాలు ఉండవచ్చు.

తెలంగాణలో కాపు ఓటు బ్యాంకు కూడా కొన్ని ప్రాంతాల్లో బలంగానే ఉంది. ప్రధానంగా హైదరాబాదులో కొన్ని చోట్ల కాపు ఓటు బ్యాంకు ఉంది. దానిని పవన్ కళ్యాణ్ బిజెపి వైపు ఎంతవరకు తిప్పుతారు అనేది చూడాలి. ఇప్పటివరకు తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేయలేదు. 2020లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని అందరు భావించారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అందుకు ఆసక్తి చూపించలేదు. అయితే వచ్చే ఎన్నికల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ ఫార్ములాను గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అమలు చేసి హిట్టు కొట్టాలని భావిస్తున్నట్లుగా సమాచారం.

ఇక తెలుగుదేశం పార్టీకి డిప్యూటీ మేయర్ పదవిని ఇచ్చేందుకు కూడా బిజెపి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక కొన్నిచోట్ల మున్సిపాలిటీలను కూడా కైవసం చేసుకునే విధంగా కూటమి అడుగులు వేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ మున్సిపాలిటీలపై కూటమి గట్టిగానే ఫోకస్ పెట్టే అవకాశం ఉండవచ్చు. ఇదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలను కూడా కూటమిలోకి తీసుకొచ్చే దిశగా ప్రణాళిక సిద్ధం చేయాలని చంద్రబాబును అమిత్ షా కోరినట్లు సమాచారం. త్వరలోనే తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ ఇలా రాష్ట్ర అధ్యక్ష పదవులను కూడా భర్తీ చేయాలని అమిత్ షా కోరారట.