ఆమ్రపాలిని టార్గెట్ చేసి పంపించేశారా
కాటా ఆమ్రపాలి. తెలుగు ప్రజలకు ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు పరిచయం అవసరం లేని పేరు ఇది. విశాఖ జిల్లా సబ్ కలెక్టర్‌గా అపాయింట్ ఐనదగ్గర్నించీ తనదైన అడ్మినిస్ట్రేషన్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ యంగ్ అండ్ డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్.
కాటా ఆమ్రపాలి. తెలుగు ప్రజలకు ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు పరిచయం అవసరం లేని పేరు ఇది. విశాఖ జిల్లా సబ్ కలెక్టర్‌గా అపాయింట్ ఐనదగ్గర్నించీ తనదైన అడ్మినిస్ట్రేషన్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ యంగ్ అండ్ డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్. మిగిలిన ఐఏఎస్ అధికారులతో కంపేర్ చేస్తే వయసులో చాలా చిన్నదే అయినప్పటికీ.. ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. దీంతో జిల్లాల పునర్విభజనలో వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్‌గా ఆమ్రపాలిని నియమించారు. ఆ తరువాత కొన్ని రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే ఆమె కేంద్ర సర్వీసుల్లోకి ఢిల్లీకి వెళ్లిపోయారు. తెలంగాణలో అధికారం మారిన తరువాత సడెన్ తెలంగాణలోకి మళ్లీ సడెన్ ఎంట్రీ ఇచ్చారు. గతంలో ఆమ్రపాలి ట్రాక్ రికార్డ్ తెలిసిన సీఎం రేవంత్ రెడ్డి వచ్చీ రాగానే ఆమ్రపాలికి కీలక బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్ అభివృద్ధిలో ఎంతో కీలకంగా ఉండే హెఎండీఏలో ఆడిషనల్ కమిషనర్ పదవి ఇచ్చారు. ఆ తరువాత మూసీ ప్రక్షాలన కోసం సీఎం తీసుకున్న నిర్ణయాన్ని పూర్తి చేసే బాధ్యత కూడా ఆమ్రపాలికే ఇచ్చారు. తరువాత జీహెచ్‌ఎంసీ కమిషర్‌గా నియమించారు.
సింపుల్‌గా చెప్పాలంటే ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే ఆమ్రపాలి చేతిలో హైదరాబాద్‌ను పెట్టేశారు సీఎం రేవంత్. తనదైన శైలిలో ఆమ్రపాలి పని చేస్తూ వెళ్తున్న టైంలో ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వం ఆమెకు షాకిచ్చింది. ఏపీ ఆమ్రపాలి ఏపీ కేడర్ అధికారిణి కావడంతో.. వెంటనే ఆమెను ఏపీకి వెళ్లాలని సూచించింది. ఆమెనే కాదు మరో 10 ఏపీ కేడర్ అధికారులను కూడా ఏపీకి వెళ్లాలని సూచించింది. కానీ తెలంగాణలోనే ఉండేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశారు ఆ 11 మంది ఐఏస్‌లు. ఆమ్రపాలి క్యాట్‌కు వెళ్లింది. ఆక్కడ కూడా రిలీఫ్ దొర్కపోవడంతో హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. కానీ కేంద్రం, క్యాట్ చెప్పిన విషయాన్నే హైకోర్ట్ కూడా చెప్పింది. దీంతో చేసేందేంలేక ఆమ్రపాలి ఏపీకి వెళ్లిపోయింది. రేపో మాపో ఆమెకు శాఖ కూడా కేటాయించారు. అయితే ఆమ్రపాలి విషయంలో ఇదంతా కావాలనే చేశారనే టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి తక్కువ సీట్లు వచ్చింది హైదరాబాద్‌లోనే. కానీ అదే హైదరాబాద్‌లో ఆమ్రపాలి వర్క్ స్టైల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి మైలేజ్ ఇస్తోంది. దీంతో రేవంత్ ప్రభుత్వాన్ని స్లో డౌన్ చేయాలనే ఆమ్రపాలిని ఇక్కడి నుంచి పంపించేశారని కొందరు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఇందులో ఎంత నిజం ఉంది అన్న విషయం పక్కన పెడితే.. వర్క్ విషయంలో మాత్రం ఆమ్రపాలి ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. అలాంటి ఆఫీసర్ వేరే రాష్ట్రానికి వెళ్లిపోవడం మనకు నష్టమే అనే వాదనలు వినిపిస్తున్నాయి.