అమృత…. చివరికి ఏం మిగిలింది? ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు?
ప్రేమ... పెళ్లి... హత్య.... నేరము ...శిక్ష .మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు తీర్పు మరోసారి జనంలో పెద్ద చర్చకే దారితీసింది. అగ్రకులం అమ్మాయి, దళితుడైన అబ్బాయి ప్రేమలో పడ్డారు.

ప్రేమ… పెళ్లి… హత్య…. నేరము …శిక్ష .మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు తీర్పు మరోసారి జనంలో పెద్ద చర్చకే దారితీసింది. అగ్రకులం అమ్మాయి, దళితుడైన అబ్బాయి ప్రేమలో పడ్డారు. అమ్మాయి తండ్రిని ఎదిరించి పెళ్లి చేసుకొని ఇంటి ఎదురుగానే కాపురం పెట్టి ఛాలెంజ్ చేసింది. ఊర్లో పరువు పోయింది అనే బాధతో కోటీశ్వరుడైన ఆ తండ్రి అల్లుడిని సుపారీ ఇచ్చి హత్య చేయించాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, అరెస్టులతో కుంగిపోయిన తండ్రి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రికి సహకరించిన వాళ్లందరికీ ఇప్పుడు ఉరి, జైలు శిక్షలు పడ్డాయి. ఇక్కడితో ఈ కథ అయిపోయిందా? ప్రేమ, ఎమోషన్స్ తో మొదలైన ఈ కథ ఇప్పుడు వాస్తవంతో ముగిసింది.
మిర్యాలగూడలో ప్రణయ్ అనే దళిత కుర్రాన్ని ప్రేమించిన అమృతఅనే అమ్మాయి…. డిగ్రీ పూర్తి కాకుండానే, తండ్రిని ఎదిరించి ప్రణయ్ ని పెళ్లి చేసుకుంది. ప్రణయ్ ఇంజనీరింగ్ పూర్తి చేయలేదు… అమృత డిగ్రీ కూడా చేయలేదు. ప్రేమిస్తే ఖచ్చితంగా పెళ్లి చేసేసుకోవాల్సిందే అన్న ఆత్రుతలో తండ్రి ఎంత చెప్పినా వినకుండా ప్రణయ్ ని పెళ్లి చేసుకుంది. అంతేకాదు ఊళ్లోనే కాపురం పెట్టి… చూశావా నిన్ను ఎదిరించి ఎలా పెళ్లి చేసుకొన్నానో… అని తండ్రిని రెచ్చగొట్టింది.
రియల్ ఎస్టేట్ వ్యాపారి… కోటీశ్వరుడు… లేక లేక పుట్టిన ఏకైక కూతురు…. పెళ్లి చేసుకోవడమే కాకుండా…. రోజు రకరకాల ఫోటోషూట్లు వీడియోలు రిలీజ్ చేస్తూ రెచ్చగొడుతోంది. ఆ తండ్రిలో క్రిమినల్ నిద్రలేచాడు. కూతురు వెళ్లి పోయింది. ఊళ్లో పరువు పోయింది. సంపాదించిన కోట్ల రూపాయలు ఉపయోగం లేకుండా పోయాయి. డబ్బులో పుట్టి ,డబ్బు లో పెరిగిన కూతురు అదే డబ్బుని ఛాలెంజ్ చేస్తుంది. దీనికి తోడు అమృత, ప్రణయ్ తొందరపడి పోయారు. ఓ పిల్లాడిని కనిపడేస్తే అమృత తండ్రి మారుతీరావు చచ్చినట్లు దారికొస్తాడని ఊహించారు ఇద్దరూ. ఇదంతా తట్టుకోలేని తండ్రి మారుతి రావు సుపారీ ఇచ్చి బిహారి గ్యాంగ్ తో అల్లుడిని చంపేశాడు.
2018 సెప్టెంబర్ లో ఈ హత్య జరిగింది. మీడియా, మిగిలిన ప్రపంచం మొత్తం అమృత వైపు నిలబడింది. మారుతీ రావు ని ఒక కిరాతకుడిగా అభివర్ణించింది. నా తండ్రిని కూడా చంపాల్సిందే అంటూ అమృత ప్రతిజ్ఞలు చేసింది. మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చింది. శపదాలు చేసింది. పోలీసులు …..హంతకుల్ని,హత్యకు ప్రేరేపించిన వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇవన్నీ తట్టుకోలేకపోయిన మారుతీ రావు చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటివరకు అమృతవైపు నిలబడిన సమాజం ఒక్కసారిగా మారుతి రావుపై సానుభూతి చూపించింది. ఆరున్నర ఏళ్ల తర్వాత ఈ హత్య కేసులో కోర్టు తీర్పు ఇచ్చింది. శిక్ష అనుభవించడానికి మారుతీరావు బతికి లేడు. డైరెక్ట్ గా మర్డర్ చేసిన హంతకుడు కి ఉరిశిక్ష, అందుకు సహకరించిన మారుతీ రావు సోదరులు ,మిగిలిన వాళ్ళకి జీవిత ఖైదు శిక్ష పడింది.ఇక్కడితో ఈ కథ అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ ఈ కథ తర్వాత మరో కథ ఉంది.
తన భర్తను చంపించిన తండ్రిని కూడా చంపాల్సిందేనని… భీషణ ప్రతిజ్ఞలు చేసిన అమృత, తండ్రి ఆస్తిలో చిల్లిగవ్వ కూడా నాకు అక్కర్లేదు నా బిడ్డను నేనే స్వతంత్రంగా పెంచుతాను అని శపథం చేసిన…. ఆ కూతురు, ప్రణయ్ తల్లిదండ్రులను కూడా నేనే చూసుకుంటాను అని ప్రకటించిన ఆమె, కాలంతోపాటు క్రమంగా మారిపోయింది. ఇప్పుడు రియాల్టీలో బతుకుతుంది. ఎమోషన్స్ శాశ్వతం కాదు… అనే విషయాన్ని ఆలస్యంగా గుర్తించింది. తండ్రి చనిపోయాక ఇంటికి తిరిగి వచ్చింది. తల్లి దగ్గరకు చేరింది.మారుతీ రావు ఆస్తుల్ని వాటాలు వేసింది. అన్నదమ్ములు వాళ్ళ ఆస్తులు వాళ్ళు పట్టుకుపోయారు. మిగిలిన ఆస్తిని జాగ్రత్త చేసుకుంది అమృత. తల్లిని తీసుకొని హైదరాబాద్ వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. కొడుకుని పెంచుకుంటుంది. ఏ ఆస్తులు కోసం తండ్రి ఇంత చేశాడో ఆస్తినీ ఆమె ఇప్పుడు అనుభవిస్తుంది. చిత్రంగా ప్రణయ్ తల్లిదండ్రులకు దూరంగా ఉంటుంది. ఆ ఇంటికి దూరంగా కొడుకుని పెంచుతుంది. అసలు తనకు ఆ కుటుంబంతో సంబంధం లేనట్లే వ్యవహరిస్తోంది.
ఇన్స్టాలో రీల్స్ లో అప్పుడప్పుడు దర్శనమిస్తుంది.. ఇప్పుడు రియాల్టీలో బతుకుతుంది. తెలిసి తెలియని వయసులో ఆవేశపడి జీవితాన్ని అర్థం చేసుకోలేక, ప్రేమిస్తే తక్షణమే పెళ్లి చేసేసు కోవాలి… సినిమాటిక్ మోడ్లో అమ్మానాన్నలను ఎదిరించి బెదిరించాలని వెర్రి వేషాలేసి… ఇప్పుడు ఎవరికీ కాకుండా మిగిలిపోయింది. కొత్త జీవితం కోసం ఎదురుచూస్తోంది. ఈ కథలో బలై పోయింది ఇద్దరే. ఒకరు ప్రణయ్. మరొకరు మారుతీ రావు. స్కూల్ డేస్ లోనే అమృతనీ ప్రేమించి, రూపాయి సంపాదన లేకుండానే ఆమెని పెళ్లి చేసుకొని… తొందరపడి తల్లిని చేసి…. ఊర్లో ధనవంతులైన మామ కి చాలెంజులు చేసి చివరికి కత్తివేటుకు బలైపోయాడు ప్రణయ్.
కోట్ల రూపాయలు సంపాదించి…. కూతురుని మరో కోటీశ్వరుడికి పెళ్లి చేయాలని ఆశించి…. అది జరక్క అవమానాలు పాలై అల్లుడిని చంపి తాను చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు మారుతీ రావు. డబ్బు లో పెరిగి…. చదువు కంటే…. కెరీర్ కంటే ప్రేమలు పెళ్లిళ్లే ముఖ్యమని… డిగ్రీ కూడా పూర్తి చేయకుండానే ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలని ఆత్రుత పడి, అర్థం లేని ఆలోచనలేని పని చేసి చివరికి ఒంటరిగా మిగిలిపోయింది అమృత. ఇప్పుడు అసలు ప్రణయ్ తో సంబంధం లేనట్లే వ్యవహరిస్తోంది. సింపుల్ గా తీర్పు వచ్చిన రోజు నీ ఆత్మకు శాంతి కలగాలని ఒక ట్వీట్ చేసి సరిపెట్టుకుంది. ప్రణయ్ హత్యలు పరోక్షంగా అన్నకు సహకరించిన మారుతీ రావు సోదరులు చివరికి జైలు పాలయ్యారు. వాళ్ల కుటుంబ సభ్యులు రోడ్డును పడ్డారు. ఈ వాస్తవ కథలో….. చివరికి అందరూ ఓడిపోయారు.
తప్పు ఎవరిది? న్యాయం ఎవరికి జరిగింది? అన్యాయం ఎవరికీ జరిగింది అనేది జనం వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలను బట్టి నిర్ణయించుకుంటున్నారు.