యాంకర్ శ్యామలకు కీలక పదవి.. జగన్ నిర్ణయం వెనక అసలు కారణం ఇదా
ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత.. బౌన్స్‌బ్యాక్ అయ్యేందుకు జగన్ ఆచీతూచీ అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే జిల్లా అధ్యక్షులను మార్చిన జగన్.. సలహాదారులుగా కూడా కీలక వ్యక్తులకు బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు మరిన్ని మార్పులకు సిద్దం అయ్యారు.

ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత.. బౌన్స్‌బ్యాక్ అయ్యేందుకు జగన్ ఆచీతూచీ అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే జిల్లా అధ్యక్షులను మార్చిన జగన్.. సలహాదారులుగా కూడా కీలక వ్యక్తులకు బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు మరిన్ని మార్పులకు సిద్దం అయ్యారు. వైసీపీ అధికార ప్రతినిధుల జాబితాను జగన్ రిలీజ్ చేసారు. నలుగురు అధికార ప్రతినిధులను ఎంపిక చేసిన జగన్.. అందులో ఇద్దరు మహిళలకు స్థానం కల్పించారు. యాంకర్ శ్యామలకు కీలక బాధ్యతలు అప్పగించారు. మాజీ మంత్రి రోజాతో సమానంగా యాంకర్ శ్యామలకు పదవి దక్కింది.
అధికార ప్రతినిధుల జాబితాలో శ్యామలతో పాటు భూమన కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకర్, రోజా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి తరపున కేవలం ప్రచారానికే పరిమితం అయిన శ్యామల.. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినట్లు అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరఫున బలంగా ప్రచారం చేసినవారిలో శ్యామల కూడా ఒకరు. ఏయే నియోజకవర్గాల్లో వైసీపీ బ్యాలెట్ నెంబర్ ఎంతో కూడా చెప్తూ.. ఆమె సోషల్ మీడియాలో క్యాంపెయిన్ నిర్వహించారు! ఓటమి తర్వాత కూడా ఆమె పార్టీలోనే కొనసాగుతున్నారు. పిఠాపురంలో పవన్ కు వ్యతిరేకంగా శ్యామల ప్రచారం చేయడం ఆయన అభిమానులకు నచ్చలేదు. దీంతో శ్యామలను సోషల్ మీడియాలో టార్గెట్ చేశారు. వ్యక్తిగతంగా ట్రోల్ చేశారు. అయినా ఆమె వెనక్కు తగ్గలేదు.
తనకు నచ్చిన పార్టీకి, వ్యక్తికి ప్రచారం చేస్తే ఇలా ట్రోల్ చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏకంగా ఆమెను పార్టీ అధికార ప్రతినిధిగా నియమించడం సంచలనం కలిగించింది. పార్టీకోసం నేరుగా పని చేస్తే సినిమా రంగంలో అవకాశాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. అదే సమయంలో విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతాయి. అయినా అధికార ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టేందుకు ఆమె ముందుకు రావడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఐతే అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ ఖాళీ అవుతోంది. జగన్‌కు సన్నిహితులు అని పేరు ఉన్న వారు కూడా జంప్ జిలానీ అంటున్నారు. ఇలాంటి సమయంలోనూ వైసీపీనే నమ్ముకున్నారు శ్యామల. ఐతే ఈమెకు పదవి ఇవ్వడం వెనక జగన్ భారీ సందేశం ఉందనే టాక్ నడుస్తోంది. నమ్మినవాళ్లకు పార్టీ ఎప్పుడూ అండా ఉంటుందనే మెసేజ్‌ను పార్టీ శ్రేణులకు పంపించినట్లు అవుతుందనే ఆలోచనగా కనిపిస్తోంది. దీనికితోడు.. యాంకర్ శ్యామలతో వైసీపీకి పొలిటికల్‌గా గ్లామర్ కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది.