చంద్రబాబుపై శ్యామల కేసు
కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల ఫైర్ అయ్యారు. చేతగానప్పుడు, చేయలేనప్పుడు శుష్క వాగ్ధానాలు చేయకూడదని చంద్రబాబు మహిళలకు ఎన్నో పథకాలను అమలు చేస్తామని మోసం చేశారు అంటూ మండిపడ్డారు.
కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల ఫైర్ అయ్యారు. చేతగానప్పుడు, చేయలేనప్పుడు శుష్క వాగ్ధానాలు చేయకూడదని చంద్రబాబు మహిళలకు ఎన్నో పథకాలను అమలు చేస్తామని మోసం చేశారు అంటూ మండిపడ్డారు. సూపర్ సిక్స్ పేరుతో బాండు పేపర్లు ఇచ్చి నిలువునా మోసం చేశారన్నారు. మహిళలను మోసం చేసినందుకు చంద్రబాబుపై 420 కేసు పెట్టవచ్చన్నారు శ్యామల.
తల్లికి వందనం పేరుతో జగన్ ఇస్తున్న అమ్మ ఒడి పథకాన్ని ఆపేశారని మండిపడ్డారు. హామీలు మాత్రం జనంలో ఇచ్చారు… ఇవ్వలేక పోతున్నామని నాలుగు గోడల మధ్య ఎందుకు చెప్తున్నారని ఆయన నిలదీశారు. తల్లికి వందనం ఇవ్వట్లేదని టీడీపీ నేతలు జనంలోకి వచ్చి చెప్పాలన్నారు. కనీసం ఉచిత బస్సు పథకాన్ని కూడా ఎందుకు అమలు చేయటం లేదు? అని నిలదీశారు. 2025 జనవరి 1 జాబ్ కేలండర్ ఇస్తామని లోకేష్ ప్రకటించారన్నారు. హామీల అమలుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు.