పవన్ ను చంపేస్తాం: బెదిరింపు కాల్స్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. చంపేస్తామని హెచ్చరిస్తూ ఆగంతకుడి నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయని పేషీ అధికారులు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. చంపేస్తామని హెచ్చరిస్తూ ఆగంతకుడి నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయని పేషీ అధికారులు వెల్లడించారు. పవన్ కళ్యాణ్ ను చంపేస్తాం అంటూ మెసేజ్ లు వచ్చాయని… ఉప ముఖ్యమంత్రిని ఉద్దేశించి అభ్యంతకర భాషతో హెచ్చరిస్తూ మెసేజులు పంపించాడు ఆగంతకుడు
పేషీ సిబ్బంది బెదిరింపు కాల్స్, మెసేజులను ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు అధికారులు. బెదిరింపు కాల్స్ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు ఉప ముఖ్యమంత్రి పేషీ అధికారులు తెలియజేసినట్టు సమాచారం. ఉత్తరప్రదేశ్ నుంచి ఈ మెసేజ్ లు వచ్చాయని గుర్తించారట.