YS JAGAN HELICOPTERS: జనం సొమ్ముతో సోకులు.. 4 కోట్లతో రెండు హెలికాప్టర్లు.. జగన్‌పై ఈసీకి కంప్లయింట్
ఐదు, పది కిలోమీటర్ల దూరం వెళ్ళడానికి కూడా హెలికాప్టర్లు వాడుతూ.. జగన్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఈ ఇష్యూపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
YS JAGAN HELICOPTERS: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాలుగు కోట్ల రూపాయల ఖర్చుతో రెండు హెలికాప్టర్లను సిద్ధం చేసింది. ఈ రెండూ కొన్నవి కావు. ఒక నెలకు అద్దెకు ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ నాలుగు కోట్ల రూపాయల అద్దెను చెల్లించబోతోంది. ఇది సీఎం జగన్ ఎన్నికల ప్రచారం కోసమేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఐదు, పది కిలోమీటర్ల దూరం వెళ్ళడానికి కూడా హెలికాప్టర్లు వాడుతూ.. జగన్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
Lasya Nanditha: నలుగురితో కలిసి వెళ్తే.. ఇద్దరికే ప్రమాదం.. యాక్సిడెంట్‌కు ముందు అసలేం జరిగింది
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఈ ఇష్యూపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో.. తమ పార్టీ వైసీపీ ప్రచారం కోసం ప్రభుత్వ హెలికాప్టర్లను వాడుకోబోతున్నారు. ప్రజల సొమ్ముతో సొంత పార్టీకి ప్రచారమేంటని ప్రతిపక్షనేతలు మండిపడుతున్నారు. జగన్ పర్యటన కోసమే ఈ రెండు హెలికాప్టర్లకు నెలకు 3 కోట్ల 82 లక్షల రూపాయల అద్దె చెల్లించబోతోంది ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్. ఇందులో ఒకటి విజయవాడలో.. మరొకటి విశాఖలో అందుబాటులో ఉంచారు. హెలికాప్టర్లను ప్రభుత్వం కొనుగోలు చేయకుండా.. అద్దెకి తీసుకుంటోంది. ఒక్కో హెలికాప్టర్‌కి రెండు ఇంజిన్లు ఉన్నాయి. అందుకే ఒక్కోదాని అద్దె కోటీ 91 లక్షలుగా నిర్ణయించారు. గ్లోబల్ వెక్ట్రా హెలికాప్టర్ లిమిటెడ్ అనే సంస్థ వీటిని సమకూరుస్తోంది. ఈ హెలికాప్టర్లకు అద్దే కాదు.. ఎయిర్ పోర్ట్ హ్యాండ్లింగ్, పైలెట్లు, సిబ్బంది, ఇంధన ఖర్చు.. ఇదంతా ఏపీ ప్రభుత్వమే భరించనుంది.
అంటే నెలకు రెండు హెలికాప్టర్లకు కలిపి నాలుగు కోట్ల రూపాయలకు పైగానే ప్రభుత్వం ఖర్చు చేయబోతోంది. ఇప్పుడు సీఎం జగన్ ఉపయోగిస్తున్న హెలికాప్టర్ పాతబడిందనీ.. పర్యటనలకు అనుకూలంగా లేదనీ.. అందుకే అద్దెకు తీసుకుంటున్నట్టు అధికారులు చెబుతున్నారు. సీఎం భద్రతా చర్యల్లో భాగంగానే ఈ హెలికాప్టర్లు సమకూరుస్తున్నట్టు చెబుతున్నారు. జగన్‌కు జడ్ కేటగిరీ భద్రత ఉండటంతో.. ఇంటెలిజెన్స్, డీజీ, ప్రొటోకాల్ విభాగాలు రెండు హెలికాప్టర్లు కావాలని సిఫార్సు చేశాయట. అందుకే అద్దెకు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. మరి ఎన్నికల ముందే వీటిని ఎందుకు తీసుకుంటున్నారు.. ఇన్నాళ్ళు జగన్ భద్రత సంగతి అధికారులకు గుర్తుకు రాలేదా అన్న ప్రశ్నలకు అధికారుల నుంచి ఎలాంటి సమాధానం లేదు. హెలికాప్టర్లను అద్దెకు తీసుకున్న వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తెచ్చారు రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు. ఏపీలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసమే ప్రభుత్వం వీటిని తీసుకుంటోందని ఆయన ఆరోపించారు. ఎన్నికల సమయంలో భద్రత అని చెప్పి జగన్ ఒక్కరే ప్రభుత్వ హెలికాప్టర్లు వాడుకోవడం అనేది ఎన్నికల నిబంధన ఉల్లంఘన కిందకు వస్తుందని కంప్లయింట్‌లో పేర్కొన్నారు రఘురామ కృష్ణంరాజు.
అయితే రాజకీయ నేతల హెలికాప్టర్ల వినియోగంపై ఈసీ గతంలో ఎలాంటి నిషేధం విధించలేదు. కానీ వాటి వివవరాలను ముందుగా ఈసీకి సమర్పించాలి. ఇప్పుడు ప్రభుత్వ ఖర్చుతో వైసీపీ ప్రచారం అన్నదానిపై ఈసీ అభ్యంతరం చెబుతుందా.. లేకపోతే ఎన్నికల కోడ్ వచ్చాక.. ఆ హెలికాప్లర్లను వాడకుండా నిషేధం విధిస్తుందా అన్నది చూడాలి. పార్టీ ప్రచారం కోసం ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. నేను పేదను.. నాకేమీ లేవు అని చెప్పుకునే జగన్.. జనంలోకి వెళ్ళడానికి హెలికాప్టర్లు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఈ హెలికాప్టర్ల ఖర్చును వైఎస్పార్ పార్టీ ఫండ్ నుంచి చెల్లించుకోవాలనీ.. జనం సొమ్ముతో కాదని డిమాండ్ చేస్తున్నారు.