ఏపీ బడ్జెట్ లెక్కలు ఇవే

ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టారు. 2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.34లక్షల కోట్లు కాగా ద్రవ్యలోటు రూ.68,743 కోట్లు అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 11, 2024 | 11:26 AMLast Updated on: Nov 11, 2024 | 11:26 AM

Andhra Pradeshs Annual Budget Was Presented By Finance Minister Payyavula Keshav

ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టారు. 2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.34లక్షల కోట్లు కాగా ద్రవ్యలోటు రూ.68,743 కోట్లు అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లుగా ఉంది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి రూ. 16.739 కోట్లు కేటాయించారు. జలవనరులు రూ.16,705 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. ఉన్నత విద్య కోసం రూ.2326 కోట్లు కేటాయించగా పట్టణాభివృద్ధి రూ.11490 కోట్లు కేటాయించారు.

పరిశ్రమలు, వాణిజ్యం రూ.3,127 కోట్లు, ఇంధన రంగం రూ.8,207 కోట్లు, పోలీస్ శాఖ రూ. 8495 కోట్లు, బీసీ సంక్షేమం రూ.3,907 కోట్లు, మైనారిటీ సంక్షేమం రూ.4,376 కోట్లు, ఎస్టీ సంక్షేమం రూ.7,557 కోట్లు, అటవీ పర్యావరణ శాఖ రూ.687 కోట్లు, గృహ నిర్మాణం రూ. 4,012 కోట్లు, నైపుణ్యాభివృద్ధి శాఖ రూ.1,215 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. ఈ సందర్భంగా పయ్యావుల కీలక వ్యాఖ్యలు చేసారు. సమాచార విప్లవాన్ని వినియోగించుకోవాలన్నారు మంత్రి.

శాశ్వత రాజధాని లేకుండా రాష్ట్ర విభజన జరిగిందన్న ఆయన… రాష్ట్రాన్ని పునర్మిర్మాణ దిశగా నడిపించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుందని తెలిపారు. గత ప్రభుత్వం నీటి పారుదల రంగాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. గత ప్రభుత్వం పోలవరం నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లలేదని ఆరోపించారు. గత ప్రభుత్వం ఉత్పాదక మూలధనాన్ని నిలిపివేసిందన్న ఆయన… తద్వారా ఉత్పత్తి తగ్గిపోయి అభివృద్ధికి ఆటంకం కలిగిందన్నారు.