Anil Kumar Poluboina: ఎంపీగా పోటీ చేయనున్న అనిల్ కుమార్ యాదవ్..?
నరసరావుపేట స్థానం నుంచి ఎంపీగా పోటీ చేయాలని జగన్.. అనిల్‌కు సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ విషయం ఆలోచించుకోమని అనిల్‌కు సీఎం చెప్పి పంపినట్లు సమాచారం. నరసరావుపేట లోక్‌సభ స్తానం నుంచి సిట్టింగ్ ఎంపీగా.. లావు శ్రీకృష్ణ దేవరాయలు ఉన్నారు.

Anil Kumar Poluboina: నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రాబోయే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. నరసరావుపేట లోక్‌సభ స్థానం నుంచి అనిల్‌ను పోటీ చేయించాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఈ మేరకు అనిల్ కుమార్.. వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్మోహన్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నరసరావుపేట స్థానం నుంచి ఎంపీగా పోటీ చేయాలని జగన్.. అనిల్‌కు సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
MEGASTAR CHIRANJEEVI: చిరంజీవికి పద్మవిభూషణ్.. ఆయన సాధించిన అవార్డులు ఇవే
ఈ విషయం ఆలోచించుకోమని అనిల్‌కు సీఎం చెప్పి పంపినట్లు సమాచారం. నరసరావుపేట లోక్‌సభ స్తానం నుంచి సిట్టింగ్ ఎంపీగా.. లావు శ్రీకృష్ణ దేవరాయలు ఉన్నారు. అయితే, ఆయన ఇటీవలే రాజీనామా చేశారు. త్వరలో జనసేన లేదా టీడీపీలో చేరే అవకాశం ఉంది. దీంతో ఈ స్థానం నుంచి బీసీని బరిలోకి దింపాలని జగన్ భావిస్తున్నారు. అందుకే అనిల్ కుమార్ యాదవ్‌కు టిక్కెట్ కేటాయించబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి అనిల్ అంగీకరిస్తే.. ఎంపీగా పోటీ చేయడం ఖాయం. అయితే, అనిల్ కుమార్‌తోపాటు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక ఎంపీ పేరును నరసరావుపేట లోక్‌సభ స్థానానికి పరిశీలిస్తున్నారు. అనిల్ కాదంటే.. అధిష్టానం ఆయనవైపు మొగ్గు చూపుతుంది. మరోవైపు మంత్రి విడదల రజని పేరును కూడా అధిష్టానం పరిశీలించింది. కానీ, అనిల్ అయితేనే కరెక్ట్ అని భావించి, అతడిని ఎంపికి చేసింది. అలాగే కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీత ఈసారి అసెంబ్లీకి పోటీ చేయబోతున్నారు.
ఆమె ఫిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు. కాకినాడ లోక్‌సభ స్తానం నుంచి సునీల్‌ను పోటీ చేయించాలనుకుంటోంది. కానీ, ఇందుకు ఆయన సుముఖంగా లేరు. గతంలో ఆయన కాకినాడ నుంచే పోటీ చేసి మూడు సార్లు ఓడిపోయారు. ప్రకాశం జిల్లాకు చెందిన గొట్టిపాటి భరత్ కూడా గురువారం సీఎంను కలిశారు. రేపల్లె నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణనే తిరిగి కొనసాగించాలని వైసీపీ అధిష్ఠానం నిర్ణయించింది. గతంలో ప్రకటించిన తొలి జాబితాలో ఆయనను రేపల్లె బాధ్యతల నుంచి తప్పించిన విషయం తెలిసిందే.