Top story: వర్రా రవీందర్ రెడ్డికి ప్రతిపక్షంలో ఉండగానే అనిత వార్నింగ్

సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టడంపై హోం మంత్రి అనిత ముందే హెచ్చరించారా ? తెలుగు మహిళా అధ్యక్షురాలిగా ఉన్నపుడే వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు వర్రా రవీందర్‌రెడ్డికి వార్నింగ్‌ ఇచ్చారా ?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 14, 2024 | 09:05 PMLast Updated on: Nov 14, 2024 | 9:05 PM

Anita Warning While Being In Opposition To Varra Ravinder Reddy

సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టడంపై హోం మంత్రి అనిత ముందే హెచ్చరించారా ? తెలుగు మహిళా అధ్యక్షురాలిగా ఉన్నపుడే వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు వర్రా రవీందర్‌రెడ్డికి వార్నింగ్‌ ఇచ్చారా ? ప్రతిపక్షంలో ఉండగా చెప్పినట్లే…అధికారంలోకి వచ్చాక హోం మంత్రి అనిత…యాక్షన్ షురూ చేశారా ? మళ్లీ అధికారంలోకి వస్తామన్న ధీమాతో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు…ఇష్టానుసారంగా పోస్టులు పెట్టారా ? అప్పుడు రెచ్చిపోయి…ఇపుడు జైలు పాలవుతున్నారా ? సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలంటే…ఒకటి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిందేనా ?

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ సోషల్ మీడియా రెచ్చిపోయింది. అడ్డు అదుపు లేకుండా వ్యవహరించింది. ప్రత్యర్థుల టార్గెట్ గా వరుస పోస్టులతో ఉక్కిరిబిక్కిరి చేసింది. గతంలో ఏ పార్టీ చేయని విధంగా…టీడీపీ నేతలు, మహిళా నాయకురాళ్లకు వైసీపీ సోషల్ మీడియా కంటి మీద కునుకు లేకుండా చేసింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్, వంగలపూడి అనిత…ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాంతాడంత పెరుగుతూనే ఉంటుంది. మాటలతో చెప్పలేని…కళ్లతో చూడలేని పోస్టులతో మానసికంగా వేధించారు. మరొకరితో చెప్పుకోలేని…మాట్లాడలేని భాషను వినియోగించారు. చెప్పుకోలేని జుగుప్సకరమైన పోస్టులు పెట్టారు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు. అఖరికి వారి కుటుంబసభ్యులు, పిల్లలను కూడా వదిలిపెట్టలేదు. కొంచెమైనా బుద్ది లేకుండా వ్యవహరించారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు పెట్టిన పోస్టులతో నాడు లోలోపల కుమిలిపోయారు టీడీపీ, జనసేన నేతలు. పలువురు బహిరంగంగా కన్నీటి పర్యంతమయ్యారు.

ప్రస్తుత హోం మంత్రి వంగలపూడి అనిత…సోషల్ మీడియా పోస్టుల విషయంలో ఏం చెప్పారో…నేడు చేసి చూపిస్తున్నారు. టీడీపీ, జనసేన నేతలపై జుగుప్సకరమైన పోస్టులతో రెచ్చిపోయిన వారి పని పడుతోంది కూటమి ప్రభుత్వం. నోటికి అదుపు లేకుండా…మానవత్వం అన్నదే లేకుండా వ్యవహరించిన వారంతా…వణికిపోతున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా….ఎవరికి ఇష్టం ఇచ్చినట్లు వాళ్లు పోస్టులతో పైశాచికత్వం పొందారు. టీడీపీ, జనసేన నేతలు, కుటుంబసభ్యులను మానసికంగా వేధింపులకు గురి చేశారు. సజ్జల భార్గవ్ రెడ్డి ఎంట్రీతో మరింత దుర్మార్గం…కారెక్టర్ అసాసినేషన్ జరిగింది. నాడు పలువురు పోలీసులకు కంప్లయింట్ చేసినా…ఒక్కరంటే ఒక్కరు కూడా పట్టించుకోలేదు. టీడీపీ, జనసేన నేతలు…సోషల్ మీడియా పోస్టులపై ఫిర్యాదు చేస్తే నాటి అధికార పార్టీకి తొత్తుల్లా వ్యవహరించారు. దీంతో వైసీపీ అనుకూల వాదులు మరింత రెచ్చిపోయి వ్యవహరించారు.

సీన్ కట్ చేస్తే…కాలచక్రం గిర్రున తిరిగింది. బళ్లు ఓడలయ్యాయి…ఓడలు బళ్లయ్యాయి. హోం మంత్రిగా వంగలపూడి అనిత బాధ్యతలు స్వీకరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో…వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు మళ్లీ రెచ్చిపోయారు. కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందిలే…తమను టచ్ కూడా చేయలేరంటూ…ప్రభుత్వానికి మంత్రులు, ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా పోస్టు పెట్టారు. నాలుగు నెలల పాటు వేచి చూసిన కూటమి ప్రభుత్వం సోషల్ మీడియా యాక్టివిస్టుల గుండెల్లో రెళ్లు పరిగెత్తిస్తోంది. వర్రా రవీందర్ రెడ్డిని వెంటాడి…వేటాడి అరెస్టు చేసింది. తప్పించుకునేందుకు ప్రయత్నించినా….వెతికి వెతికి పట్టుకుంటున్నారు. ఆ తర్వాత ఇంటూరి రవికిరణ్, రెడ్డిగారి అమ్మాయి లాంటి వారిని ఏ మాత్రం వదిలిపెట్టలేదు. వారి ఇళ్లకు వెళ్లి…స్టేషన్లకు తీసుకొచ్చి కేసులు పెట్టింది. నాడు చిటిక వేసి చెప్పిన హోం మంత్రి అనిత….పోస్టులతో వేధించిన వారిని వెతికి వెతికి పట్టుకుంటున్నారు పోలీసులు. వరుసగా కేసులు పెట్టి కటకటాల్లోకి పంపుతోంది సర్కార్. ఏ పార్టీకి అనుకూలంగా పని చేసినా…ఏ పార్టీ అభిమానులైనా…సోషల్ మీడియాలో పోస్టుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించకపోతే కష్టాలు తప్పవని హోచ్చరించారు హోం మంత్రి.

ఇన్ ఫ్యూచర్ లో సోషల్ మీడియాలో…ఇష్టానుసారంగా…క్యారెక్టర్ అసాసినేషన్ చేసేలా పోస్టులు పెట్టాలంటే వణికిపోయేలా చేస్తోంది కూటమి ప్రభుత్వం. జుగుప్సాకరంగా పోస్టులు పెడితే…చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పేలా చర్యలు తీసుకుంటోంది ఏపీ సర్కార్. ఏదో పార్టీ ఇచ్చే డబ్బు కోసం రెచ్చిపోయి పోస్టులు పెడితే….పుచ్చిపోయేలా పోలీసులు చర్యలు ఉంటాయి. ఫలితం పార్టీలు అనుభవించవ్. వ్యక్తిగతంగా జైలు పాలయ్యేది మీరే… సోషల్ మీడియా యాక్టివిస్టులు…పరాహాషార్.