శ్రీరెడ్డిని వదలం: వార్నింగ్ ఇచ్చిన అనిత
విజయవాడలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న హోం మంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో పోలీసులు ఇప్పుడే పోలీసుల పాత్ర పోషిస్తున్నారన్నారు.
విజయవాడలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న హోం మంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో పోలీసులు ఇప్పుడే పోలీసుల పాత్ర పోషిస్తున్నారన్నారు. వైసిపి ప్రభుత్వ పాలనలో ఐదేళ్లు పోలీసుల పాత్రకు బదులుగా పరదాలు కట్టే పాత్ర పోషించారని ప్రతిపక్ష పార్టీల నాయకుల ఇళ్ల దగ్గర బందోబస్తు చేశారని విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో ఇప్పుడే పోలీసులు సక్రమ బాధ్యతలు ధైర్యంగా గౌరవప్రదంగా నిర్వహిస్తున్నారన్నారు ఆమె. దీనిపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కొంత నెప్పి ఉంటుందని దానికి మా దగ్గర మందు కూడా ఉందన్నారు.
షర్మిలకు కూడా జగన్ ప్రవర్తనపై విసుగు వచ్చిందన్నారు. అందుకే అసెంబ్లీకి వెళ్ళక పోతే రాజీనామా చేయాలి అని షర్మిల అన్నారని షర్మిల మాటలు నిజమే కదా అని ప్రశ్నించారు. అసెంబ్లీకి వచ్చి అధ్యక్షా అనక పోతే ఇంకా ఎమ్మెల్యే పదవి ఎందుకని నిలదీశారు. అసెంబ్లీకి జగన్ రాడు..మిగిలిన 10 మందిని కూడా రానివ్వడన్నారు. ఈ సందర్భంగా శ్రీ రెడ్డి క్షమాపణలు చెప్పడంపై అనిత పరోక్షంగా స్పందించారు. సోషల్ మీడియా వేదిక గా కారు కూతలు కూసి ఇప్పుడు తప్పు అయిపోయిందని కొందరు అంటున్నారని అటువంటివారిని క్షమించాలా? అని నిలదీశారు. క్షమించే ప్రసక్తి లేదు… తప్పు చేసిన వారిని.. చేయించిన వారిని చట్టపరంగా శిక్షించి తీరతామన్నారు.
రాష్ట్ర పరిస్థితి వెంటిలేటర్ పై ఉందన్నారు. అన్ని రంగాలను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడన్న ఆమె గంజాయి విశ్చలవిడి అయిందని ఆరోపించారు. స్కూల్ పిల్లల బ్యాగుల్లో కూడా గంజాయి ఉంటుందంటే అత్యంత బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేసారు. ఇటువంటి పరిస్థితులు మార్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో కృషి చేస్తున్నామని తెలిపారు. సోషల్ మీడియాలో రాజకీయాలు చేస్తూ ఇల్లలో వారి పైన కూడా అసభ్యకర పోస్టులు పెడుతున్నారు.. పెట్టారని మండిపడ్డారు.