బ్రేకింగ్: రజనీపై మరో ఎఫ్ఐఆర్
చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి విడుదల రజిని పై వరసగా కేసులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఎడ్లపాడు లో స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించిన వ్యవహారంలో ఆమెపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి విడుదల రజిని పై వరసగా కేసులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఎడ్లపాడు లో స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించిన వ్యవహారంలో ఆమెపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. గవర్నర్ అనుమతితో రజనీపై కేసు నమోదు చేశారు అధికారులు. కేసు నమోదు తర్వాత ఆమె ఎంపీ లావు కృష్ణదేవరాయలపై మీడియా సాక్షిగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనమయ్యాయి.
ఇక తాజాగా మరో వ్యవహారం రజినీకి తలనొప్పిగా మారే సంకేతాలు కనపడుతున్నాయి. చిలకలూరిపేటకు చెందిన నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం పలనాడు జిల్లా ఎస్పీకి ఓ ఫిర్యాదు చేశారు. రజిని అక్రమాలను తాను ప్రశ్నించినందుకు 2022 ఏప్రిల్ లో తనను చిత్రహింసలకు గురి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాదాపు 100 మంది తన ఇంటి పైకి వచ్చి దాడి చేశారని.. ఫర్నిచర్ తో పాటుగా తన ఆస్తిని కూడా ధ్వంసం చేసినట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అప్పట్లో తాను పోలీసులకు ఫిర్యాదు చేసిన సరే ఫలితం లేకుండా పోయిందని.. నామమాత్రంగా సంబంధం లేని వ్యక్తులపై కేసు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యులను కూడా వేధించిన రజనీపై ఆమె మరిది గోపి పై కేసు నమోదు చేయాలని ఎస్పీని కోరారు సుబ్రహ్మణ్యం. వీళ్ళిద్దరి పేర్లు కూడా ఎఫ్ఐఆర్ ల నమోదు చేసి తనకు న్యాయం చేయాలని ఎస్పీకి విజ్ఞప్తి చేశారు.