వైసీపీకి షాక్ ఇచ్చిన మరో మాజీ ఎమ్మెల్యే
వైసిపి కి గుడ్ బై చెప్పిన భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్... వైఎస్ఆర్సిపి ప్రాథమిక సభ్యత్వంతో పాటుగా నియోజకవర్గ ఇన్చార్జి పదవకి రాజీనామా చేసారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తన రాజీనామా లేఖని పంపించారు.
వైసిపి కి గుడ్ బై చెప్పిన భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్… వైఎస్ఆర్సిపి ప్రాథమిక సభ్యత్వంతో పాటుగా నియోజకవర్గ ఇన్చార్జి పదవకి రాజీనామా చేసారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తన రాజీనామా లేఖని పంపించారు. వైసిపి నీ అధికారంలోకి తీసుకురావడానికి శాయ శక్తుల కృషి చేశానని అధిష్ఠానం నాయకుల్ని కార్యకర్తల్ని బానిసల మాదిరి చూసారని మండిపడ్డారు. 2014 లో ఓటమి పాలయిన 2019 లో అధికారం లోకి వచ్చామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రజా సమస్యల మీద పోరాటం చేసామన్నారు.
2019 లో అత్యంత ప్రజాదరణ పొందిన పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి పోటీ చేసిన భయపడకుండా పోటీ చేశానని… పార్టీ నుండి ఎటువంటి సహాయం లేకపోయినా వెనక్కి తిరిగి చూడలేదన్నారు. మాజీ సిఎం జగన్ దగ్గర ఉన్నప్పుడే మా ఇంట్లో రైడ్ జరిగిందన్నారు. కనీస ధైర్యం చెప్పకుండా వైసిపి నీ అధికారం లోకి తేవాలని చెప్పారని, సీఎం జగన్ రాష్ట్రాన్ని నాలుగు భాగాలుగా చేసిన్న నలుగురికి పెత్తనం అప్పచెప్పారని మండిపడ్డారు. నాలుగు సంవత్సరాలు పెత్తనం ఎై.వి సుబ్బారెడ్డి పెత్తనం చేశారని వైసీపీలో నాకు ఎటువంటి సముచిత స్థానం కల్పించారో అందరికీ తెలిసిందే అంటూ ఆవేదన వ్యక్తం చేసారు.