YCP MLAs : వైసీపీలో మరో పాతిక మంది ఫట్ ? ఇవాళ లిస్ట్ రిలీజ్ పై టెన్షన్
వైసీపీలో ఇంకెవరికి సీటు గండం పొంచి ఉంది..? ఎవరి చీటీ చిరగబోతోంది..? వైసీపీ ఎమ్మెల్యేల్లో ప్రస్తుతం ఇదే టెన్షన్.. మార్పులు, చేర్పులతో మూడో జాబితా మరికొన్ని గంటల్లో వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే తొలి రెండు జాబితాల్లో 40మందిని మార్చేసిన వైసీపీ.. మూడో జాబితాలో మరి కొంతమందిని మార్చనుందిచ.

Another group of people in YCP? Tension over the release of the list today
వైసీపీలో ఇంకెవరికి సీటు గండం పొంచి ఉంది..? ఎవరి చీటీ చిరగబోతోంది..? వైసీపీ ఎమ్మెల్యేల్లో ప్రస్తుతం ఇదే టెన్షన్.. మార్పులు, చేర్పులతో మూడో జాబితా మరికొన్ని గంటల్లో వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే తొలి రెండు జాబితాల్లో 40మందిని మార్చేసిన వైసీపీ.. మూడో జాబితాలో మరి కొంతమందిని మార్చనుందిచ. ఈ జాబితాలో ఏడు ఎంపీ సీట్లలో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. కొందరిని ఎంపీలుగా పంపుతారని తెలుస్తోంది. పాతిక నుంచి 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మార్పులు చేస్తారని సమాచారం.
వైసీపీ ఎమ్మెల్యేల మార్పులు, చేర్పుల్లో భాగంగా మూడో లిస్ట్ రెడీ అయింది. 175 సీట్లు గెలుస్తామన్న ధీమాతో ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ సిట్టింగ్స్ ని మార్చేస్తున్నారు. ఇప్పటికే 2 జాబితాలు రిలీజ్ అయ్యాయి. మూడో లిస్ట్ ప్రిపరేషన్ కోసం.. గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యులు, ఎంపీలను పిలిచి మాట్లాడారు. కొందరికి తాడేపల్లి నుంచి ఫోన్ కాల్స్ వచ్చినా.. వెళ్ళడానికి నిరాకరిస్తున్నారు. దాంతో వైసీపీ జిల్లాలో ఇంఛార్జులు, సీనియర్ లీడర్లు.. వాళ్ళని బతిమలాడి జగన్ దగ్గరకు తీసుకెళ్తున్నారు. కొందరు లీడర్లు ముఖ్యమంత్రి జగన్ తీరుపై మండిపడుతున్నారు.
గూడురు ఎమ్మెల్యే వరప్రసాద్‌కు టిక్కెట్ డౌటే.. నందికొట్కూరుపైనా క్లారిటీ రాలేదు.. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథిని పిలిచి మాట్లాడినా ఆయకు సీటుపై స్పష్టత ఇవ్వలేదు. తిరువూరు నుంచి రక్షణనిధిని తప్పించినట్లేనని సమాచారం. మార్కాపురం నుంచి జంకా వెంకటరెడ్డికి టికెట్ గ్యారెంటీ అంటున్నారు. గిద్దలూరులో ఎవరు పోటీ అన్నది కూడా మూడో జాబితాతోనే తేలనుంది. మంత్రి గుమ్మనూరు జయరాంకు ఆలూరు నుంచి సీటు డౌటే. పెందుర్తిలో మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు సీటు దాదాపు కన్ఫర్మ్ అయ్యింది. చింతలపూడిలో ఎలీజాకు మరోసారి ఛాన్స్ లేదని పార్టీ ఇప్పటికే చెప్పేసింది. ప్రకాశం జిల్లాలో మరో రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మారుస్తారు. శింగనమల, రాయదుర్గం, కోడుమూరు, మదనపల్లె, పూతలపట్టులో కూడా సమన్వయకర్తలను మార్చనున్నట్లు సమాచారం.
విజయనగరం ఎంపీగా ఉన్న బెల్లాని చంద్రశేఖర్‌కు ఈసారి టికెట్ డౌటే అని తెలుస్తోంది. చిన్నశీనును విజయనగరం నుంచి బరిలోకి దింపుతారని సమాచారం. విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు.. బొత్స ఝాన్సీ విశాఖ నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. అనకాపల్లి, అమలాపురం సిట్టింగ్‌ల స్థానంలో కొత్తవారికి అవకాశం ఇస్తారంటున్నారు. ఏలూరు ఎంపీగా ఉన్న కోటగిరి శ్రీధర్ మరోసారి పోటీకి ఆసక్తి చూపడం లేదు. దీంతో అక్కడ ఎవరికి ఛాన్స్ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. నర్సాపురం ఎంపీ రఘురామ ఎప్పట్నుంచో పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇక్కడ ఎవరు పోటీ చేస్తారన్నది కూడా మూడో జాబితాలోనే తేలే అవకాశాలున్నాయి. ఇక నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులను గుంటూరు నుంచి పోటీ చేయాలని పార్టీ హైకమాండ్ చెప్పింది. ఆయన మాత్రం నర్సరావుపేట నుంచే పోటీ అంటున్నారు. ఇప్పుడు అక్కడ నుంచి నాగార్జునయాదవ్ పేరును పార్టీ పరిశీలిస్తోంది. దీంతో శ్రీకృష్ణదేవరాయులు ఏం చేస్తారన్నది ఆసక్తిని రేపుతోంది. మరోవైపు ఒంగోలులో ప్రస్తుత ఎంపీ మాగుంటకు ఎట్టకేలకు పార్టీ హైకమాండ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.