బెట్టింగ్ యాప్‌కు మరో ప్రాణం బలి…!
క్రికెట్ బెట్టింగ్ మరో ప్రాణం తీసింది. బెట్టింగ్ వేసిన డబ్బ పోయిందన్న బాధతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌడవెల్లిలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు మరోసారి బెట్టింగ్ యాప్స్‌తో ఉన్న ప్రమాదాన్ని తెర మీదకు తెచ్చింది.

క్రికెట్ బెట్టింగ్ మరో ప్రాణం తీసింది. బెట్టింగ్ వేసిన డబ్బ పోయిందన్న బాధతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌడవెల్లిలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు మరోసారి బెట్టింగ్ యాప్స్‌తో ఉన్న ప్రమాదాన్ని తెర మీదకు తెచ్చింది. గుండ్ల పోచంపల్లికి చెందిన సోమేశ్ అనే 29 ఏళ్ల యువకుడు ఓ బెట్టింగ్ యాప్‌లో క్రికెట్ బెట్టింగ్ ఆడాడు.
బెట్టింగ్‌కు బాగా అలవాటు పడి ఏకంగా రెండు లక్షలు పోగొట్టుకున్నాడు. అంత మొత్తంలో డబ్బు పోవడంతో మనో వేదనకు గురైన సోమేష్ ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. చెట్టంత కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో సోమేష్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
కొంత కాలంగా ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. అందుకే ఈ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలను పోలీసులు టార్గెట్ చేసి వాళ్ల మీద కేసులు పెడుతున్నారు. రీసెంట్‌గానే ఈ యాప్స్ నిర్వహిస్తున్న 19 మందిపై కేసులు నమోదు చేశారు. బెట్టింగ్ వ్యవహారంపై ఓ వైపు పోలీసులు కఠిక చర్యలు తీసుకుంటున్న సమయంలో ఇలా మరో యువకుడు బెట్టింగ్ భూతానికి బలి కావడం ఇప్పుడు సంచలనంగా మారింది.