Dr. Sunita Reddy : జగన్ కి మరో షాక్.. కాంగ్రెస్ లోకి సునీత
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వైసీపీ (YCP) చీఫ్, సీఎం జగన్ కు మరో చెల్లెలు షాక్ ఇవ్వబోతోంది. జగన్ సోదరి, వైయస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత రెడ్డి (Sunita Reddy) ప్రత్యక్ష రాజకీయాలు అడుగుపెడుతున్నారు. ఆమె త్వరలో కాంగ్రెస్ లో చేరబోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వైసీపీ (YCP) చీఫ్, సీఎం జగన్ కు మరో చెల్లెలు షాక్ ఇవ్వబోతోంది. జగన్ సోదరి, వైయస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత రెడ్డి (Sunita Reddy) ప్రత్యక్ష రాజకీయాలు అడుగుపెడుతున్నారు. ఆమె త్వరలో కాంగ్రెస్ లో చేరబోతున్నారు. షర్మిల పీసీసీ అధ్యక్షురాలుగా ఏపీలో చక్రం తిప్పబోతున్న సమయంలో సునీత కూడా కాంగ్రెస్ లో జాయిన్ అవ్వాలనుకోవడం రాజకీవర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తరువాత ఆమె కుమార్తె సునీతా రెడ్డి యాక్టివ్ అయ్యారు. వివేకా హత్యకేసులో సీబీఐ విచారణకు కీలకమైన సమాచారం ఇచ్చారు. అంతేకాదు.. కోర్టుల్లో కేసుల్లో కూడా సునీత ఇంప్లీడ్ అయ్యారు. తన తండ్రిని చంపినవారికి శిక్ష పడాలని న్యాయపోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ఏపీలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి సునీత అడుగుపెట్టబోతున్నారు. వైఎస్ జగన్ కు అపోజిట్ గా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఇప్పటికే సోదరి షర్మిల ఏపీ పీసీసీ పగ్గాలు చేపట్టడంతో.. తాను కూడా ఆపార్టీలోనే జాయిన్ అవ్వాలని సునీత నిర్ణయించారు. అంతేకాదు పార్టీ ఆదేశిస్తే కడప ఎంపీ లేదా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని సునీత నిర్ణయించుకున్నట్లు సమాచారం. అంటే కడప ఎంపీ అవినాష్ రెడ్డిని గాని, లేదా సీఎం జగన్ మోహన్ రెడ్డిని సునీత నేరుగా ఢీ కొట్టబోతున్నారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య తర్వాత జగన్ కు డాక్టర్ సునీత మధ్య విభేదాలు వచ్చాయి. వైయస్ వివేక హత్యపై జగన్ కు, ఆయన భార్య భారతికి ముందే సమాచారం ఉందనీ.. ఎంపీ అవినాష్ రెడ్డి హస్తం ఉందని సునీత మొదటి నుంచి వాదిస్తున్నారు.
తన తండ్రి కేసు విచారణలో ఆలస్యంపై సునీతారెడ్డి సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడారు. ఈ విషయంలో ఎంత ఒత్తిడి తెచ్చినా ఆమె వెనక్కి తగ్గలేదు. ఈ హత్య అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి చేయించారనేది సునీత వాదన. ఎంపీ సీటుకు వివేక అడ్డు రాకుండా 2019 ఎన్నికల ముందే హత్య చేశారనేది సునీత కుటుంబ సభ్యుల వాదన. వివేక హత్య తర్వాత రెండు కుటుంబాలు విడిపోయాయి. వివేకా హత్య.. జగన్ ని కూడా రాజకీయంగా ఇరకాటంలో పెట్టింది. ఆయనపై ఏపీలో వ్యతిరేకత పెరగడానికి బాబాయ్ హత్య కూడా ఒక కారణం. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని టీడీపీ, జనసేన పార్టీలు వివేకా హత్యపై ప్రచారం చేశారు. మరోవైపు వైసీపీ నాయకులు కూడా.. సునీత భర్త రాజశేఖర్ రెడ్డి ఈ హత్య వెనక ఉన్నారంటూ ఆస్తి కోసమే కుటుంబ సభ్యులే చంపేశారంటూ ప్రచారం చేశారు. అంతేకాదు అందుకు మరో భార్య ఉన్నారనే ప్రచారం కూడా జరిగింది. సునీత వెనుక చంద్రబాబు ఈ కథ మొత్తం నడిపిస్తున్నారనేది వైసీపీ నాయకుల వాదన. సుప్రీంకోర్టు వరకు సునీత వెళ్లగలిగారంటే చంద్రబాబు ఆమెకు అన్ని రకాల న్యాయ సలహాలు ఇప్పించారనేది వాళ్ల ఆరోపణ.
ఈ వివాదాల మధ్యలో సునీత ఇప్పుడు తన భవిష్యత్తును పొలిటికల్ బరిలోనే తేల్చుకోవాలని నిర్ణయించారు. షర్మిల కు జగన్ కు మధ్య విభేదాలు తీవ్రతరం అవ్వడంతో అక్కా, చెల్లెలు షర్మిల-సునీత మరింత దగ్గర అయ్యారు. ఇప్పుడు షర్మిల ఏపీ PCCకి అధ్యక్షురాలు. ఇప్పటికే సునీత-షర్మిల మధ్య చర్చలు కూడా ముగిశాయి. రేపో మాపో సునీత కాంగ్రెస్ లో చేరడం.. ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నికల వేళ జగన్ కు బయటి పోరు కంటే ఇంటి పోరే ఎక్కువైంది. తల్లి విజయమ్మ, సొంత చెల్లెలు షర్మిల, చిన్నాన్న కూతురు సునీత వీళ్ళందరూ
జగన్ కు టీడీపీ కంటే ఎక్కువ శత్రువులుగా మారారు. కడప జిల్లా రాజకీయాల్లో జగన్ చెల్లెల్ళు షర్మిల-సునీత తప్పకుండా ప్రభావం చూపించే అవకాశాలున్నాయి.