Politics: వైసీపీ లీడర్స్ కి ఆఫర్లే ఆఫర్లట.. ఈ విషయం ముందే ఎందుకు బయట పెట్టలేదో?
ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడు ఆఫర్స్ సీజన్ నడుస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికలు ఎంత సంచలన సృష్టించాయో ఆ తర్వాత వరుసగా జరుగుతున్న సంఘటనలు అంతే సంచలనం సృష్టిస్తున్నాయి. నాకు ఆఫర్ వచ్చిందని ఓ ఎమ్మెల్యే చెప్తే నాకు కూడా వచ్చిందని మరో ఎమ్మెల్యే ఇప్పుడు బయట పెడుతున్నారు. ఇలా రోజుకొకరు బయటికి వస్తున్నారు. రాపాక వరప్రసాద్ ,మద్దాలి గిరి , ఆర్డర్ ఇంకా ఎంతమంది ఉన్నారు ?ఇంకా ఎంతమందికి ఫోన్ల వచ్చాయో మరి?...ఒక్కో ఎమ్మెల్యే ఒక్కో రోజు బయటకు వచ్చి నాకు ఫోన్ వచింది.. నన్ను అడిగారు.. నాకు కోట్లు ఆఫర్ చేశారని అంటున్నారు. ఇందులో నిజం ఎంతో అబద్ధం ఎంతో ఆఫర్ చేసిన వాళ్ళైనా చెప్పాలి .లేదా ప్రభుత్వం అయినా దర్యాఫ్తు చేసి తేల్చాలి.
గమ్మత్తు ఏంటంటే మాకు ఆఫర్ వచ్చిందని చెప్తున్న ఎమ్మెల్యేలు రాపాక వరప్రసాద్ , మద్దాలి గిరి , ఆర్డర్ ఎవరు కూడా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి ఇప్పటివరకు తీసుకువెళ్లలేదు.పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు. కేవలం ప్రెస్ మీట్ లు పెట్టి మాత్రమే చెప్తున్నారు. రాపాక వరప్రసాద్ అయితే ఏకంగా తనకు టిడిపి ఎమ్మెల్యే టికెట్ ,10 కోట్లు ఆఫర్ చేశారని చెప్పారు. మద్దాలి గిరి అయితే క్రాస్ వోట్ కోసమే ఫోన్ చేశారని అది తెలిసి తాను ఫోన్ లిఫ్ట్ చేయలేదని అంటున్నారు.
ఇక ఆర్థరైయితే తన కొడుకు తోటి టీడీపీ వాళ్ళు సంప్రదించారని అలాగే తన గన్ మాన్ కి కూడా ఫోను చేసి తనను కలవడానికి ప్రయత్నించారని అదే విషయాన్ని శ్రీశైలం ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి ఎదుటే ఫోన్ స్పీకర్లో పెట్టి మరి మాట్లాడానని చెప్తున్నారు. ఇదంతా సరే. వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎందుకు ఈ ఆఫర్ల వ్యవహారాన్ని లెవనెత్తారన్నది ప్రశ్న. బలం లేకపోయినా టిడిపి పోటీ కి దిగింది. అప్పుడే అధికార పార్టీ కి అనుమానం వచ్చి ఎమ్మెల్యేలపై నిఘా పెట్టింది. సీఎం జగన్మోహన్ రెడ్డి దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు .
ఏడు ఎమ్మెల్సీలకు ఏడు వైసిపి ఖాతాలోనే పడాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఒక పక్క అధిష్టానం ఎంత టెన్షన్ గా ఉంటే ..ఉగాది రోజే అందర్నీ విజయవాడ రప్పించి కూర్చో బెడితే, ఈ ఆఫర్లు వచ్చిన ఎమ్మెల్యేలు అప్పుడే ఆ విషయాన్ని ప్రభుత్వ పెద్దలు ,పార్టీ పెద్దలు దృష్టికి ఎందుకు తీసుకువెళ్ళలేదు? అంతా అయిపోయిన తర్వాత మాకు ఆఫర్ వచ్చిందంటే ..మాకు ఆఫర్ వచ్చిందంటూ..ఇప్పుడు బయట పెట్టడం, మీడియా సమావేశాల్లో చెప్పడం ఏమిటో ఎవరికి అర్థం కావట్లేదు.
2017లో హైదరాబాదులో జరిగిన ఓటుకు నోటు కేస్ అందరికీ గుర్తుంది.అప్పడు టిడిపిలో ఉన్న రేవంత్ రెడ్డి పార్టీ అభ్యర్థికి ఓటు కోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ ని సంప్రదించారు.నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ ఈ విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు .పార్టీ పెద్దలు వెంటనే రంగంలోకి దిగి ఏసీబీ ని రంగంలోకి దించారు .సీసీ కెమెరాలు పెట్టారు . సింగ్ కెమెరాల్లో రికార్డ్ చేశారు.రెడ్ హండ్రెడ్ గా రేవంత్ ని పట్టుకున్నారు. ఒక ఎమ్మెల్యే ని ప్రలోభ పెట్టాలి అని చూస్తే ఆ ఎమ్మెల్యే దానికి ఎలా రియాక్ట్ అవుతారు ..పార్టీ దృష్టికి ఎలా తీసుకువెళ్తారు తర్వాత పర్యవసానాలు ఎలా ఉంటాయనేది తెలంగాణ ఓటుకు నోటు కేసు లో అందరూ చూసారు.
ఇప్పుడు కూడా తమను ప్రలోభ పెట్టారని చెబుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు రాపాక, మద్దాల గిరి, అర్థర్ ఈ విషయాలేవీ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్ళలేదు . పార్టీ పెద్దల కి ముందే చెప్పి ఉంటే రెడ్ హండెడ్ గా పట్టుకునే వాళ్లుగా.అది చేయ కుండా ఇప్పుడు ఈ హడావుడి ఏమిటి? వైసీపీ లో వీళ్ళేనా ఇంకా ఎవరినైన టీడీపీ వాళ్ళు ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించారా అన్నది కూడా చూడాలి. నిజానికి ఇప్పుడు బయటకు వచ్చి ప్రలోభాలు గురించి చెప్తున్న ఎమ్మెల్యేలు ముగ్గురు వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమే. అందుకే పార్టీ కోసం త్యాగం చేశామని బిల్డప్ ఇచ్చి టికెట్ మళ్ళీ సంపాదించడానికా.? సీఎం జగన్ దృష్టి లో పడడానికో ఇలాంటి పిల్లి మొగ్గలు వేస్తున్నారనే అనుమానాలు కూడా వస్తున్నాయి.