సర్వే రాళ్ళ దొంగ దొరికాడా…?

ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వ అవినీతి వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ చేసింది. తాజాగా మరో స్కాం ను బయటకు లాగే ప్రయత్నం చేస్తోంది. ఏపీలో భూముల సర్వే పేరిట జరిపిన సర్వే రాళ్ల కొనుగోళ్లలో జరిగిన భారీ అక్రమాలపై ఏసీబీ విచారణ వేగవంతం అయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 28, 2024 | 09:25 PMLast Updated on: Oct 28, 2024 | 9:25 PM

Ap Acb Fasten Enquiry Against Jagananna Bhoo Hakku

ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వ అవినీతి వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ చేసింది. తాజాగా మరో స్కాం ను బయటకు లాగే ప్రయత్నం చేస్తోంది. ఏపీలో భూముల సర్వే పేరిట జరిపిన సర్వే రాళ్ల కొనుగోళ్లలో జరిగిన భారీ అక్రమాలపై ఏసీబీ విచారణ వేగవంతం అయింది. ఇందులోనూ గనుల శాఖ మాజీ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి పాత్ర ఉందన్న ఫిర్యాదులు వస్తున్నాయి. రాళ్ల కొనుగోలుకు రెవెన్యూ, సర్వే శాఖల నుంచి నిధుల విడుదలపై స్పష్టత రాకముందే ఏపీఎండీసీ నుంచి రూ.470 కోట్ల చెల్లింపులు చేసారు.

ఇందుకు ప్రభుత్వ అనుమతి, ఆమోదం లేకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. రాళ్ల కొనుగోళ్లలో భారీగా ముడుపులు కూడా పొందారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏసీబీ ఉన్నతాధికారి నేతృత్వంలోని బృందం తాజాగా ఏపీఎండీసీ ఎండీ, గనుల శాఖ డైరెక్టర్ కార్యాలయాలలో సోదాలు నిర్వహించారు అధికారులు. రెవెన్యూ శాఖ చేపట్టిన భూముల సర్వే కోసం కొనుగోలు చేసిన సర్వే రాళ్లకు సంబంధించి నడిపిన ఫైళ్లు, చేసిన చెల్లింపులు, సర్వేశాఖ ఇచ్చిన ఇండెంట్, ఏయే ఏజెన్సీల నుంచి ఎంతమేర రాయి కొన్నారో తెలిపే ఫైళ్ల వివరాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసారు.

ముఖ్యంగా సర్వే రాళ్ల కొనుగోలుపై 15 అంశాల్లో నిర్దిష్ట సమాచారం కోరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏసీబీ ఇసుక అక్రమాలపైనా విచారణ వేగవంతం చేసింది. కీలకమైన ఫైళ్లను స్వాధీనం చేసుకుని ఇప్పటికే వెంకటరెడ్డిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ రిమాండ్లో వెంకటరెడ్డి ని మరోసారి విచారణ చేసే అవకాశం ఉందని సమాచారం. సర్వే రాళ్ల కేసులో వెంకటరెడ్డి పై ఎఫ్ఆర్ నమోదు చేసిన ఎసిబి… ఆయనను విచారించి కీలక నేతల పేర్లను బయటకు లాగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

నేడు జరిగిన విచారణలో రూ.520 కోట్ల చైనా మిషన్ల కొనుగోలు టెండర్ల పై రికార్డులను పరిశీలించారు. అప్పట్లో జిఎం (కాంట్రాక్ట్స్)గా పనిచేసిన విశాఖ స్టీల్ ప్లాంట్ అధికారి ఎస్వీఎస్ బోస్ ఎపిఎండిసిలో విచారణకు హాజరు అయ్యారు. మరో ఇద్దరు మైనింగ్ అధికారులకూ నోటీసులు జారీ చేసారు. ఎసిబి ఎదుట హాజరైన గనుల శాఖ కీలక అధికారులు… ఏం చెప్పారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇదే అధికారులపై గత ప్రభుత్వమే సర్వే స్టోన్స్ అక్రమాలపై విజిలెన్స్ కు విచారణకు ఆదేశించింది.

అదే ప్రభుత్వం వెంటనే గనుల‌శాఖ అధికారులు ఉత్తములు అంటూ తీర్పు ఇవ్వడం ఆశ్చర్యం కలిగించింది. దీనిపై ఎసిబి అధికారుల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎండి వెంకటరెడ్డి బినామీ సంస్థ ధన్వంతరి కి నిబంధనలకు విరుద్దంగా వందల కోట్ల విలువైన కాంట్రాక్టు కట్టబెట్టేందుకు పిలిచిన టెండర్లపై ఎసిబి అధికారులు ప్రశ్నించారు. అయితే వెంకట రెడ్డిని గతంలో విచారించినప్పుడు కొందరు నాయకుల పేర్లు చెప్పారని వార్తలు వచ్చాయి. దానికి సంబంధించిన ఆధారాలు మాత్రం అధికారులకు లభ్యం కాలేదని తెలిసింది.