విశాల్ గున్నీ సస్పెండ్ జీవోలో ఏముంది, హీరోయిన్ కేసులో ఆయన పాత్ర ఇదే

ముంబై బాలీవుడ్ హీరోయిన్ కాదంబరి జత్వాని కేసులో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఈ కేసులో ముగ్గురు ఐపిఎస్ లను చంద్రబాబు సస్పెండ్ చేసారు. ఈ మేరకు మూడు జీవోలు విడుదల చేసారు. డీ ఐ జీ విశాల్ గున్నీని సస్పెండ్ చేస్తూ జీవో నెంబర్ 1592ను విడుదల చేసింది ప్రభుత్వం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 15, 2024 | 07:54 PMLast Updated on: Sep 15, 2024 | 7:54 PM

Ap Cadre Ips Officer Vishal Gunni Suspend Suspend

ముంబై బాలీవుడ్ హీరోయిన్ కాదంబరి జత్వాని కేసులో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఈ కేసులో ముగ్గురు ఐపిఎస్ లను చంద్రబాబు సస్పెండ్ చేసారు. ఈ మేరకు మూడు జీవోలు విడుదల చేసారు. డీ ఐ జీ విశాల్ గున్నీని సస్పెండ్ చేస్తూ జీవో నెంబర్ 1592ను విడుదల చేసింది ప్రభుత్వం. సస్పెన్షన్ కు ప్రభుత్వం మెన్షన్ చేసిన కారణాలు ఒకసారి పరిశీలిస్తే…

విజయవాడ కమిషనరేట్ లో డిసిపి గా ఉన్న సమయంలో విశాల్ గున్ని జత్వానీ అరెస్టు కు ముందు సరైన విచారణ జరపలేదని స్పష్టంగా పేర్కొంది. 31.01.2024న అప్పటి ఇంటెలిజెన్స్ డైరెక్ జనరల్ ఆఫ్ పోలీస్ పీ ఎస్ ఆర్ ఆంజనేయులును కలిసి, ఆయన మౌఖిక సూచనల మేరకు 02.02.2024న ముంబయికి వెళ్లి అరెస్టులు చేశారని తెలిపింది ప్రభుత్వం.

ఎఫ్‌ఐఆర్ 02.02.2024 ఉదయం 6:30 గంటలకు నమోదు కాగా అంతకుముందే ముంబై వెళ్లిన విశాల్ గున్ని 02.02.2024 న ఎలాంటి ముందస్తు పాస్‌పోర్ట్ లేకుండానే ముంబైకి వెళ్లారని జీవోలో వెల్లడించారు. కేసు నమోదుకంటే ముందే అరెస్టు గురించి ప్రణాళిక వేయడం వెనుక ఉద్దేశాలు వేరేలా కనిపిస్తున్నాయని… అరెస్టయిన వారికి సరైన వివరణ ఇవ్వడానికి అవకాశం ఇవ్వడంలో గున్నీ విఫలమయ్యాడని ప్రభుత్వం పేర్కొంది. విశాల్ తో పాటుగా పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రానా టాటాను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.