CID Chief Sanjay: చంద్రబాబు ప్రోద్బలంతోనే స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం: ఏపీ సీఐడీ ఛీఫ్ సంజయ్
ఈ కేసు విచారణలో 30 నుంచి 38 మంది వరకు నిందితులుగా తేలారు. విచారణ జరిగే కొద్దీ.. మాజీ సీఎం చంద్రబాబు ప్రోద్భలంతోనే ఇదంతా జరిగిందని తేలింది. ఏ37, ఏ38గా ఉన్న వారిని ఏ1గా ఎలా పెడతారని కొందరు ప్రశ్నిస్తున్నారు.
CID Chief Sanjay: కేబినెట్ అఫ్రూవల్ తీసుకోని ఏర్పాటు చేయాల్సిన స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను, మంత్రివర్గానికి తెలియకుండానే ఏర్పాటు చేశారని తెలిపారు ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్. నిబంధనల్ని పక్కనబెట్టి, ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు సంజయ్ చెప్పారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంపై చంద్రబాబును సీఐడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై సంజయ్ మీడియాతో మాట్లాడారు. “నిబంధనలకు విరుద్ధంగా స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ఈ కార్పొరేషన్ నుంచి కొంత డబ్బు ప్రైవేటు వ్యక్తుల చేతికి, అక్కడ్నుంచి కొన్ని కంపెనీలు, సంస్థలకు మళ్లింది. ఈ కంపెనీల నుంచి ఫేక్ ఇన్‍వాయిస్‍లుగా మారి హవాలా రూపంలో వెళ్లింది. ఈ కేసులో సీమెన్స్, డిజైన్ టెక్ కంపెనీ ప్రతినిధులు నిందితులుగా ఉన్నారు.
ఈ కేసు విచారణలో 30 నుంచి 38 మంది వరకు నిందితులుగా తేలారు. విచారణ జరిగే కొద్దీ.. మాజీ సీఎం చంద్రబాబు ప్రోద్భలంతోనే ఇదంతా జరిగిందని తేలింది. ఏ37, ఏ38గా ఉన్న వారిని ఏ1గా ఎలా పెడతారని కొందరు ప్రశ్నిస్తున్నారు. దీనికి ముఖ్యకారణం.. నిబంధనల ప్రకారం కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోవడం. అలాగే విద్యాశాఖ సెక్రటరీ, SDIEEకి హెడ్‍గా, ఎక్స్ అఫిషియో సెక్రటరీ టూ సీఎం అనే మూడు పదవులు గంటా సుబ్బారావు అనే ప్రవేట్ వ్యక్తికి ఇవ్వడమే. వీటితోపాటు టీడీపీకి ఎన్నో సంవత్సరాలు సేవ చేసిన జే.వెంకటేశ్వర్లు అనే ఛార్టెడ్ అకౌంటెంట్‍ని పెట్టడంతోనే చేర్చాం. చంద్రబాబు ప్రోద్భలం లేకుండా ఇవన్ని జరగవు. జీవోలు, ఆదేశాల్లో 13 చోట్ల చంద్రబాబు పేరు ఉంది. ఆర్థిక శాఖ నిధుల విడుదల నోట్‍తో పాటు 13 చోట్ల చంద్రబాబు పేరు ఉంది. బడ్జెట్ అనుమతిపై కూడా చంద్రబాబు సంతకం ఉంది. సిమెన్స్ సంస్థతో 90 శాతం, 10 శాతం సిస్టమ్ అఫ్ ఫండింగ్ అని జీవోలో పేర్కొన్నారు. కానీ ఈ విషయాన్ని అగ్రిమెంట్‍లో పేర్కొనలేదు. జీవోను పూర్తిగా తుంగలో తొక్కి ఏర్పాటు చేసుకున్న అగ్రిమెంట్‌ను అమలు చేశారు. ఈ విషయాన్ని సిమెన్స్ కంపెనీ వాళ్లే పేర్కొంటున్నారు. జర్మనీలో ఉన్న ఒరిజినల్ సిమెన్స్ ఏజీ కంపెనీ భారత్‍లో సిమెన్స్ ఇండియా అని ఒక సాఫ్ట్‌వేర్ ఉన్నమాట నిజమే.
కానీ సిమెన్స్ కంపెనీగా మేము కేవలం రూ.58.8 కోట్లు మాత్రమే తీసుకున్నామని క్లారిఫికేషన్ ఇచ్చారు. సాఫ్ట్‌వేర్ ఖర్చుపోగా మిగిలిన నిధులు దుర్వినియోగమయ్యాయి. సాఫ్ట్‌వేర్‌కు రూ.2,500 కోట్లు ఖర్చయిందని ఖాతాల్లో రాశారు. మిగిలిన రూ.313 కోట్లలో ఎటువంటి ఆధారం లేకుండా రూ.241 కోట్లు షెల్ కంపెనీకి మళ్లించారు. వీటిని 20 నుంచి 30 వరకు చిన్న షెల్ కంపెనీలకు తరలించారు. ఇందులో కొందరు ప్రైవేట్ వ్యక్తుల ప్రమేయం ఉంది. ఇలాంటివే గుజరాత్‍తో పాటు ఇతర రాష్ట్రాల్లో 85-15 శాతం ప్రకారం అగ్రిమెంట్లు జరిగాయి. కానీ అక్కడ ఒప్పందం ప్రకారం గ్రౌండ్ లెవల్లో ఎక్విప్‍మెంట్ ల్యాండ్ అయ్యింది. రూ.313 కోట్లలో రూ.241 కోట్లు ఒక షెల్ కంపెనీకి వెళ్లాయి. 6 చోట్ల క్లస్టర్లు పెట్టాలనుకున్నారు. కానీ ఎక్కడా పెట్టలేదు. స్కిల్ సెంటర్లు ఎక్కడ పెట్టాలని తేల్చక ముందే ప్రభుత్వ డబ్బు చేతులు మారింది. ఈడీ.. ఇప్పటివరకు రూ.32 కోట్లు అటాచ్ చేసింది. డిజైన్‌టెక్ ఎండీ ఖన్వేల్కర్ 2 నెలలు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. సీమెన్స్ కంపెనీ ట్రైనింగ్ మాడ్యుల్ డిస్కౌంట్ ఇస్తామనే చెప్పారు. కానీ, ఎక్కడా కూడా గ్రాంట్ ఇన్ ఎయిడ్ పెడతామని చెప్పలేదు” అని సీఐడీ ఛీఫ్ సంజయ్ వెల్లడించారు.