AP CM JAGAN: జగన్ కళ్ళు తెరువు ! ఏపీ మాహిష్మతి మునిగిపోయే టైమ్ వచ్చింది !!
కళ్ళ ఎదురుగా కెసిఆర్ స్వప్న లోకం కూలిపోయింది. తెలంగాణకి ఎప్పటికీ తానే సీఎం అని ఊహించుకున్న కెసిఆర్ కలలన్నీ చెదిరిపోయాయి. ఎన్నికలకు ముందు కేటీఆర్ మాటలు వింటే ..వాళ్ళ ఆత్మ విశ్వాసానికి చెయ్యెత్తి జై కొట్టాలనిపించేది. అలాంటి కెసిఆర్ కుటుంబం తెలంగాణ ఓటర్ దెబ్బకి కకావికలం అయిపోయింది. దీనికి ప్రధాన కారణం జనం కెసిఆర్ అహంకారానికి వ్యతిరేకంగా ఓటు వేయడమే. తెలంగాణలో అస్సలు అభివృద్ధి జరగలేదని ఎవ్వరూ చెప్పలేరు. సంక్షేమ పథకాలు అమలు కాలేదని అనలేరు. ఇంత చేసినా చివరికి జనం లీడర్ల వ్యవహార శైలినీ సీరియస్ గా తీసుకున్నారు. కెసిఆర్ అహంకారానికి వ్యతిరేకంగా, ఎమ్మెల్యేలు అవినీతి, దాదాగిరికి నిరసనగా కాంగ్రెస్ కు ఓటేసి టిఆర్ఎస్ ని ఇంటికి పంపించేశారు.
కళ్ళ ఎదురుగా కెసిఆర్ స్వప్న లోకం కూలిపోయింది. తెలంగాణకి ఎప్పటికీ తానే సీఎం అని ఊహించుకున్న కెసిఆర్ కలలన్నీ చెదిరిపోయాయి. ఎన్నికలకు ముందు కేటీఆర్ మాటలు వింటే ..వాళ్ళ ఆత్మ విశ్వాసానికి చెయ్యెత్తి జై కొట్టాలనిపించేది. అలాంటి కెసిఆర్ కుటుంబం తెలంగాణ ఓటర్ దెబ్బకి కకావికలం అయిపోయింది. దీనికి ప్రధాన కారణం జనం కెసిఆర్ అహంకారానికి వ్యతిరేకంగా ఓటు వేయడమే. తెలంగాణలో అస్సలు అభివృద్ధి జరగలేదని ఎవ్వరూ చెప్పలేరు. సంక్షేమ పథకాలు అమలు కాలేదని అనలేరు. ఇంత చేసినా చివరికి జనం లీడర్ల వ్యవహార శైలినీ సీరియస్ గా తీసుకున్నారు. కెసిఆర్ అహంకారానికి వ్యతిరేకంగా, ఎమ్మెల్యేలు అవినీతి, దాదాగిరికి నిరసనగా కాంగ్రెస్ కు ఓటేసి టిఆర్ఎస్ ని ఇంటికి పంపించేశారు.
ఇప్పుడు అదే సీన్ పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోనూ రిపీట్ కాబోతుంది . జగన్ దృష్టి పెట్టాల్సింది దీనిపైనే. ఇండియాలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వనన్ని సంక్షేమ పథకాలను, డబ్బుని నేరుగా జనాలకు అందించారు జగన్. కానీ జనం అవన్నీ గుర్తుపెట్టుకుంటారా లేక జగన్ సర్కార్ అహంకార ధోరణి మాత్రమే పరిగణలోకి తీసుకుంటారా అన్నది ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న. అందుకే జగన్ కళ్ళు తెరవాల్సిన సమయం ఆసన్నమైంది. నాలుగున్నర యేళ్ళుగా రకరకాల వివాదాలు, కేసులు, అర్థంపర్థం లేని పాలసీలు, ఎమ్మెల్యేల అవినీతి, ఇసుక దోపిడీ, లోకల్ లిక్కర్, జగన్ వ్యతిరేక మీడియా ఇవన్నీ కలబోసుకుని వైసీపీ సర్కార్ కు జనం నుంచి రెడ్ అలర్ట్ జారీ అవ్వబోతుంది. నాలుగున్నర యేళ్ళుగా ఏపీలో జనానికి లక్షల కోట్ల రూపాయలు వివిధ పథకాల ద్వారా పంచడం తప్ప మరింకేమీ జరగలేదు.
ఒక కొత్త కాలేజీ లేదా ఇనిస్టిట్యూషన్ పెట్టడం గానీ… ఓ రెండు లక్షలు మందికి క్వాలిటేటివ్ ఎంప్లాయిమెంట్ ఇవ్వడం గానీ, నాలుగు రోడ్లు వేసాం అని, ఓ పది పరిశ్రమలు పెట్టి సంపద సృష్టించామని గాని ఏది జరగలేదు. బటన్ నొక్కడం, డబ్బులు ఇవ్వడం…. ఇది మాత్రం పద్ధతిగా జరిగింది. డబ్బు తీసుకున్న జనం ఇప్పుడు జగన్ కి ఓటు వేస్తారా లేదా ? ఇదే ఈ రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న చర్చ. కేవలం డబ్బులు మాత్రమే చూసి.. ఇంకా ఏ అభివృద్ధి అక్కర్లేదు… డబ్బులు ఇస్తే చాలు….అని జనం అనుకుంటే జగన్ మళ్ళీ గెలుస్తాడు. కానీ ముఖ్యమంత్రి అహంకార ధోరణి, ఎమ్మెల్యేల అవినీతి, రాష్ట్రంలో ఏమాత్రం అభివృద్ధి జరగకపోవడం వీటిని కనుక సీరియస్ గా తీసుకుంటే జగన్ ఇంటికి వెళ్లి పోవాల్సిందే. మూడు రాజధానులు పేరిట నాలుగేళ్లుగా జగన్ సర్కారు చేస్తున్న యాగి జనానికి ఒక రకమైన అసహ్యాన్ని పుట్టించింది. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్లు మాట తీరు అసహ్యకరమైన ప్రేలాపనలు, బూతులు ఇవన్నీ కూడా జనంలో జగన్ పై యావగింపుని కలిగించాయి. ఎవరు ఎన్ని చెప్పినా… నేను పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్లు అనే రకంగా జగన్ తీసుకున్న అనేక వివాదాస్పద నిర్ణయాలు…. మధ్యతరగతి, ఆ పైమధ్యతరగతి వాళ్లకు వైయస్సార్సీపి సర్కార్ పై వ్యతిరేకతను మిగిల్చాయి. ఉద్యోగుల్లో కూడా జగన్ సర్కార్ పై కావలసినంత వ్యతిరేకత ఉంది. 72 ఏళ్ళు చంద్రబాబుని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్టు చేయడం… ఎక్కడ ఏది స్పష్టమైన ఆధారాలు చూపించలేకపోవడంతో జనంలో బాబుపై కొంత సానుభూతి తెచ్చింది.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే…. నాలుగున్నరేళ్ళుగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన బలమైన మీడియా జగన్ కి పక్కలో బల్లెంలా తయారయింది. ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి రోజు జగన్ సర్కార్ చేసే తప్పులను వెతికి వెతికి మరీ… వెంటాడి జనంలో కావల్సినంద వ్యతిరేకత తీసుకురాగలిగింది. వీటన్నిటికీ తోడు ఎమ్మెల్యేలు అవినీతి, అక్రమార్జన, రౌడీయిజం ఇవన్నీ జగన్ సర్కారుపై జనంలో కావలసినంత వ్యతిరేకతని తెచ్చాయి. కనీసం 40 చోట్ల ఎమ్మెల్యేలను మార్చకపోతే వచ్చే ఎన్నికల్లో పార్టీ అడ్రస్ ఉండదని సర్వే రిపోర్టులు చెబుతున్నాయి. కళ్ళు తెరవకపోతే….. పార్టీ రిపేర్ వర్క్ త్వరగా ప్రారంభించక పోతే…. చేసిన తప్పుల్ని గుర్తించి తక్షణ పరిష్కారాల్ని వెతకకపోతే పోతే వచ్చే ఎన్నికల్లో పుట్టి మునిగిపోవడం గ్యారంటీ. అవతల వైపు ఎంత వ్యతిరేకతున్నా జగన్ నమ్ముకున్నది డబ్బులు తీసుకున్న జనాన్ని మాత్రమే. అంతేకాదు క్రిస్టియన్లు, ముస్లింలు, ఎస్సీలు… ఎస్టీలు వీళ్లంతా తనకు 100% ఓటేస్తారని జగన్ నమ్మకంతో ఉన్నారు. డబ్బులు ఇచ్చే గవర్నమెంట్ ని జనం వదులుకుంటారా అని వైసిపి నేతలు ధీమాతో ఉన్నారు. ఇప్పుడు సంక్షేమ పథకాలు, డబ్బులు అన్ని పార్టీలు ఇస్తామంటున్నాయ్. కానీ సమాజంలో నిత్యం అశాంతిని, ఒక అన్ రెస్ట్ నీ పబ్లిక్ భరించలేరు. అందుకే జగన్ సర్కార్ ని తిరస్కరించే అవకాశం లేకపోలేదు. జగన్ కి ఉన్నది ఒక్క మూడు నెలల సమయం మాత్రమే.