Ramoji – Jagan: రామోజీని వెంటాడుతున్న జగన్.. ఆరునూరైనా రామోజీని వదిలిపెట్టే చాన్స్ లేదా?
చంద్రబాబు ఈనాడు సంస్థను అడ్డుపెట్టుకొని.. తనను పొలిటికల్‌గా టార్గెట్ చేస్తున్నారన్న ఫీలింగ్‌లో ఉన్న జగన్.. చాన్స్ దొరికిన ప్రతీసారి రామోజీని లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. వైసీపీకి వ్యతిరేకంగా కావాలని రాతలు రాస్తూ.. జనాల్లో పార్టీని పలుచన చేసే ప్రయత్నాలు చేస్తున్నారని.. అసెంబ్లీ సాక్షిగా జగన్ ఈనాడు పత్రిక మీద గతంలో ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఆర్థిక స్తంభాలను ఒక్కొక్కటిగా పెకిలించి వేయడమే జగన్ టార్గెట్‌గా పెట్టుకున్నారు.
ఈనాడు (Eenadu) సంస్థల చైర్మన్ రామోజీరావుకు (Ramoji Rao).. ఏపీ సీఎం జగన్ (CM Jagan) చుక్కలు చూపిస్తున్నారు. ఇద్దరి మధ్య భారీ రాజకీయ పోరు నడుస్తోంది. చంద్రబాబు (Chandrababu) ఈనాడు సంస్థను అడ్డుపెట్టుకొని.. తనను పొలిటికల్‌గా టార్గెట్ చేస్తున్నారన్న ఫీలింగ్‌లో ఉన్న జగన్.. చాన్స్ దొరికిన ప్రతీసారి రామోజీని లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. వైసీపీకి (YSRCP) వ్యతిరేకంగా కావాలని రాతలు రాస్తూ.. జనాల్లో పార్టీని పలుచన చేసే ప్రయత్నాలు చేస్తున్నారని.. అసెంబ్లీ సాక్షిగా జగన్ ఈనాడు పత్రిక మీద గతంలో ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఆర్థిక స్తంభాలను ఒక్కొక్కటిగా పెకిలించి వేయడమే జగన్ టార్గెట్‌గా పెట్టుకున్నారు. పరిపాలన లేదు.. గోంగూర కట్ట లేదు.. ఇది కాదు ముఖ్యం.. శత్రువర్గాన్ని నిర్మూలించడమే ముఖ్యం అన్నట్లుగా జగన్ అడుగులు వేస్తున్నారు.
అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఇలాంటి లక్ష్యంతోనే కనిపించారనే ఆరోపణలు కూడా ఉన్నాయ్ జగన్ మీద ! ఈ వేటలో భాగంగానే మార్గదర్శి చిట్‌ఫండ్స్ (Margadarsi Chit Funds) లోపాలను తవ్వుతున్నారని.. రామోజీ, ఆయన కోడలు శైలజ (Sailaja Kiran) విచారణ అందులో భాగమే అనే చర్చ జరుగుతోంది. నిజానికి గత కొన్నేళ్లుగా చంద్రబాబు చుట్టూ రాజకీయంగా ఉచ్చు బిగించేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారన్న అభిప్రాయాలు ఉన్నాయ్. అందులో ఇప్పుడు రామోజీ చిక్కుకున్నారని.. ఇది ఇప్పటితే తేలే వ్యవహారం కాదు అన్నది మెజారిటీ వర్గాల ఒపీనియన్.
మార్గదర్శి విషయంలో ఏపీ సీఐడీ (AP CID) అధికారులు.. ప్రభుత్వ పెద్దల సూచనలతో అడుగులు వేగంగా వేస్తున్నారు. ఇప్పటికే మార్గదర్శి సంస్థ మీద కేసులు నమోదు చేశారు. సంస్థ ఎండీ శైలజా కిరణ్‌ను ప్రశ్నించారు. రామోజీరావును కూడా విచారించారు. ఏ విషయాలు అడిగారు.. ఎలాంటివి ఆరా తీశారన్నది ప్రస్తుతానికి వివరాలు లేకపోయినా.. ఈనాడును జగన్ టార్గెట్ చేశారన్నది మాత్రం ఓపెన్ సీక్రెట్. ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసుల వ్యవహారంలో వివరణ ఇవ్వాలని.. గతవారం రామోజీరావుకు, శైలజకు నోటీసులు జారీ చేశారు. చిట్‌ఫండ్ చట్టానికి వ్యతిరేకంగా డిపాజిటర్ల సొమ్మును ఇతర సంస్థల్లోకి మళ్లించడం… అక్రమంగా డిపాజిట్లు సేకరించడం వంటి వ్యవహారాలపై సీఐడీ ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. చందాదారుల సొమ్మును మ్యూచువల్ ఫండ్స్‌లో, మార్కెట్‌లో ఎందుకు పెట్టుబడులుగా పెట్టారు… ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనలకు విరుద్ధమని తెలియదా… ఖాతాదారుల సొమ్మును డిపాజిట్లుగా సేకరించడం ఎంతవరకు కరెక్ట్ అనే విషయాలపై సీఐడీ అధికారులు ప్రధానంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ వ్యవహారంలో నలుగురు మార్గదర్శి ఉద్యోగులను సీఐడీ అరెస్ట్ చేసింది. మార్గదర్శి వ్యవహారం ఇప్పట్లో తేలడం కష్టమే ! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా వైఎస్ఆర్ (YS Rajasekhar Reddy) ఉన్నప్పుడు కూడా మార్గదర్శిని టార్గెట్ చేశారు. ఐతే ఈ స్థాయిలో ఒత్తిడి లేదు. మార్గదర్శి విషయంలో కాస్త సాఫ్ట్‌గా ఉండాలని అప్పట్లో కాంగ్రెస్ పెద్దల నుంచి సూచనలు వచ్చేవి. దీంతో వైఎస్ఆర్ కూల్ అయ్యేవారు. ఇప్పుడు జగన్‌ను అలా కంట్రోల్ చేసే వాళ్లు లేరు. దీంతో ఆరు నూరైనా రామోజీని వదిలిపెట్టే అవకాశం లేదు అనేది మెజారిటీ జనాల అభిప్రాయం.