ఢిల్లీలో పవన్ బిజీ బిజీ
ఢిల్లీలో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బిజీ బిజీగా గడుపుతున్నారు. కాసేపటి క్రితం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ తో భేటీ కానున్నారు పవన్.

ఢిల్లీలో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బిజీ బిజీగా గడుపుతున్నారు. కాసేపటి క్రితం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ తో భేటీ కానున్నారు పవన్. మధ్యాహ్నం 1 గంటలకు కేంద్ర జలశక్తి మంత్రితో భేటీ అనంతరం మధ్యాహ్నం 3:15 కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అవుతారు పవన్. సాయంత్రం 4:30కి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ కానున్నారు.
సాయంత్రం 5:15 పంచాయితీ రాజ్ శాఖ మంత్రి లలన్ సింగ్ తో భేటీ అయి పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. రేపు పార్లమెంట్ లో ప్రధాని మోడీతో పవన్ భేటీ అవుతారు. అనంతరం తిరిగి ఆంధ్రప్రదేశ్ వచ్చి… అక్కడి నుంచి మళ్ళీ మహారాష్ట్ర వెళ్ళే అవకాశం ఉంది. త్వరలోనే మహారాష్ట్ర సిఎం ప్రమాణ స్వీకర కార్యక్రమం జరగనుంది. ఆ కార్యక్రమానికి పవన్ హాజరు అవుతారు.