డిప్యూటి సీఎం చాలదా…? సీఎం అవ్వాలా…? ఫ్యాన్స్ పై పవన్ ఫైర్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర కామెంట్స్ చేసారు. శుక్రవారం పార్వతీపురం జిల్లాలోని గిరిజిన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన పవన్ ను చూసి అభిమానులు ఓజీ ఓజీ... సీఎం సీఎం అంటూ నినాదాలు చేయగా దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్... చిరు కోపం ప్రదర్శించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 20, 2024 | 07:57 PMLast Updated on: Dec 20, 2024 | 7:57 PM

Ap Deputy Cm Pawan Kalyan Made Interesting Comments

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర కామెంట్స్ చేసారు. శుక్రవారం పార్వతీపురం జిల్లాలోని గిరిజిన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన పవన్ ను చూసి అభిమానులు ఓజీ ఓజీ… సీఎం సీఎం అంటూ నినాదాలు చేయగా దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్… చిరు కోపం ప్రదర్శించారు. కొంచెం మందలిస్తున్న ధోరణిలో మాట్లాడిన ఆయన నన్ను పని చేసుకోనివ్వండి. కనీసం రోడ్డు కూడా కనిపించనంతగా నా మీద పడిపోయారని అసహనం వ్యక్తం చేసారు. మీకందరికీ దణ్ణం పెడతాను… రోడ్డు చూడనివ్వండి నన్ను అని చెప్పాల్సి వచ్చిందన్నారు.

ఓజీ ఓజీ ఓజీ అంటూ అరుస్తున్నారు… లేకపోతే, ఇంతకుముందు సీఎం సీఎం అనేవాళ్లు… అదింకా పోలేదు… నేను డిప్యూటీ సీఎం అయినా గానీ వాళ్లకు ఆనందం కలగడంలేదన్నారు. అందరికీ నేను చెప్పేది ఒక్కటే… నేను వచ్చినప్పుడు అందరూ నన్ను చుట్టుముడితే పనులు జరగవన్నారు పవన్. నన్ను పనిచేయనివ్వండని అభిమానులను కోరారు. ఉత్తరాంధ్ర… ప్రజలకు తెలుగు వాడుక భాష నేర్పించిన నేల ఇది, తిరుగుబాటు నేర్పించిన నేల ఇది, ఎవరైనా దోపిడీ చేస్తుంటే ఎదురు తిరిగే నేల ఇది అన్నారు పవన్.

కానీ ఇవాళ మీరు సినిమాల మోజులో పడి… ఓజీ ఓజీ అని పోస్టర్లు పెట్టి, జేజేలు కొడితే జీవితంలో ముందుకు వెళ్లలేరని మాట్లాడితే చాలు… అన్నా మీసం తిప్పు, మీసం తిప్పు అంటారని… నేను మీసం తిప్పితే రోడ్ల నిర్మాణం జరుగుతుందా? నేను ఛాతీ గుద్దుకుంటే రోడ్లు పడతాయా? అని ప్రశ్నించారు. నేను వెళ్లి ప్రధానమంత్రి గారికి దణ్ణం పెట్టి, సమస్యను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళితే రోడ్లు పడతాయన్నారు పవన్. అందుకే, మీసాలు తిప్పడాలు, ఛాతీలు కొట్టుకోవడాలు నాకు చేతకావు… నాకు పనిచేయడమే తెలుసన్నారు.