మోడీ కలను జగన్ చంపేసాడు: పవన్
జలజీవన్ మిషన్ ప్రధాని మోదీ కల అన్నారు ఏపీ డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రతీ ఇంటికి ప్రతీరోజు 20 లీటర్ల నీరు ఇవ్వాలి అనే ఉద్దేశమన్నారు. ప్రజలకు కూడా నీటి వినియోగం పై శిక్షణ ఇవ్వాలన్నది ఉద్దేశమని తెలిపారు.
జలజీవన్ మిషన్ ప్రధాని మోదీ కల అన్నారు ఏపీ డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రతీ ఇంటికి ప్రతీరోజు 20 లీటర్ల నీరు ఇవ్వాలి అనే ఉద్దేశమన్నారు. ప్రజలకు కూడా నీటి వినియోగం పై శిక్షణ ఇవ్వాలన్నది ఉద్దేశమని తెలిపారు. నీటి వినియోగంలో ఐటీ వినియోగం కూడా ఇందులో భాగమన్నారు ఆయన. అమృతధార అనే పేరుతో ఇది మనం చేస్తున్నామని తెలిపారు. నీరు దొరకనప్పుడే నీటి విలువ తెలుస్తుందన్నారు. పొలిటికల్ గా ఆకాశాన్ని తీసుకొచ్చి పందిరేస్తామని ప్రామిస్ చేస్తామని… భీష్మ ఏకాదశి రోజున నీరు తాగకుండా ఉంటే ఎలా ఉంటుందో.. నీరు దొరక్కపోతే అలా ఉంటుందన్నారు.
కేంద్రం రిజర్వాయర్ల నుంచీ నీటిని ఇవ్వాలని అంటే.. కేంద్ర నిబంధనలకు విరుద్ధంగా గత ప్రభుత్వం చేసిందని మండిపడ్డారు. 38 రిజర్వాయర్లు ఉన్నాయి మనకు… వాటి నుంచీ సరఫరా ఉండాలన్నారు. బోర్ పాయింట్ల పేరుతో గత ప్రభుత్వం లో 4వేల కోట్లు దుర్వినియోగం అయ్యాయని ఆయన ఆరోపించారు. డబ్బులు ఖర్చు పెడుతున్నా ఫలితాలు రావడం లేదన్నారు. అవసరమైన చోట టెక్నాలజీని చేర్చడం జరుగుతుందని తెలిపారు. ఫిల్టర్ బెడ్ లను కూడా చాలా చోట్ల మార్చలేదని మండిపడ్డారు.
క్షేత్రస్ధాయిలో సలహాలు సూచనలు అధికారులు ఇవ్వాలన్నారు. ఇవాళ సాయంత్రానికి ఈ జలజీవన్ మిషన్ కు ఒక స్ధిరమైన సాధన సహకారాలు కావాలని జనవరి నెలాఖరుకు పూర్తి డీపీఆర్ తో కేంద్ర జలశక్తి మంత్రిని కలుస్తున్నామన్నారు. జలజీవన్ మిషన్ లో బోర్ వెల్స్ ను వాడటంవల్ల ఉపయోగం లేకుండా పోయిందని ఆయన మండిపడ్డారు. జిల్లాల వారీగా జలజీవన్ మిషన్ అమలులో ఉన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే తెలుసుకోవాలనే ఈ వర్క్ షాప్ నిర్వహించామన్నారు. మానవతా దృక్పధంతో జలజీవన్ మిషన్ అమలు కావాలన్నారు పవన్. ఈ మిషన్ లో పైప్ లైన్ డిజైనింగ్ లో లోపాలున్నాయని నీళ్ళొస్తుంటే మధ్యలో మోటార్లు వేసి లాగేయకుండా చూడాలని వ్యాఖ్యానించారు.