నువ్వు చెప్తే షిప్ సీజ్ చేయాలా ? పవన్‌కు షాకిచ్చిన కస్టమ్స్
ఏపీ డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కస్టమ్స్ అధికారులు షాక్ ఇచ్చారు. రీసెంట్‌గా విశాఖ పోర్ట్‌లో ఓ షిప్ సీజ్ చేయాలంటూ పవన్ ఇచ్చిన ఆదేశాలు సాధ్యం కాదంటూ చెప్పారు. రీసెంట్ డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విశాఖ పోర్టులో తనికీలు చేపట్టారు.
ఏపీ డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కస్టమ్స్ అధికారులు షాక్ ఇచ్చారు. రీసెంట్‌గా విశాఖ పోర్ట్‌లో ఓ షిప్ సీజ్ చేయాలంటూ పవన్ ఇచ్చిన ఆదేశాలు సాధ్యం కాదంటూ చెప్పారు. రీసెంట్ డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విశాఖ పోర్టులో తనికీలు చేపట్టారు. అక్రమంగా తరలిస్తున్న 650 టన్నలు పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించారు. కంటైనర్‌లో బియ్యాన్ని చూడగానే డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవేశంతో ఊగిపోయారు. ఇష్టారాజ్యంగా ఇలా ఎలా స్మగ్లింగ్ చేస్తున్నారంటూ అధికారులకు మీద నిప్పులు చెరిగారు.
కంటైనర్‌లో ఏముందో చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని క్లాస్ పీకారు. కంటైనర్‌లో కసబ్ వచ్చినా ఇలానే సిటీలోకి అనుమతిస్తారా అంటూ ప్రశ్నించారు. వెంటనే షిప్‌ను సీజ్ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి ఉన్నా తాను చూసుకుంటానంటూ చెప్పారు. కానీ పవన్ చెప్పినట్టు ఈ షిప్‌ను సీజ్ చేయడం అంత ఈజీ కాదని కస్టమ్స్ అధికారులు అంటున్నారు. నిషేధిత వస్తువులు, డ్రగ్స్, ఆయుధాలు లాంటి స్మగ్లింగ్ చేసినప్పుడు మాత్రమే షిప్‌ను సీజ్ చేసే అధికారం తమకు ఉంటుందంటూ చెప్పారు. పీడీఎస్ బియ్యం నిషేధిత వస్తువుల జాబితాలో లేకపోవడంతో షిప్‌ను తాము సీజ్ చేయలేమంటూ చేతులెత్తేశారు. హైకోర్టుకు మాత్రమే ఈ షిప్‌ను సీజ్ చేసే అధికారం ఉందంటూ చెప్పారు. మరి ఈ వ్యవహారాన్ని కోర్టులో ప్రభుత్వం ఎలా టాకిల్ చేస్తుందో చూడాలి.