AP ELECTIONS: ఇవీ వీళ్ల ఆస్తులు.. బాలయ్యకు ఇల్లు లేదు.. చంద్రబాబుకు కారు లేదు
నామినేషన్ ప్రక్రియలో భాగంగా తమకు ఉన్న ఆస్తులు, అప్పుల వివరాలను ఎలక్షన్ కమిషన్‌కు వివరించారు. ఈ క్రమంలో కొందరు నేతలకు సొంత ఇళ్లు లేకపోవడం మంత్రులుగా చేసినవాళ్లకు కూడా కార్లు లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
AP ELECTIONS: ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదలవ్వడంతో ఏపీలో కొందరు నాయకులు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ ప్రక్రియలో భాగంగా తమకు ఉన్న ఆస్తులు, అప్పుల వివరాలను ఎలక్షన్ కమిషన్‌కు వివరించారు. ఈ క్రమంలో కొందరు నేతలకు సొంత ఇళ్లు లేకపోవడం మంత్రులుగా చేసినవాళ్లకు కూడా కార్లు లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. నామినేషన్ ప్రక్రియలో భాగంగా చంద్రబాబు తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. ఆ అఫిడవిట్ ప్రకారం చంద్రబాబు దగ్గర కేవలం 11 వేల 560 రూపాయలు మాత్రమే నగదు ఉందట. ఆయన భార్య భువనేశ్వరి దగ్గర 28 వేల 822 మాత్రమే ఉన్నాయట.
YS JAGAN: కుటుంబ కథా చిత్రం.. విజయమ్మను కూడా జగన్ లైట్ తీసుకున్నారా..!
ఇక చంద్రబాబు చరాస్తుల విలువ 4 లక్షల 80 వేల 438 కాగా.. భువనేశ్వరి చరాస్తుల విలువ 810 కోట్ల 37 లక్షల 08 వేల 883 రూపాయలు. చంద్రబాబు స్థిరాస్తుల విలువ 36 కోట్ల 31 లక్షల 481 కాగా భువనేశ్వరి స్థిరాస్తులు 85 కోట్ల 10 లక్షల 41 వేల 128 ఉన్నాయట. ఇక తనకు 3 కోట్ల 48లక్షల 81 వేల 937 రూపాయల అప్పులు ఉన్నట్టు చెప్పారు చంద్రబాబు. భువనేశ్వరికి కూడా 6 కోట్ల 83 లక్షల 19 వేల 895 రూపాయల అప్పులు ఉన్నాయట. ఇక తనపై మొత్త 24 పెండింగ్ కేసులు ఉన్నట్టు అఫిడవిట్‌లో చెప్పారు చంద్రబాబు. బాలకృష్ణ కూడా హిందూపురం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. బాలకృష్ణ ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం ఆయన దగ్గర ప్రస్తుతం 9 లక్షల 35 వేల 987 రూపాయలు మాత్రమే ఉన్నాయట. ఆయన భార్య వసుంధర దగ్గర 8 లక్షల 90 వేల 80 రూపాయలు ఉన్నాయట. ఇక బాలకృష్ణకు ఓవరాల్‌గా 81 కోట్ల 63 లక్షలు విలువ చేసే ఆస్తులు ఉన్నాయట. వసుంధరకు 140 కోట్ల 38 లక్షల 83 వేల విలువ చేసే ఆస్తులు ఉన్నాయట. బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞకు 58 కోట్ల 63 లక్షల 66 వేల ఆస్తులు ఉన్నట్టు అఫిడవిట్‌లో చెప్పారు. ఇక తనకు 9 కోట్ల 9 లక్షల 22 వేల అప్పులు ఉన్నాయని చెప్పారు బాలకృష్ణ.
తన భార్యకు 3 కోట్ల 83 లక్షల 98 వేల అప్పులు ఉన్నాయంటూ అఫిడవిట్‌లో వివరించారు. కడప ఎంపీగా పోటీ చేస్తున్న వైఎస్ అవినాష్ రెడ్డి కూడా నామినేషన్ వేశారు. ఆయన అఫిడవిట్ ప్రకారం అవినాష్‌కు 10 కోట్ల 61 లక్షల విలువ చేసే స్థిరాస్తులు ఉన్నాయట. కోటీ 92 లక్షలు విలువ చేసే చరాస్తులు ఉన్నాయట. ఇక ప్రస్తుతం తన దగ్గర 14 లక్ష 36 వేల 200 నగదు ఉన్నట్టు చెప్పారు అవినాష్ రెడ్డి. ఇక తన భార్య సమతకు 94 లక్షలు విలువ చేసే స్థిరాస్తులు ఉన్నట్టు చెప్పారు. దాంతో పాటు 5 కోట్ల 31 లక్షలు విలువ చేసే చరాస్తులు కూడా ఉన్నాయని చెప్పారు. సమత దగ్గర ప్రస్తుతం 8 లక్షల 06 వేల 500 రూపాయల నగదు ఉందట. ఇక తనపై రెండు క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అఫిడవిట్‌లో మెన్షన్ చేశారు అవినాష్ రెడ్డి. ఇక నగరి నుంచి మాజీ మంత్రి రోజా కూడా తన నామినేషన్ దాఖలు చేశారు. రోజా అఫిడవిట్ ప్రకారం. ఆమె దగ్గర ప్రస్తుతం 50 వేల 229 రూపాయల నగదు మాత్రమే ఉందట. రోజా భర్త సెల్వమణి దగ్గర 50 వేల నగదు ఉందట. రోజాకు 4 కోట్ల 58 లక్షల 43 వేల 501 రూపాయలు విలువ చేసే చరాస్తులు ఉన్నాయట. సెల్వమణికి 96 లక్షల 90 వేల 804 రూపాయలు విలువ చేసే చరాస్తులు ఉన్నాయట.
రోజా కూతురు అన్షు మాలికకు 24 లక్షల 53 వేల 730 రూపాయలు విలువ చేసే చరాస్తులు, కొడుకు కృష్ణ కౌశిక్ 14 లక్షల 85 వేల 308 రూపాయలు విలువ చేసే చరాస్తులు ఉన్నాయట. ఇక తనకు 6 కోట్ల 5 లక్షల 71 వేల 529 రూపాయల విలువ చేసే స్థిరాస్తులు కూడా ఉన్నాయని చెప్పారు రోజా. తన భర్త సెల్వమణికి కోటీ 11 లక్షల 9 వేల 358 రూపాయల విలువ చేసే స్థిరాస్తులు ఉన్నాయట. అన్షు మాలికకు 27 లక్షల 54 వేల 400 రూపాయలు విలువ చేసే స్థిరాస్తులు, కృష్ణ కౌశిక్‌కు 49 లక్షల 87 వేల 75 రూపాయలు విలువ చేసే స్థిరాస్తులు ఉన్నాయంటూ ఎన్నికల అఫిడవిట్‌లో చెప్పారు రోజా. గతంలో ముఖ్యమంత్రులుగా మంత్రులుగా ఎమ్మెల్యే ఎంపీలుగా పని చేసిన వీళ్లకు ఇంత తక్కువ ఆస్తులు ఉండటం, సొంత కార్లు కూడా కొందరికి లేకోవడం ప్రతీ ఒక్కరినీ ఆశ్చర్యాన్ని గురి చేస్తోంది.