అబ్బాయ్ సినిమాకు బాబాయ్ గుడ్ న్యూస్
గేమ్ చేంజర్, డాకూ మహరాజ్ సినిమాల టికెట్ ధరల పెంపుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదనపు షోల కు సంబంధించి వివరణ మెమో జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.
గేమ్ చేంజర్, డాకూ మహరాజ్ సినిమాల టికెట్ ధరల పెంపుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదనపు షోల కు సంబంధించి వివరణ మెమో జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సినిమా టికెట్ ధరల పెంపు, అదనపు షోల పై హైకోర్టు తీర్పు ఆధారంగా మెమో విడుదల చేసింది. ఈ నెల 4 తేదీన ఇచ్చిన మెమో కేవలం టికెట్ ధరలకు సంబంధించింది మాత్రమేనని స్పష్టం చేస్తూ మెమో జారీ చేసారు.
సరైన పోలీసు భద్రత లేకుండా థియేటర్లకు వచ్చే జనాన్ని నియంత్రించటం కష్టమని మధ్యంతర ఉత్తర్వుల్లో హైకోర్ట్ పేర్కొంది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు అర్ధరాత్రి 1 గంట, తెల్లవారు ఝాము 4 గంటలకు అదనపు షోల కు అనుమతి నిరాకరించారు. ఉత్తర్వుల ప్రకారం 10 రోజుల పాటు రోజుకు 5 షోలకు మించకుండా ప్రదర్శించుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. ఐదు ప్రదర్శనల్లోనే ఒకటి బెనిఫిట్ షోగా నిర్వహించుకోవచ్చన్నారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, నగర పోలీసు కమిషనర్లకు ఆదేశాలు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం.