మొన్న వంశీ.. నిన్న కొడాలి.. ఇక రోజా వంతు.. అరెస్ట్ గ్యారంటీ!
ఏపీలో ప్రభుత్వం మారింది. రాజకీయం మారింది. అధికారం అడ్డుపెట్టుకొని.. గత ప్రభుత్వంలో నేతలు చేసిన దందాలు.. ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయ్. దీనిపై చంద్రబాబు సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టింది.
ఏపీలో ప్రభుత్వం మారింది. రాజకీయం మారింది. అధికారం అడ్డుపెట్టుకొని.. గత ప్రభుత్వంలో నేతలు చేసిన దందాలు.. ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయ్. దీనిపై చంద్రబాబు సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈవీఎం పగలగొట్టిన కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఇప్పటికే జైల్లో ఉన్నారు. టీడీపీ ఆఫీస్‌పై దాడి చేసిన కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదైంది. తమ చేత బలవంతంగా రాజీనామా చేయించారని వాలంటీర్లు ఇచ్చిన ఫిర్యాదుతో గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన కేసులో… మాజీ మంత్రి జోగి రమేష్‌ను అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం అవుతోంది. ఇప్పుడు వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా వంతు వచ్చినట్టు కనిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా, సీఎం కప్, ఇతర క్రీడా కార్యక్రమాల్లో… నిధుల గోల్‌మాల్‌పై చంద్రబాబు సర్కార్ ఫోకస్ పెట్టింది. దీనిలోభాగంగా సీఐడీకి వివిధ క్రీడా సంఘాలు, సీనియర్ క్రీడాకారులు చేసిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్దమైంది. క్రీడలకు సంబంధించిన నిధులు దుర్వినియోగం చేశారని… ఓ సంస్థ సీఈవో సీఐడీకి ఫిర్యాదు చేశారు.
అప్పటి క్రీడలశాఖ మంత్రి రోజా.. ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అప్పటి అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సీఐడీ.. ఈ ఫిర్యాదుపై తదుపరి చర్యలు తీసుకోవాలని విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌ను ఆదేశించారు. ఇదే జరిగితే.. రోజా, కృష్ణదాస్ విచారణకు సిద్ధం కావాల్సి ఉంటుంది. ఆడుదాం ఆంధ్ర వ్యవహారంపై విచారణ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రస్తుత క్రీడలశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి చెప్పారు. ఇలాంటి పరిస్థితుల మధ్య త్వరలోనే దర్యాప్తు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇదే జరిగితే రోజా అరెస్ట్ గ్యారంటీ అనే చర్చ జరుగుతోంది.