నువ్వు రెచ్చిపో..! ఏమైనా ఐతే నేను చూసుకుంటా..!
మేడం గారి కంటే పిఏ గారిది ఎక్కువ హవా.. మంత్రి గారిని ఎవరు కలవాలి.. ఎప్పుడు కలవాలి.. ఎక్కడ కలవాలి.. ఎవరెంత కమిషన్ తీసుకురావాలి.. ఇలా ఎన్నో విషయాల్లో అసలు మంత్రిగారి ప్రమేయం లేకుండానే పిఏ గారి డామినేషన్ ఉంటుంది.
మేడం గారి కంటే పిఏ గారిది ఎక్కువ హవా.. మంత్రి గారిని ఎవరు కలవాలి.. ఎప్పుడు కలవాలి.. ఎక్కడ కలవాలి.. ఎవరెంత కమిషన్ తీసుకురావాలి.. ఇలా ఎన్నో విషయాల్లో అసలు మంత్రిగారి ప్రమేయం లేకుండానే పిఏ గారి డామినేషన్ ఉంటుంది. అది సొంత పార్టీ కార్యకర్తలు అయినా లేదంటే వ్యాపారులైన ఎవరైనా సరే పిఏ గారి మాట వినాల్సిందే. లేదంటే లైసెన్స్ కట్ మరీ ఎక్కువ చేస్తే కేసులు. ప్రభుత్వం మనదే అనే ధీమా.. మంత్రిగారి ఇంట్లో మనిషిని అనే పొగరు.. ఇలా ఒక పిఏ గారు చేయని చండాలం లేదు.
ఎందుకు ఆ పిఏ గారు ఎవరో మీకు ఇప్పటికే క్లారిటీ వచ్చే ఉంటుంది. ఆయనే ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత పిఏ సందు జగదీష్. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే ఆయన వంగలపూడి అనిత పదేళ్ల క్రితం.. జగదీష్ అనే వ్యక్తిని పిఎగా నియమించుకున్నారు. ఆ తర్వాత పార్టీ ఓడిపోయినా… టిడిపి మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఆయననే పిఏగా కొనసాగించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మంత్రి అయిన తర్వాత కూడా అతనికే పీఏ బాధ్యతలు అప్పగించారు.
వాస్తవానికి పిఎ జగదీష్ కుటుంభ సభ్యులను తన కుటుంబ సభ్యులుగా చూస్తూ ఉంటారు అనిత. దీని వెనుక కారణం వేరే ఉంది.. తన భర్తతో దూరంగా ఉంటున్న మంత్రి అనిత.. తన పిల్లల విషయంలో సమయం కేటాయించలేక పిఏ జగదీష్ ను అతని భార్యను తన ఇంట్లో మనుషులుగా చూసుకుంటూ వచ్చారు. మంత్రి గతంలో ఎక్కడికైనా పర్యటనలకు వెళ్లినా.. ఏదైనా సభలు సమావేశాలు ఉన్నసరే… పిల్లల బాధ్యతను జగదీష్ అలాగే అతని భార్య చూసుకునేవారు. అనిత షెడ్యూల్ సహా అనేక విషయాలను జగదీష్ చూసుకుంటే పిల్లల బాధ్యతను అతని భార్య చక్కబెట్టేవారు.
పిల్లల విషయంలో జగదీష్ భార్య చాలా జాగ్రత్తగా ఉండటంతో అతనిని పక్కన పెట్టేందుకు ఆసక్తి చూపించలేదు అనిత. గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే కొంతమంది నియోజకవర్గ కార్యకర్తలు ఆమెకు ఫిర్యాదులు చేసిన కుటుంభ కారణాలతోనే జగదీష్ ను పక్కన పెట్టేందుకు ఆసక్తి చూపించలేదు. ఇక అలుసు కనిపెట్టిన జగదీష్ మంత్రి గారి పేరు చెప్పి దందాలు చేయడం మొదలుపెట్టాడు. హోం మంత్రి పీఏ కావడంతో పోలీసు అధికారులు కూడా అతనికి గట్టిగానే వెయిట్ ఇచ్చారు.
ఇక పాయకరావుపేట నియోజకవర్గంలో పెత్తనం మొత్తం జగదీష్ చూసుకుంటాడు. నియోజకవర్గంలో కాంట్రాక్ట్ అయినా.. మద్యం షాపులు అయినా ఏ వ్యవహారంలో అయినా సరే పీఏ గారి జోక్యం ఉండాల్సిందే. ప్రతి విషయంలో అధికారులకు కూడా సలహాలిస్తూ.. మంత్రిగారి కంటే ఎక్కువ హడావుడి చేశాడు. ఈ విషయాలన్నీ హోం మంత్రి అనితకు తెలిసినా ఏమీ చేయలేక ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్నారు. ఇప్పటికే మంత్రి గారి వ్యవహారం ప్రభుత్వ పెద్దల వరకు వెళ్ళింది.
దీనితో ప్రభుత్వ పెద్దలు కూడా గత కొన్నాళ్లుగా జగదీష్ వ్యవహారాలపై ఫోకస్ పెట్టారు. పేకాట శిబిరాల దగ్గర నుంచి మొదలుపెట్టి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు వరకు బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూలు చేస్తున్నాడని గుర్తించారు. దానికి తోడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నాయకులను తప్పుడు కేసుల్లో ఇరికించిన ఘనత కూడా జగదీష్ కు దక్కుతుంది. అలాగే టిటిడి సిఫారసు లేఖలను కూడా అమ్మేశారని ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగుల బదిలీల్లో జోక్యం చేసుకుని లక్షలు కూడ పెట్టాడని టిడిపి కార్యకర్తలే ఆరోపణలు చేస్తూ ఉంటారు.
ఇక బెదిరింపులో జగదీష్ స్టైల్ వేరే ఉంటుంది. లెక్కలేనితనంగా ఉంటూ ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ తన డామినేషన్ చూపిస్తూ ఉంటాడు. నియోజకవర్గంలో పేకాట శిబిరాలను కనుసైగలతో శాసిస్తూ ఉంటాడు జగదీష్. ఇక ఇది మరింత పెద్దది కావడం ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉండటంతో ప్రభుత్వ పెద్దలు జాగ్రత్తలు తీసుకున్నారు. వెంటనే జగదీష్ ను ఆ బాధ్యతల నుంచి పక్కన పెట్టారు. ఇదే సందర్భంగా హోం మంత్రి అనితకు కూడా ప్రభుత్వ పెద్దలనుంచి వార్నింగ్ వెళ్ళింది. ఇన్నాళ్ల నుంచి వ్యవహారం జరుగుతుంటే అతన్ని పక్కన పెట్టాల్సింది పోయి వ్యక్తిగత విషయాలు తో ఎందుకు ప్రోత్సహించారని మంత్రి పై సీరియస్ అయ్యారట.