Ambati Vs Pawan : అంబటి గారూ.. అంత కాలిందా..? పవన్‌పై సినిమా తీస్తారా…!?
బ్రో సినిమాలో పవన్ తనను పోలిన శ్యాంబాబు పాత్రను పెట్టారని అంబటికి ముందుగా చెప్పిందెవరో తెలుసా... ఆయన కుమార్తె. అమెరికాలో ఉన్న ఆమె మొదటిరోజే బ్రో సినిమాను చూశారు. ఆమె కూడా పవన్ ఫ్యాన్ అనుకుంటా...!

ఏపీ మంత్రి అంబటి రాంబాబు రగిలిపోతున్నారు. బ్రో మూవీలో శ్యాంబాబు పాత్ర పెట్టినందుకే ఆయన మండిపడుతుంటే పవన్ ఫ్యాన్స్ చేస్తున్న ట్రోలింగ్ ఇంకా ఇరిటేట్ చేస్తోంది. అందుకే పవన్‌పై సినిమా తీస్తా అంటూ చిందులు తొక్కుతున్నారు అంబటి.
బ్రో సినిమా సక్సెస్ మాట పక్కన పెడితే శ్యాంబాబు క్యారెక్టర్ మాత్రం ఓ రేంజ్‌లో పేలింది. తనను ఉద్దేశించే ఆ పాత్ర పెట్టారని తెలిసినా అంబటి దాన్ని లైట్ తీసుకున్నారు. పవన్‌పై నాలుగు మాటలు వదిలి ఊరుకున్నారు. కానీ ఆ తర్వాత జరుగుతున్న ట్రోలింగ్ , మీడియాలో దాన్ని పదేపదే చూసి జనం నవ్వుకుంటుండటంతో మంత్రికి మండిపోతోంది. అందుకే పవన్‌పై ఓ రేంజ్‌లో ఫైరైపోయారు. దీనికి తోడు అంబటి ఎవరో తెలియదని కామెంట్ చేసి 30ఇయర్స్ పృథ్వీ తన కసినంతా తీర్చుకున్నారు.
ఆ కోపంతోనే మీడియా ముందుకొచ్చిన అంబటి.. తాను కూడా పవన్‌పై సినిమా తీద్దామనుకుంటున్నానని దానికి నిత్య పెళ్లికొడుకు, బహుభార్యా ప్రవీణుడు, మూడు ముళ్లు-ఆరు పెళ్లిళ్లు, పెళ్లిళ్లు-పెటాకులు ఇలా ఏదో ఓ పేరు పెడతామన్నారు.
పవన్ దెబ్బకు అంబటి కాస్త భయపడుతున్నట్లే కనిపిస్తోంది. అసలే టికెట్ దక్కదన్న టెన్షన్ ఉంది. సత్తెనపల్లిలో వ్యతిరేకవర్గం యాక్టివేట్ అయ్యింది. దానికి తోడు కాపుల్లో వ్యతిరేకత వచ్చింది. మొత్తంగా అన్ని దుశ్శకునాలే కనిపిస్తున్నాయి. ఇప్పుడు బ్రో వివాదాన్ని అంబటే కెలికి కెలికి పెద్దది చేసుకున్నారు. ఆ పనికిరానివాడ్ని నేనే అని చెప్పకనే చెప్పుకున్నట్లైంది.
అంబటిపై పవన్ ఫ్యాన్స్ విరుచుకు పడుతున్నారు. పవన్ పెళ్లిళ్ల గురించి పదేపదే మాట్లాడింది ఎవరు..? ప్రెస్‌మీట్లు పెట్టిమరీ పవన్‌ను కవ్వించింది మీరు కాదా..? పవన్ తల్లి గురించి మాట్లాడింది ఎవరు…? పవన్‌ను మీ మంత్రి జోగి రమేష్.. తిడుతుంటే మీరేమైనా ఆపారా…? పవన్‌ను తిడుతుంటే మీ సీఎం నవ్వుతూ ఎంజాయ్ చేశారు కదా…! బ్రో సినిమాలో వాడిన డైలాగులు ఆ తిట్ల కంటే చాలా బెటర్ కదా…? అని ట్రోల్ చేస్తున్నారు. పోనీ మీరు సినిమా తీస్తానంటూ చెప్పిన టైటిళ్లు పవన్ వ్యక్తిగత ప్రతిష్ఠను భంగ పరిచేవి కదా… అది మీకు తెలియదా..?.! మీరు చెస్తే సంసారం పక్కవాళ్లు చేస్తే వ్యభిచారమంటే ఎలా సార్.. అని కడిగి పారేస్తున్నారు.