Roja VS Peddireddy: రోజాకు టికెట్ ఖాయం.. మరి పెద్దిరెడ్డి ఊరుకుంటారా..? వైసీపీలో వార్..!
నగరిలో టికెట్ ఎవరికి.. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి రోజాకా.. లేదంటే కొత్త ఫేస్ తెరమీదకు వస్తుందా అనే చర్చ జరుగుతోంది. ఐతే అక్కడి నుంచి ఈసారి కూడా రోజానే పోటీ చేస్తుందని జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది.
Roja VS Peddireddy: టికెట్ల వ్యవహారం.. వైసీపీలో రేపుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. నియోజకవర్గాల ఇంచార్జిలను మారుస్తూ.. జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో టికెట్ రాని వారంతా.. ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాత్రమే కాదు.. మంత్రులకు కూడా టికెట్ డౌటే అనే ప్రచారం జరుగుతోంది. మరికొన్ని లిస్ట్‌లు బ్యాలెన్స్ ఉండడంతో.. నెక్ట్స్ ఏం జరగబోతుందనే టెన్షన్ వైసీపీ నేతలను వెంటాడుతోంది.
YS JAGAN IN SHOCK: జగన్‌కు షాక్.. టీడీపీలో చేరిన విజయసాయి బావమరిది..
మిగతా నియోజకవర్గాల సంగతి ఎలా ఉన్నా.. నగరిలో టికెట్ ఎవరికి.. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి రోజాకా.. లేదంటే కొత్త ఫేస్ తెరమీదకు వస్తుందా అనే చర్చ జరుగుతోంది. ఐతే అక్కడి నుంచి ఈసారి కూడా రోజానే పోటీ చేస్తుందని జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. రోజాకు టికెట్ ఇవ్వడం లేదని జరిగిన ప్రచారం అంతా ఇంతా కాదు. ఆ మధ్య రోజా కూడా టికెట్ విషయంలో.. నెగిటివ్‌గానే రియాక్ట్ అయ్యారు. ఐతే చివరికి రోజాకే టికెట్ ఇచ్చేందుకు జగన్ మొగ్గు చూపుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఐతే ఇక్కడే అసలు సమస్య వచ్చిపడేలా కనిపిస్తోంది. నగరిలో సొంత పార్టీ నేతలే రోజా మీద గుర్రుగా ఉన్నారు. ఇక రోజా, మంత్రి పెద్దిరెడ్డి మధ్య జరుగుతున్న యుద్ధం అంతా ఇంతా కాదు. మరి ఇప్పుడు రోజాకు టికెట్ ఫైనల్ చేస్తే.. పెద్దిరెడ్డి చూస్తూ ఊరుకుంటారా.. సంచలన నిర్ణయం తీసుకుంటారా అనే చర్చ జరుగుతోంది. రోజా విషయంలో పెద్దిరెడ్డి మొదటి నుంచి సానుకూలంగా లేరు. నగరి నుంచి బీసీ వర్గానికి చెందిన ఓ నేతకు టికెట్ ఇప్పించేందుకు పెద్దిరెడ్డి ప్రయత్నించారని.. ఆ నేతకు హామీ కూడా ఇచ్చేశారనే ప్రచారం జరిగింది.
అలాంటిది ఇప్పుడు రోజాకు టికెట్ ఇస్తే పెద్దిరెడ్డి ఏం చేస్తారు.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది హాట్‌టాపిక్ అవుతోంది. ఇప్పటికే జగన్, పెద్దిరెడ్డి మధ్య దూరం పెరిగిందనే ప్రచారం జరుగుతోంది. పద్మా దేవేందర్ రెడ్డి అనే ఓ అధికారి విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయ్. అలాంటిది ఇప్పుడు తాను బాధ్యత వహిస్తున్న జిల్లా నుంచి.. అదీ తాను హామీ ఇచ్చిన స్థానం నుంచి తన వర్గానికి టికెట్ దక్కకపోతే.. పెద్దిరెడ్డి నిర్ణయం ఎలా ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ్. ఐతే అందరి అభిప్రాయాలు తీసుకునే నగరి విషయంలో రోజాకు టికెట్ ఇవ్వాలని జగన్ నిర్ణయం తీసుకొని ఉంటారని.. బయటకు కనిపిస్తున్న విభేదాలు, వివాదాలు.. పార్టీ మీద ఎలాంటి ప్రభావం చూపించే అవకాశమే లేదు అన్నది మరికొందరి అభిప్రాయం.