రేవంత్ ఇంటికి ఏపీ మంత్రి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసారు ఏపీ రవాణా శాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతున్న మహిళ ఉచిత బస్సు పథకం గురించి సిఎం ను అడిగి వివరాలు తెలుసుకున్నారు

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 25, 2024 | 05:25 PMLast Updated on: Dec 25, 2024 | 5:25 PM

Ap Minister Visits Revanths House

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసారు ఏపీ రవాణా శాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతున్న మహిళ ఉచిత బస్సు పథకం గురించి సిఎం ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సిఎం నివాసంలో కలిసి శాలువ పూల బొకేతో సత్కరించిన మంత్రి ఈ సందర్భంగా పలు విషయాలు చర్చించారు. వాటిలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయనున్న ఉచిత బస్సు పథకం పై ప్రథానంగా చర్చించారు.

తెలంగాణ రాష్త్రం లో మహిళలకు భద్రత, సౌకర్యవంతమైన ఉచిత బస్సు ప్రయాణం దిగ్విజయంగా కొనసాగుతున్న సందర్భంగా వివరాలు తెలుసుకున్నారు. అదేవిధంగా క్రీడాకారులకు నూతన పాలసీ ద్వారా రాష్ట్రం లో మంచి భవిష్యత్తు ఏర్పడుతుందని, నూతన కంపెనీ ద్వారా యువత కు మార్గదర్శకాలు అందిస్తున్నామనే పలు విషయాలపై సిఎంతో మంత్రి చర్చించారు.