Top story: నోటి దూల ఎంత పని చేసింది?
మనం అధికారంలో ఉన్నప్పుడు... చేతిలో పవర్ ఉన్నప్పుడు ఏం చేసినా చెల్లుతుంది. ఏం మాట్లాడినా నడుస్తుంది. అధికారం పోయిన తర్వాత అవతల వాడు కుర్చీలో కూర్చున్నాక మన సత్తా ఏంటో బయటపడుతుంది.
నోటి దూలతో అప్పుడు అడ్డు అదుపు లేకుండా అసహ్యకరంగా మాట్లాడి, ఇప్పుడు అడ్డంగా ఇరుక్కుంటున్నారు చాలామంది నేతలు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని వణికిపోతున్నారు. శ్రీ రెడ్డి ఏ నోటితో బండబూతులు తిట్టిందో ఆ నోటితోనే క్షమించమని బ్రతిమిలాడుతోంది. పోసాని అసలు రాజకీయాలే నాకొద్దు బాబోయ్ అని పారిపోతున్నాడు. ఆర్జీవి బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. వీళ్ల దుస్థితి చూసి జనం పగలబడి నవ్వుకుంటున్నారు.
ఎంత అగ్లీగా మాట్లాడితే అంత గొప్ప. ప్రత్యర్ధులనీ ఎంత బండబూతులు తిడితే పార్టీలో అంత ప్రతిష్ట. అక్రమ సంబంధాలు పెళ్లిళ్లు, పెటాకులు, ఇంట్లో వ్యవహారాలు, గడప దాటని ఆడవాళ్లు గురించి ఏ విషయంపైనైనా విచ్చలవిడిగా మాట్లాడితేనే రాజకీయం చేసినట్లు. సోషల్ మీడియాని అడ్డగోలుగా వాడుకుంటూ… మనం ఏం మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుందనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో చెలరేగిపోయారు కొందరు పొలిటిషన్లు, మరికొందరు పెయిడ్ ఆర్టిస్టులు. ఇప్పుడు వాళ్ళందరూ వనికి చస్తున్నారు.
వైసీపీ పెయిడ్ ఆర్టిస్ట్ శ్రీ రెడ్డి…. ఆ పేరు తలవాలంటే కూడా చాలామంది భయపడతారు. కొన్నేళ్ల క్రితం పవన్ కళ్యాణ్ ను ఒక ఛానల్ సహకారంతో నానా యాగి చేసి, ఆయన తల్లిని కూడా కించపరిచిన శ్రీ రెడ్డిని మొదట్లో పెంచి పోషించింది టిడిపినే. ఆ తర్వాత ఆమె రెడ్డి టాగ్ లైన్ తగిలించుకొని వైసిపి నేతల పంచన చేరింది. నోరు విప్పితే బండ బూతులు. శ్రీ రెడ్డి రోత కూతలు వింటే అసలు మహిళలు ఇలాంటి మాటలు మాట్లాడ గలరా అని చాలామంది ఆశ్చర్య పోయే పరిస్థితి ఉంది. కరుడు గట్టిన మగవాళ్ళు కూడా శ్రీ రెడ్డి మాట్లాడే బూతులు విని అసహ్యంతో వాంతులు చేసుకుంటారు.అలాంటి శ్రీ రెడ్డి ఐదేళ్లపాటు పాటు టిడిపి నేతల్ని ఆడ మగ అని చూడకుండా తన అగ్లీ కామెంట్స్ తో, బూతులతో అల్లాడించింది. అంతేకాదు జగన్తో విభేదించిన షర్మిలాని కూడా వదిలిపెట్టలేదు శ్రీ రెడ్డి. (స్పాట్ వీడియో) srireddy vs sharmila
నిజానికి జగన్ ఓడిపోవడానికి కారణాల్లో శ్రీ రెడ్డి లాంటి వాళ్లు కూడా ఒకరు. ఇప్పుడు అధికారం మారి ,శ్రీ రెడ్డి పై కేసులు పెట్టగానే దెబ్బకి ఆమె వనికి పోతుంది. లోకేష్ కి లేఖ రాసింది. పవన్ కళ్యాణ్ ని, లోకేష్ ని క్షమించండి అంటూ వేడుకుంటుంది. కానీ శ్రీ రెడ్డి ఏదో ఒక రోజు ఏదో ఒక కేసులో జైలుకు వెళ్లడం ఖాయం.
రాంగోపాల్ వర్మ. భారతదేశం సాంకేతికంగా గర్వించదగ్గ డైరెక్టర్లు ఒకరైన రాంగోపాల్ వర్మ….. చివరికి పెయిడ్ ఆర్టిస్ట్ గా, పెయిడ్ డైరెక్టర్ గా మారిపోయాడు. పవన్ కళ్యాణ్ ని, లోకేష్ ని, చంద్రబాబు నీ కించపరుస్తూ సినిమాలు తీయడమే కాకుండా…. వాళ్ళని వ్యక్తిగతంగా వెక్కిరిస్తూ చేస్తూ మార్ఫింగ్ ఫోటోలతో పోస్ట్లు పెడుతూ ఉండేవాడు. పవన్ కళ్యాణనీ వ్యక్తిగతంగా కించపరుస్తూ… వర్మ చేసిన వెర్రిమురి వేషాలు చాలా జుగుప్సాకారంగా ఉండేవి. ఒకప్పుడు శ్రీ రెడ్డి చేత కూడా పవన్ కళ్యాణ్ నీ ఒక న్యూస్ ఛానల్ లో తిట్టించిన చరిత్ర రాంగోపాల్ వర్మ ది. File bite ఇప్పుడు కేసులు పడగానే నాలికruచుకొని యాంటిసిపేటరీ బెయిల్ కోసం కోర్టులు చుట్టూ తిరుగుతున్నాడు వర్మ. బెజవాడలో నాకంటే రౌడీ లేడని చెప్పుకొని కాలరేగురేసిన వర్మ తనకి స్వయంగా సంక్షోభం వచ్చేటప్పటికి బెంబేలెత్తిపోతున్నాడు. ఇక రేపో మాపో ఊచలు లెక్కబెట్టబోతున్నాడు.
పోసాని కృష్ణ మురళి. గొప్ప రైటర్, మంచి డైరెక్టర్. జీవితంలో కష్టపడి పైకి వచ్చినాడు. టిడిపి పి ఆర్ పి పార్టీలో తిరిగి చివరికి జగన్ పంచన చేరి, రెండు చేతులతో కాలర్ లాక్కుంటూ పోసాని చేసిన జుగుప్సాకర మైన ప్రేలాపనలు జనానికి కూడా అసహ్యం కలిగించాయి. చంద్ర బాబు నీ ,పవన్ కళ్యాణ్ ని తిట్టిన తిట్టు తిట్టకుండా అసహ్యకరమైన పదాలతో… సాదాసీదా మధ్యతరగతి వ్యక్తులు కూడా చెవులు పూసుకునేటంత రోత తో పోసాని చేసిన యాగి అంతా ఇంతా కాదు. ఇదంతా జగన్ దన్ను చూసుకుని చెలరేగిపోయిందే. ఫైల్ బైట్ సినిమా ఛాన్స్ లు లేకపోయినా కూడా ఐ డోంట్ కేర్ అంటూ ఆవేశంతో ఊగిపోయిన పోసాని… గట్టిగా నాలుగు పోలీస్ నోటీసులు రాగానే… ఇప్పుడు ఏకంగా స్థానిక రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నానని… తను క్షమించాలని చేతులెత్తేసి పారిపోయాడు. (File పోసాని అప్పుడు ఇప్పుడు )తాను అరెస్ట్ అవ్వక తప్పదని… లాకప్ లో లాటి దెబ్బలు కూడా గ్యారెంటీ అని గ్రహించిన పోసాని సహజంగా వచ్చిన రచయిత తెలివితేటలతో ముందుగానే తెల్ల కర్చీఫ్ తీసి ఊపేశాడు. కానీ జనం దృష్టిలో ఒక వెకిలి వెధవలా మిగిలిపోయాడు. నోటి దూల పోసాని లాంటి వాడికి ఉన్న గౌరవం కూడా పోయేటట్లు చేసింది.
ఇక గుడివాడ నాని గురించి చెప్పనక్కర్లేదు. Filebite సహజంగా వచ్చిన కృష్ణాజిల్లా తెలివితేటలు, దూకుడు భాష తో చాలా రేగిపోయాడు కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ గుడివాడ నాని. ఎవడు… ఏం పీకుతాడు.?.. బోకు నా కొడుకు.. పకోడీ గాడు… లుచ్చా నా కొడుకు వాడమ్మా మొగుడు…. బొచ్చు పీకుతావా ?ఇలాంటి నీచాతి నీచమైన మాటలన్నీ పొలిటికల్ ప్రెస్ మీట్ లో అలవోకగా ప్రయోగించే గుడివాడ నాని అధికారం పోగానే సైలెంట్ అయిపోయాడు. అసలు ప్రెస్ మీట్ లో కూర్చుంటే ఫుల్ బాటిల్ కొట్టినోడి కన్నా ఎక్కువగా చండాలమైన బూతులతో చెలరేగిపోయే నాని ఇప్పుడు ఏ రోజు అరెస్టు అవుతానో తెలియక భయంతో నక్కి నక్కి తిరుగుతున్నాడు.
ఇక వల్లభనేని వంశీ. అసలు సిసలైన క్రిమినల్ మైండ్ కి మారుపేరైన వంశీ….. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో మామూలుగా చెలరేగిపోలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ….. ఆమెకు మాజీ హోమ్ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డికి వివాహేతర సంబంధం ఉందని అత్యంత నీచమైన మాటలు సాక్షి టీవీ స్టూడియోలో కూర్చొని మాట్లాడి తెలుగు రాష్ట్రాల్లో జనం అంతా ఛి అనేటట్లు చేసాడు. వైసిపి వాళ్ళు ఇక్కడితో ఊరుకోలేదు వల్లభనేని మాటలు పై అసెంబ్లీలో కూడా చంద్రబాబుని యాగి చేశారు. దాంతో చంద్రబాబు ఆ కౌరవ సభలో తాను ఉండలేనని మళ్లీ ముఖ్యమంత్రిగానే వస్తానని శపథం చేసి వెళ్లిపోయాడు. ఇంత అరాచకానికి కారణమైన వల్లభనేని వంశీ ఇప్పుడు పూర్తిగా రహస్య జీవితం గడుపుతున్నాడు. కానీ ఏదో కేసులో జైలుకు వెళ్ళకు తప్పదని ఆయనకే తెలుసు. దీనంతటికీ కారణం వంశీ నోటి దూల మాటలే.
కేవలం వీళ్లే కాదు ఇటీవల నటి కస్తూరి కూడా కరుణానిధి కుటుంబాన్ని ఆంధ్ర నుంచి తమిళనాడు రాజులకు సేవలు చేయడానికి వచ్చారంటూ హేళనగా మాట్లాడి చివరికి అరెస్టై జైలుకెళ్ళి వచ్చింది. దేశం మొత్తం మీద ఇలా చండాలమైన భాషతో, ప్రెస్మీట్లో, సోషల్ మీడియాలో మాట్లాడే లీడర్లు ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రమే ఎక్కువగా ఉన్నారు. ఇవాళ టిడిపి అధికారంలో ఉండటంతో వాళ్ళని ఒక ఆట ఆడుకుంటున్నారు పోలీసులు. వైసీపీ నేతలు అందరూ తమ నోటి దూలకు పరిహారం చెల్లించుకునే పరిస్థితి వచ్చింది. అధికారం ఉంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడి చివరికి ఇప్పుడు అధికారం కోల్పోగానే….. చేతులెత్తి బేర్ మంటున్నారు. బెంబేలెత్తిపోతున్నారు. కేవలం శ్రీ రెడ్డి, పోసాని, ఆర్జీవి లాంటివాళ్లే కాదు ఇప్పుడు ప్రతి ఊర్లోను ఇలాంటి అతిగాళ్ళు, నోటి దూలగాళ్లు ఎక్కువైపోయారు. చట్టాలకు పదును పెట్టి వీళ్ళందర్నీ కేసులు పెట్టి లోపలేసి తోమితే గానీ దానికి రారు. ఈ నోటి పూల గాళ్లను.. జనం చీకొట్టి మళ్లీమళ్లీ ఓడిస్తేనే సమాజంలో మంచి, మర్యాద, మాటతీరు ఎంతో కొంత మిగులుతాయి. అయితే కేవలం వైసిపి తరపు పైడ్ ఆర్టిస్టులు మాత్రమే కాదు టిడిపి జనసేన తరపు పెయిడ్ ఆర్టిస్టులు కూడా సోషల్ మీడియాలో చెలరేగిపోయిన వాళ్ళు ఉన్నారు. వైసిపి సోషల్ పెయిడ్ ఆర్టిస్టుల కంటే దారుణంగా మాట్లాడిన టిడిపి పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు. మరి వాళ్లపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అనే ప్రశ్నకు సమాధానం రావడం లేదు.