చాప్టర్ 3: వంశీకి ముహూర్తం ఫిక్స్, రైట్, లెఫ్ట్ హ్యాండ్ లు అరెస్ట్ అందుకేనా…?

ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ పై ఎన్నో అనుమానాలు... ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లోనే రెడ్ బుక్ అనేది ఉందా చింపి పడేసారా అంటూ సోషల్ మీడియాలో ఎన్నో కామెంట్స్. అధికారం కోసం రెడ్ బుక్ ను వాడుకుని మమ్మల్ని మోసం చేసారంటూ తెలుగు తమ్ముళ్ళు ఫైర్ అయిన సందర్భాలు ఎన్నో.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 2, 2024 | 03:30 PMLast Updated on: Nov 02, 2024 | 3:30 PM

Ap Police Ready To Arrest Gannavaram Ex Mla Vamsi

ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ పై ఎన్నో అనుమానాలు… ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లోనే రెడ్ బుక్ అనేది ఉందా చింపి పడేసారా అంటూ సోషల్ మీడియాలో ఎన్నో కామెంట్స్. అధికారం కోసం రెడ్ బుక్ ను వాడుకుని మమ్మల్ని మోసం చేసారంటూ తెలుగు తమ్ముళ్ళు ఫైర్ అయిన సందర్భాలు ఎన్నో. కాని సిఎం చంద్రబాబు నుంచి నాయకుల వరకు అందరూ… తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోలేరు అంటూ వార్నింగ్ లు… మాటలకే పరిమితం… జరుగుతున్నవి శూన్యం అంటూ కార్యకర్తల్లోనే కోపం పీక్స్ లో ఉంది.

కానీ… రెడ్ బుక్ రెండు చాప్టర్ లు కంప్లీట్ అయ్యాయి థర్డ్ చాప్టర్ రెడీ అవుతోంది అంటూ అమెరికా టూర్ లో మంత్రి నారా లోకేష్ చేసిన కామెంట్ తో ఏపీ పొలిటికల్ సర్కిల్స్ షేక్ అయ్యాయి. నెక్స్ట్ ఎవరూ అంటూ సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. రెడ్ బుక్ లో రెండు చాప్టర్ లు ఏం కంప్లీట్ చేసారనేది కార్యకర్తలు ఆలోచించడం షురూ చేసారు. జత్వాని కేసు, పార్టీ ఆఫీసు కేసు, నందిగం సురేష్, బోరుగడ్డ అనీల్ అరెస్ట్ లు, ఇలా ఒక్కొక్కటి ఇప్పుడు రెడ్ బుక్ లో భాగమే అని తెలుగు తమ్ముళ్ళు ఓ క్లారిటీకి వచ్చారు.

థర్డ్ చాప్టర్ స్టార్ట్ అయింది కావాలంటే గన్నవరం ఎమ్మెల్యే వెంకట్రావు, గుడివాడ ఎమ్మెల్యే రాముని అడగండి అంటూ లోకేష్ ఓ కామెంట్ చేసారు. ఆ ఇద్దరినీ ఉద్దేశించి అన్నారు అంటే… కచ్చితంగా గన్నవరం, గుడివాడ మాజీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కొడాలి నానీలను అరెస్ట్ చేయవచ్చు అంటూ ఇప్పుడు అభిప్రాయపడుతున్నారు. కొడాలి నానీ విషయం ఏమో గాని… వంశీ అరెస్ట్ కు మాత్రం గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయింది. ఇన్నాళ్ళు తప్పించుకుని తిరుగుతున్న వంశీని ఇప్పుడు మాత్రం తప్పించుకునే ఛాన్స్ లేకుండా ప్లాన్ చేస్తున్నారు.

వంశీ అనుచరులు ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకోవడం మొదలయింది. వంశీకి అన్ని విధాలుగా అండగా నిలిచే ముఖ్య అనుచరుడు… ఉంగుటూరు మండలానికి చెందిన యతీంద్ర రామకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. భార్యకు విడాకుల తర్వాత పరిహారం ఇవ్వడం లేదని అందుకు కోర్ట్ అరెస్ట్ వారెంట్ ఉందని… అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్తున్నారు. తప్పించుకుని తిరగడంతోనే అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించామని చెప్తున్నారు. కాని అతను టీడీపీ గన్నవరం ఆఫీస్ పై దాడి కేసులో నిందితుడిగా ఉన్నాడు.

అలాగే పలు కేసుల్లో కూడా నిందితుడిగా ఉన్నట్టు సమాచారం. ఈ నేపధ్యంలోనే అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. కానీ బలమైన కారణం మాత్రం… వంశీ వ్యవహారాలు అన్నీ రామకృష్ణకు తెలుసు. వంశీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో… షాడో ఎమ్మెల్యేగా ఆర్కే వ్యవహరించాడు. అందుకే అతన్ని అదుపులోకి తీసుకుంటే కచ్చితంగా వంశీని అరెస్ట్ చేయడం సులువు అవుతుందనే పోలీసులు భావించినట్టు సమాచారం. ఇటీవల మరో అనుచరుడ్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలా వంశీ రైట్, లెఫ్ట్ హ్యాండ్ అని తిరిగే వాళ్ళను ఒక్కొక్కరిని అరెస్ట్ లు చేస్తున్నారు. దీనితో వంశీని అరెస్ట్ చేయడం ఖాయం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాప్టర్ 3 లో భాగంగా వంశీ అరెస్ట్ ముందు ఉండవచ్చని టాక్.