AP VOLUNTEERS: ఓట్ల రాజకీయం.. ఏపీలో వాలంటీర్లను పీకేస్తారా ?

2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏపీ సీఎం జగన్ గ్రామీణ వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారు. ప్రతి 50 ఇళ్ళకు ఒకరిని చొప్పున గ్రామ, వార్డు వాలంటీర్లను నియమించారు. రాష్ట్రంలో 2 లక్షల మంది దాకా పనిచేస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 7, 2024 | 04:51 PMLast Updated on: Mar 07, 2024 | 4:51 PM

Ap Politics Around Volunteers Tdp Petition On Volunteers

AP VOLUNTEERS: ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల రాజకీయం మామూలుగా లేదు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఏ వర్గాన్ని దూరం చేసుకోవద్దనే తాపత్రయం పొలిటికల్ పార్టీల్లో కనిపిస్తోంది. వాలంటీర్ల వ్యవస్థ మీద అన్ని రాజకీయ పార్టీలు లేని ప్రేమను కురిపిస్తున్నాయి. 5 వేలతో పనిచేయించుకుంటున్న జగన్ ప్రభుత్వం.. ఎన్నికల ముందు తాయిలాలు ఇస్తోంది. మొన్నటిదాకా వాలంటీర్లు వేస్ట్.. వాళ్ళందర్నీ పీకెయ్యాలని పంతం పట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇప్పుడు మనసు మార్చుకున్నారు. వాళ్ళకి మరింత మెరుగైన అవకాశాలు కల్పిస్తామని చెబుతున్నారు.

Isha Ambani: ఇషా స్పెషల్ ఎంట్రీ.. ఒక్క బ్లౌజ్ ధరే కోట్ల రూపాయలు

2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏపీ సీఎం జగన్ గ్రామీణ వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారు. ప్రతి 50 ఇళ్ళకు ఒకరిని చొప్పున గ్రామ, వార్డు వాలంటీర్లను నియమించారు. రాష్ట్రంలో 2 లక్షల మంది దాకా పనిచేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను జనానికి అందించడంలో వీళ్ళే కీలకం. జనసేనాని పవన్ కల్యాణ్ ఆరోపణల తర్వాత వాలంటీర్ల వ్యవస్థ మీద వివాదాలు పెరిగిపోయాయి. మహిళలు కనిపించకుండా పోవడానికి వాళ్ళే కారణమని పవన్ ఆరోపించారు. డేటా బ్రీచింగ్ కి పాల్పడుతూ వైసీపీకి సైన్యంలా పనిచేస్తున్నారన్న టీడీపీ ఆరోపిస్తోంది. ఓటర్లను మభ్యపెట్టి వైసీపీకి ఓట్లు వేయిస్తారనీ.. వాళ్ళని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని కోర్టుల్లో పిటిషన్లు వేస్తున్నారు. చంద్రబాబు కూడా అనేక సార్లు వాలంటీర్ల వ్యవస్థ మీద మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇప్పుడు మనసు మార్చుకున్నారు. ప్రతి 50 ఇళ్ళకు ప్రతినిధులుగా ఉన్న వాలంటీర్లు ఎంత ముఖ్యమో బాబుకు బాగా అర్థమైనట్టుంది. తమ కూటమి అధికారంలోకి వస్తే… వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని భరోసా ఇచ్చారు.

ఒక్కర్ని కూడా ఉద్యోగాల నుంచి తొలగించం.. మీకు న్యాయం చేస్తాం.. ఇంతకంటే మెరుగైన జీవితం ఇస్తామని హామీ ఇస్తున్నారు. మీరు వైసీపీ ప్రభుత్వానికి కొమ్ము కాయొద్దని చెప్పారు చంద్రబాబు. కానీ ఏపీలో వాలంటీర్లు ఐదు వేల రూపాయలకు ఐదేళ్ళుగా పనిచేస్తున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు పార్టీలు వాళ్ళని మభ్యపెడుతున్నాయే తప్ప.. వాళ్ళకు జీతాలు పెంచుతామని ఏ పార్టీ హామీ ఇవ్వడం లేదు. ఇప్పటికీ వాలంటీర్ల ఉద్యోగాలకు గ్యారంటీ లేదు. కనీసం ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కూడా ఇవ్వట్లేదు. ఎన్నికల ఫలితాలను మార్చే పరిస్థితుల్లో వాలంటీర్లు అయితే లేరు. కానీ ప్రతి కుటుంబం వివరాలు వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళతో గొడవ పెట్టుకుంటే అసలుకే మోసం వస్తుందని పార్టీలు బుజ్జగిస్తున్నాయే తప్ప.. ఉద్యోగ భద్రత మాత్రం కల్పించడం లేదంటున్నారు వాలంటీర్లు. అయితే జగన్ ప్రభుత్వం వస్తే వాలంటీర్ల ఉద్యోగాలకు గ్యారంటీ ఉంటుంది. కానీ బాబు, పవన్ ఇప్పుడు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటారా.. లేదంటే జాబ్స్ నుంచి పీకేస్తారా ? చూడాలి.