Avanthi : టీడీపీలోకి అవంతి ఎంట్రీ కన్ఫార్మ్.! పోటీ చేయబోయేది అక్కడి నుంచే.!
ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీలోకి జంప్ చేసే నాయకులు కొందరు ఉంటారు.. అలాంటి వాళ్లు విశాఖ జిల్లాలో ఎక్కువ కనిపిస్తుంటారు అదేంటో ! మిగతా వాళ్ల సంగతి ఎలా ఉన్నా.. ఈ లిస్టులో అవంతి పేరు ఫస్ట్ లైన్‌లో వినిపిస్తుంటుంది.
ఎప్పుడూ ! ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్‌లోకి.. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి.. టీడీపీ నుంచి వైసీపీలోకి.. 14 ఏళ్ల పొలిటికల్ కెరీర్‌లో నాలుగు జంపింగ్స్ చేశారు. మరోసారి సైడ్ మార్చేందుకు సిద్ధంగా ఉన్నారా అంటే.. అవును అనే సమాధానం వినిపిస్తోంది. అవంతి శ్రీనివాస్.. టీడీపీలో చేరిపోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఫ్యాన్‌ను పక్కనపెట్టేసి సైకిల్ ఎక్కేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. చాలా ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నాయ్ ఈ విషయంలో ! పవన్ ఏం మాట్లాడినా.. వెంటనే మైక్ ముందుకు వచ్చేసి విరుచుకుపడే అవంతి.. ఈ మధ్య అసలు కనిపించడం లేదు. ఇది చాలు.. వైసీపీకి అవంతి గుడ్‌బై చెప్పేందుకు అనే రెడీ అయ్యారనే ప్రచారం జరుగుతోంది.
టీడీపీతో జనసేనకు ఎలాగు పొత్తు ఉంటుంంది. పైకి చెప్పకపోయినా.. అదే ఖాయం కూడా ! దీంతో జనసేనతో అవంతి శ్రీనివాస్ ఓ అండర్‌స్టాండింగ్‌కు వచ్చినట్లు విశాఖ టాక్. తనను తిట్టొద్దని పవన్ సందేశం పంపించారని.. అందుకే అవంతి సైలెంట్ అయ్యారని.. పవన్‌ను తిట్టడం మానేశారని టాక్. టీడీపీ వైపు అవంతి చూడడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయ్. వైసీపీ అధిష్టాన మీద ఆయన చాలా రోజులుగా రగిలిపోతున్నారు. జిల్లా నేతలతోనూ పెద్దగా టచ్‌లో ఉండడం లేదు. కష్టపడి పనిచేసినా.. తనను మంత్రిగా తొలగించారనే మంట.. అవంతిని వెంటాడుతోంది. జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ లాగేసుకున్నారన్న బాధ కూడా అవంతిలో కనిపిస్తోంది.
పంచకర్ల రమేష్ బాబు.. ఇప్పుడు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. రమేష్ కూడా కాపు సామాజికవర్గం నేతే ! దీంతో వచ్చే ఎన్నికల్లో తనను పక్కనపెట్టి భీమిలి నుంచి రమేష్‌కు అవకాశం కల్పించే అవకాశాలు ఉన్నాయన్న సంకేతాలు కనిపించడంతో.. పార్టీకి గుడ్ బై చెప్పేందుకు అవంతి సిద్ధం అయ్యారనే ప్రచారం జరుగుతోంది. టికెట్ దక్కదని దాదాపు ఓ నిర్ణయానికి వచ్చేసిన అవంతి.. సొంతగూటికి మళ్లీ చేరేందుకు సిద్ధం అయ్యారని.. ఎన్నికల ముందు టీడీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. చంద్రబాబు మీద విమర్శలు ఆపేసింది.. పవన్‌ను తిట్టడం మానేసింది కూడా అందుకేనట ! చంద్రబాబు నుంచి కూడా గ్రీన్‌సిగ్నల్ వచ్చిందని.. టికెట్ గురించి అవంతికి ఆయన అభయం ఇచ్చారని తెలుస్తోంది.
అనకాపల్లి నుంచి టీడీపీ తరఫున అవంతి పార్లమెంట్ బరిలో నిలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయ్. చంద్రబాబు ఇదే డీల్‌ను ముందు పెట్టారని.. దానికి అవంతి కూడా హ్యాపీ అయ్యారని టాక్. ఇదంతా ఎలా ఉన్నా.. అవంతి జంపింగ్ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతున్నా.. వైసీపీ మాత్రం కనీసం రియాక్ట్ కావడం లేదు.. పట్టించుకున్నట్లు కూడా కనిపించకపోవడం హైలైట్.